మన దేశంలో 'హిందూ మతం "ని బలహీన పరచడానికి విదేశి మత సంస్థ నుండి పెద్ద మొత్తంలో డబ్బు స్వీకరించిన ఆ స్వదేశి "చరిత్ర కారిణి " ఎవరు?!!!

                                                      

         
 నిన్న ఆంద్ర జ్యోతిలో ప్రచురితమైన రిటైర్డ్ DGP గారు అయిన శ్రీ K అరవింద రావు గారి వ్యాసం  మన దేశం లో కొంతమంది కుహనా మేధావులు ,ఈ దేశ మత, సంస్కృతులు మీద పని కట్టుకుని దాడి చెయ్యడం వెనుకాల ఎలాంటి విదేశి కుట్రలు సాగుతున్నాయో,చాలా చక్కగా వివరించింది .

   నేను ఇంతకు ముందు నా  బ్లాగులో అనేక సార్లు ఇదే విషయం చెప్పడం జరిగింది . మన దేశంలో జనించి ,కొనసాగుతున్న ఏ మత విదానO వలన మనకు ఎలాంటి ఇబ్బంది లేదు .ఉండబోదు కూదా. విదేశి మతస్తుల వలన ప్రవేశ పెట్టబడినప్పటికి , విదేశి ఆర్దిక ప్రయోజనాలకు ప్రబావితం కాకుండా కేవలం తను నమ్మిన విదానం ని ఆచరించే వారి వల్ల కూడా ఈ  దేశానికి  ఎటువంటి ప్రమాదం లేదు .కాని విదేశి పండ్లతో తమ పబ్బం గడుపుకుంటు స్వదేశి జీవన విదానం మీద విషం గ్రక్కుతున్న వారి గురించి,ఈ దేశాన్ని ప్రేమించేవారు ఆలోచించాల్సిన అవసరం ఉంది . వ్యక్తిగతం గా తాము నాస్తికులమని చెప్పుకుంటూ ,తమకు ఎ మతం మిద విశ్వాసం లేదని బుకాయిస్తూ , సమయం వచ్చేసరికి విదేశి మత వర్తనుల వైపు వకాల్తా పుచ్చుకుని అడ్డగోలు వాదం చేస్తున్న కుహనా మేదావుల తీరును ఎండగట్టాల్సిన అవసరం ఉంది . ఒక మతం లోని తప్పు ఒప్పులు ఎంచాల్సిన అవసరం మరొక మతానికి లేకపోవచ్చు .కాని ఒక కుట్రలో బాగంగా ఈ దేశ  సంస్కృతి ,జీవన విదానం మీద దాడి చేస్తున్నప్పుడు , అదాడి  చెసే వారి  మతవిదానాలు లో లోపాలు   ,వాటిని ప్రశ్నించకుండా కేవలం హిందూ జీవన విదానం లోని లోపాలనే గేలి చేస్తున్న కుహనా మేదావుల వైఖరిని ఎత్తి చుపాల్సిందే .


 ఒక కేసు లో సుప్రీం కోర్టు వారు అన్నట్లు ,ఈ దేశం లో మైనార్టి  మతస్తులకు ఎలాంటి సౌకర్యాలు , రక్షణ లభిస్తున్నాయో ,అలాంటి సౌకర్యాలు ,రక్షణ ఈ  దేశం లో పుట్టి కొనసాగుతున్న మేజార్తి మతం కి వర్తిస్తాయి . మనం ఈ దేశం లో మెజార్టి మతస్తులు గా కనిపించవచ్చు .కాని "గ్లోబల్ విలేజ్ "కాన్సెప్ట్ అభివృద్ధి చెందుతున్న నేటి తరుణంలో ,ప్రపంచ పరంగా చూస్తే మనం మైనార్టిలమ్ . అందుకే మన రక్షణ మనకు ముఖ్యం . అట్టి రక్షణ ఇచ్చే విదానాలే  మనకు కావాలి తప్పా ,కుహనా సెక్యులరిస్టుల విదానాలు  కావు  అనేది సత్యం . మనకు కావాల్సింది 'గ్లోబల్ ద్రుష్టి " . మనం గ్లోబల్ మైనార్టిలం . మైనార్టిలకు ఉండె అన్ని  రక్షణ  సౌకర్యాలు మనకూ ఉండాల్సిందే . దట్సాల్ . 


    

శ్రీ K అరవింద రావు గారి వ్యాసంని చదవండి .

