ఇటువంటి ఎగబడే స్త్రీలను చూసే "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అన్నట్లుంది !!1
పబ్లిక్ లో అడ్డు అదుపు లేకుండా తెగబడి మాట్లాడే వారికి , ఎగబడి ఎదుటివారి మీద దౌర్జన్యం చేసే వారిని చూస్తే , "ఎందుకైనా మంచిది , ఇలాంటి వారితో పెట్టుకుంటే మన పరువే పోతుంది" అనుకుని సర్దుకుని పోయే వారే ఎక్కువుగా ఉంటారు మన సమాజం లో . అలా తెగబడే వారు పురుషులైతే ఒక మాట ఎదురు అనటమో , అవసరమైతే ఒక దెబ్బ కొట్టడమో చేస్తుంటారు బాదితులు కొందరు. కాని స్త్రీల విషయం వరకు వచ్చే సరికి ఎదురు తిరిగి పబ్లిక్ లో దెబ్బ కొట్టడానికి జంకు గానే ఉంటుంది. కారణం మన సమాజం లో స్త్రీలకు ఇచ్చే గౌరవం కావచ్చు, వారి పట్ల ఉండె సాను భూతి కావాచ్చు. అప్కోర్స్ ఈ సూత్రం నాలుగు గోడల మద్య పని చేయదు అనుకోండి. నేను చెప్పేది పబ్లిక్ ప్లేస్ లలో గురించి కాబట్టి అంతవరకే ఈ విషయం పరిమితం.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల బలం బలం తెలిసిన ఆదునిక మహిళలు కొందరు పబ్లిక్ గా అసహ్యకర రీతిలో ప్రవర్తిస్తూ అది తమ స్వేచ్చ అనుకుంటున్నారు. ఎవరైనా వారి ప్రవర్తనను ఆక్షేపిస్తే చట్టాలో ని ఇబ్బందికర సెక్షన్ లతో తప్పుడు కేసులు పెట్టి వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు త్రాగిస్తున్నారు. అందుకు గొప్ప ఉదాహరణ బిగ్ బాస్ 5 సెలబ్రిటి "పూజా మిశ్ర". ఈమె గారి గురించి స్వరూప్ సర్కార్ అనే బ్లాగర్ ఏమన్నారోPooja Mishra - Light , Camera , Action : Men are Human too లింక్ లో చూడవచ్చు. ఇక పబ్లిక్ ప్లేస్ లో ఆమె గారి విపరీత ప్రవర్తన ఎలా ఉంటుందో క్రింది విడియో ద్వారా ఉదహరణ గా తెలుసుకోవచ్చు.
ఇక పొతే పైన తెల్పిన ఆవిడ ఒక సెలబ్రిటీ కాబట్టి ఏదో వంకతో పబ్లిసిటి తెచ్చుకుని దానితో లబ్ది పొందడానికి అలా త ప్రవర్తిస్తుంది అనుకోవచ్చు. కాని ఒక మీడియా చానల్ తో ధర్మ ప్రబోదకు రాలు అని పరిచయం చేయబడి , మీడియా కార్యక్రమంలో ఒక చర్చ లో పాల్గొన్న సందర్బం లో , తన గురించి ఏదో అన్నాడనే నెపంతో , మరొక ధర్మ ప్రబోదకుడు మీద , కోట్లాది మంది వీక్షకు;ల సాక్షిగా దాడికి సిద్ద పడిన ఈ దీపా శర్మ అనే లేడి గురువు ప్రవర్తనను ఏమనాలి?. నిజంగా అదే ఒక మగ వాడు, ఆమే మీద ఆమె చేసిన విధంగానే దాడి చేస్తే ఈ పాటికి దేశం లోని మీడియా సహిత స్త్రీ వాదం గగ్గోలు పెట్టేది . కానీ అలా జరుగలేదు అంటే అది భారత దేశం లో . స్త్రీ పట్ల చూపే సాంప్రదాయ పక్షపాత దోరణి. ఆ సాంప్రాదాయ దోరణిని అలుసుగా తీసుకునే కొంత మంది స్త్రీలు పబ్లిక్ లో రెచ్చి పోతు , స్త్రీ అంటె చీదరించుకునే లా చేస్తున్నారు. ఇటువంటి స్త్రీలకు స్త్రీలే బుద్ది చెపితే బాగుంటుంది కాని , మోడ్రన్ స్త్రీ వా దం అందుకు ఒప్పుకోదు కదా! స్త్రీలంతా ఒకటే జాతి అని అడ్డగోలు వాదం తో మెజర్తీ స్త్రీలను నోరెత్తకుందా చేస్తుంది. మరి ఆ లేడీ ధర్మ గురువు ఎలా ప్రవర్తించిందో క్రింది విడియో చూసి తెలుసుకోంది
.
దేనికైనా హద్దు ఉంటుంది. స్త్రీలకైనా , పురుషుల కైనా ఒక కట్టుబాటు ఉంది. దానిని ఉల్లంగించి ప్రవర్తిస్తే పలితం అనుభవించక తప్పదు. ఎల్ల కాలం సమాజం ఒకే లా ఉంటుంది అనుకోవడం బ్రమ.ఇప్పటి దాక పురుష స్వామ్యం నడుస్తుంది కాబట్టి , స్త్రీల అబలత్వం పట్ల సానుభూతితో , ఏది జరిగినా స్త్రీలను వెనకేసుకు రావడం మనకు సాంప్రదాయంగా ఉంది. కాని ఇలాంటి "అతి" అతివలలో వెక్కువైతే మళ్లి "న స్త్రీ న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అన్న కాలం తిరిగి వస్తుంది. అలా జరుగకుండా చూడాలి అంటే " స్త్రీ వాదం " కి బదులు "సమవాదం " గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. "ఒప్పు చేసిన వారిని ఆదరిద్దాం , తప్పు చేసి వారిని శిక్షిద్దాం " అనే సూత్రాన్ని స్త్రీ పురుషులకు ఇరువురికి అన్వయించి ఒక పటిష్టమైన , క్రమశిక్షణా యుతమైన సమాజాన్ని నిర్మాణానికి జాతి సిద్దం కావాలి. .
(15/9/2015 post republished)
Comments
Post a Comment