నాగమణి కోసం ఆశపడి నిలువు దోపిడీకి గురి అయిన 82 ఏండ్ల వృద్ధుడు !!?




                                    అమ్మాయి కనపడితే చాలు పదేండ్ల పిల్లవాడి దగ్గర్నుంచి పండు ముదుసలి వరకు చొంగ కార్చుకుంటుటారు కొంతమంది మగవాళ్ళు. వీరిలో ఉన్న ఈ  బలహినతనే ఆదారంగా చేసుకుని బ్రతిమాలో బ్లాక్మయిల్ చేసో తమ పబ్బం గడుపుకుంటుటారు, కొంతమంది కిలాడి లేడీ లు. అదిగో అటువంటి కోవలోకే వస్తారు ఈ  నాగమణి లాంటి వారు.

                   అయన గారి పేరు రాఘవయ్య . వయస్సు 82 సంవత్సరాలు. ఊరు ఖమ్మం దగ్గర పల్లెటోరు. అయన గారు ఈ  మద్య అంటే గత నెల 19 వ తారీకున సికింద్రాబాద్ నుంచి ఖమ్మం రైల్ లో వస్తున్నాడు. ఆ ప్రయాణం లో అయన గారికి నాగమణి అనే యువతి పరిచయమైంది. ఆమె ఈ  ముసలాయనతో మాటలు కలిపి పరిచయం చేసుకుంది. ఆ తర్వాత అయన వద్ద నుండి విజిటింగ్ కార్డు తీసుకుంది .

  ఆ మరుసటి రోజే హట్టాతుగా నాగమణి రాఘవయ్య గారి ఇంటికి వెళ్లింది . దీని తో ఉబ్బితబ్బిబ్బయిన రాఘ వయ్య ఆమె రాకకు కారణం అడిగితే , తనకు ఏదైన ఒక ఉద్యోగం చూపెట్టమని , తనకు అది తక్షణ అవసరమని చెప్పింది. దానితో మాటా మంచి పూర్తయ్యాక, అలా బయటకు వెళ్లి వద్దాం  రండి అంటూ రాఘవయ్య ని తీసుకుని బయటకు వెల్లింది. అలా వెళ్ళిన వారీకి  కైకోండాయి గూడెం జంక్షన్ దగ్గర కు వెల్లే సరికి ఇద్దరు మగవాళ్ళు వాళ్లకు కలిసారు. అంతే ! అప్పట్టి దాక తీయటి మాటలతో తన వెంట వస్తున్న నాగమణి ఒక్క సారిగా లేడీ విలన్ గా మారిపోయింది. వెంటనే కత్తులతో రాఘవయ్య ను బెదిరించి, అయన మెడలోని బంగారు గొలుసు, చేతి బ్రాస్లెట్, వేళ్ళకున్న ఉంగరాలు మొత్తం భంగారం 6 తులాలు బంగారం, 3 వేలు నగదును నిలువు దోపిడీ చేసి పరారు అయ్యారు. దీనితో ఒక్కసారిగా స్టన్న్ అయి పోయాడు రాఘవయ్య గారు.

   ఆ తర్వాత తేరుకుని పోలిసుల కు సమాచారం ఇస్తే వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వారి విచారణలో తేలిన విషయాలు ఏమిటంటే, నాగమణి ది  అసలు సికింద్రాబాద్ అట. ఆవిడ ఖమ్మం దగ్గర పాండు రంగా పురం లో శ్రీనివాస రావు అనే అతనితో కొద్దికాలం క్రితమే సహజీవనం చెయ్యడం మొదలు పెట్టింది. ఒక ప్రణాలిక ప్రకారమే రాఘవయ్య తో పరిచయం పెంచుకుని , రామారావు మరియు ఇంకొక అతనితో కలసి అతనిని దోచుకుంది. చివరకు పోలిసుల కృషితో ఆమె పట్టుబడింది. పోలిసులు నాగమణిని , శ్రీనివాసరావు అతని మిత్రుడు కలిపి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు అదీ కద!

  పై ఉదంతం లో నాగమణి లాంటి మాయ లేడీలు సక్సెస్ కావటానికి కారణం కేవలం మగవాడిలో ఉన్న బల హీనతే అని చెప్పవచ్చు. ఒక అమ్మాయి రైల్ లో పరిచయమైన  తెల్లారే ఇంటికి వచ్చి బయటకు రమ్మంటే ఏ మాత్రం అనుమానం లేకుండా అంత అనుభవం ఉన్న ముసలాయన ఆవిడ వెనుక వెళ్ళటమేమిటి? ఒక వేళ ఈ  విషయం లో కేసు బలం కోసం , విషయానికి కొంత కల్పన జోడించినా , రాఘవయ్య ,నాగమణి విషయంలో కొంత బలహీనతకు గురి అయ్యాడు అనే అనుమానం కలుగక మానదు. తన మీద ఇంట్రస్ట్ చూపించని మగవాడ్ని స్త్రీ ఏమాత్రం ఏమార్చలేదు. కాబట్టి ఈ  ఉదంతం వలన  మనం తెలుసుకోవాల్సింది ఒకటే, మగవాడికి స్త్రీ బల హీనతే ఎప్పటికైనా చేటు తేవడం ఖాయం అని.
                                          (6/12/2013 post Republished). 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!