                                        


మతమార్పిడులకు   కారణాలేమిటి    (02Jan2015)


ఇటీవలి కాలంలో సామాజిక శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని గమనించారు. 20 వ శతాబ్దాన్ని భావజాలము సిద్ధాంతాలు ప్రధానంగా ఉండిన శతాబ్దం (The century of Reason) అనీ, 21 వ శతాబ్దాన్ని సంస్కృతి, మతం ప్రధానంగా మారిన శతాబ్దమనీ (Century of Religion) వ్యాఖ్యానించారు. 20వ శతాబ్దం ప్రారంభం నుండి మార్క్స్‌ భావజాలం, రష్యాలో విప్లవం, లెనినిజం, స్టాలినిజం, చైనా విప్లవం, ప్రపంచ యుద్ధాలు ఇవన్నీ ఒక వైపు. మరోవైపు సామ్రాజ్యవాదం. కోల్డ్‌ వార్‌ పరిస్థితులు- ఇవన్నీ భావజాలంతో ముడిపడిన అంశాలు కోల్డ్‌వార్‌ ముగిసే సమయానికి ప్రపంచమంతటా శాంతి వెల్లివిరుస్తుందని కొందరు భావించారు. కానీ చరిత్ర మరోరకంగా మలుపు తిరిగింది.సుమారు సంవత్సరాల క్రితం Huntington అనే అమెరికన్‌ రచయిత "The Clash of Civilizations'అనే ప్రముఖ పుస్తకాన్ని రాశారు. ప్రపంచ దేశాలు వాటి మూల సంస్కృతుల ఆధారంగా దగ్గరకు వస్తున్నాయని ఆయన గమనించాడు. 10వ శతాబ్దం నుండి పాశ్చాత్య సంస్కృతికీ, అరబిక్‌ దేశాల సంస్కృతికి మధ్య జరిగిన ఘర్షణలు కొత్త రూపంలో పునరావృతం కావడం ఆయన విశ్లేషించాడు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థికరంగమే కాకుండా సంస్కృతి, మతం ప్రపంచీకరణ కావడం ఒక ముఖ్య పరిణామం. ప్రపంచంలో పెత్తనం చెలాయించడానికి ఏ ఏ దేశాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశాలున్నాయని ఈయన వివరంగా రాశారు. మతం ఒక ముఖ్యపాత్ర వహిస్తుందని చెప్పారు.
పాశ్చాత్యదేశాల్లో జరుగుతున్న మార్పుల్ని చూస్తే వివాహవ్యవస్థ, కుటుంబవిలువలు బలహీనం కావడం, నాస్తికవాదం పెరగడం గమనించగలం. ఇంతకన్నా ముఖ్యంగా యూరోపియన్‌ దేశాలకు వలస వెళ్లిన ఇస్లాం మతస్తుల సంఖ్య పెరగడం పాశ్చాత్యదేశాలకు ఆందోళన కలిగించే విషయం. దివంగత లిబియా అధ్యక్షుడు గడాఫీ ఒకానొక సందర్భంలో ఇలా అన్నాడు- ‘మనం ఒక సైనికుడిని పంపకుండా, ఒక బుల్లెట్‌ కాల్చకుండా మరికొన్ని సంవత్సరాల్లో యూరోపును ఆక్రమించుకోగలం’. రాబోయే 25 సంవత్సరాలలో యూరోపు ఖండంలో ఇస్లాం మతస్తులు మెజారిటీ సంఖ్యలో ఉంటారని జనాభా విశ్లేషకుల అంచనా. ఇట్టి పరిస్థితుల్లో భారతదేశంలో మనం మతమార్పిడుల పట్ల ఎంత ఆందోళన చెందుతున్నామో అలాంటి ఆందోళన పాశ్చాత్యదేశాల్లో కూడా చెందుతుండడం వాస్తవం. పైకి ఎంతో నిబ్బరంగా కనిపిస్తున్నా పైన చెప్పిన పరిస్థితిని నివారించడానికీ, ఇస్లాం దేశాలను బలహీనపర్చడానికీ, భారతదేశం లాంటి బలహీనదేశాల్లో తమ సంఖ్యను పెంచుకోవడానికి వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. ఈ విధంగా మతమార్పిడి అనే అంశం రాజకీయంతోనూ సామ్రాజ్యవాదంతోనూ ముడిపడిన విషయంగా మారింది. Monotheism and Imperialism  (ఏకవాదం మరియు సామ్రాజ్యవాదం) అనే విషయంపై మనం ఇంటర్నెట్‌లో వెతికితే ఈ రెండింటి మధ్య సంబంధం గురించి తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వ్యూహాల్లో భాగంగా అంతర్యుద్ధం, మారణకాండలతో మనకన్నా ఎక్కువ నష్టపోతున్న దేశాలు ఇస్లామిక్‌ దేశాలే.
ప్రపంచం మొత్తంలో క్రైస్తవం మొదటి స్థానంలోనూ, ఇస్లాం రెండవ స్థానంలోనూ, బౌద్ధమతం మూడవస్థానంలోనూ ఉండగా హిందూమతం నాలుగవస్థానంలో ఉంది. మిగతా మతాలతో పోలిస్తే హిందూమతంలో ఎలాంటి సంస్థాగత నిర్మాణం. ప్రచార యంత్రాంగం ఎంతో బలిష్టంగా ఉన్నాయి. ‘‘ప్రపంచాన్నంతా మా మతంలోకి మార్చాలని మా దేవుడి ఆజ్ఞ. మాపై ఆ భారం ఉంది’’ అంటూ ఈ రెండు మతాలూ ప్రపంచదేశాలన్నింటిలోనూ అనుసరిస్తున్న విధానమే భారతదేశంలో కూడా అనుసరిస్తున్నాయి. హిందూమతంలో దేవుడు అలాంటి ఆజ్ఞ ఇవ్వలేదు. పై పెచ్చు ఇతర దేవుళ్లను ఎవరిని పూజించినా నన్ను పూజించినట్లే అన్నాడు కృష్ణుడు. మీరు ఏ పార్టీలో ఉన్నా ఫరవాలేదు మంచి పనులు చేయండి అన్నట్లు మన సిద్ధాంతం. దీని ఫలితంగా హిందూ మేధావుల్లో ఉదారవాదం, ఇతరుల వ్యూహాల్ని తెలుసుకోలేకపోవడం. దాని ఫలితంగా హిందూ సమాజం క్రమేణా తగ్గడం జనాభా అంకెల్లో గమనించవచ్చు. ఇదే సందర్భంలో చైనాలోని కమ్యూస్టు పార్టీవారు "Evangelism is a disease to be cured ' అని చెబుతూ మత మార్పిడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఒక దేశాన్ని మరొకదేశం అదుపులోకి తెచ్చుకోవాలంటే రెండు పద్ధతులు. ఒకటి దాడిచేసి వశంలోకి తెచ్చుకోవడం, రెండవది ఆ దేశంలోని అంతర్గత వ్యవస్థనూ, ఆ దేశ సంస్కృతినీ బలహీనపరిచి, తమ సంస్కృతిని, మతాన్ని వ్యాపింపచేసి ఆ దేశంలో తమ అనుయూయులు ఉండేట్లుగా చూసుకొని తోలుబొమ్మ ప్రభుత్వాలని నడుపుతూ పెత్తనం చెలాయించడం. పాశ్చాత్యదేశాలు ప్రపంచంలోని అనేక చిన్న దేశాలపై ఇలాంటి పెత్తనమే చేయడం గమనించగలం. భారతదేశం చూడడానికి పెద్దదేశమే అయినా బలహీన రాజకీయ వ్యవస్థ ఉండటం వల్ల ఇతరులు తమ వ్యూహాల్ని వీలైనంత తీవ్రంగా అమలు పరుస్తూ ఉన్నారు. మనదేశ మేధావుల్ని ఆకర్షించడం. వారి ద్వారానే మన సంస్కృతికీ, దేశభద్రతకూ ప్రమాదం కలిగించే రచనలు చేయించడం ఈ వ్యూహంలో భాగం. భారతదేశాన్నీ, సంస్కృతినీ విమర్శిస్తూ మాట్లాడేవారు, పుస్తకాలు రాసే వారు పాశ్చాత్యదేశాల నుండి సత్కారాలు పొందడం చూడవచ్చు. అలాంటివారు ఆ సంస్కృతుల తప్పుల్ని దాచివేయడం సహజం.
సుమారు 3 సంవత్సరాల క్రితం ప్రచురించబడిన "Breaking India'' అనే పుస్తకంలో పాశ్చాత్య వ్యూహకర్తలు భారతదేశాన్ని బలహీనపరచడానికీ, మతాల ఆధారంగా విడగొట్టడానికీ ఎలాంటి వ్యూహాల్ని ఆలోచిస్తున్నారు అన్న విషయంపై అనేక ఉదాహరణలు చూడగలం. పుస్తక రచయితల భాషణలు యూట్యూబ్‌లో వినగలం. మతాన్ని బలహీనపరచడం ద్వారా దేశాన్ని ఎలా బలహీనపరచవచ్చు. వీలైతే విడగొట్టవచ్చు అనేది ఇందులో విషయం. మన మేధావులు పొందిన సత్కారాల గురించి కూడా ఇందులో వివరించారు. ఒక ప్రఖ్యాత చరిత్రకారిణికి ఒక మత సంస్థ పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు రాసినా, ఆ రచయిత్రి దాన్ని ఖండించలేదు. దేశ భద్రత గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది. ఇంటర్నెట్‌ ఫలితంగా ఈ గ్రంథ రచయిత రాజీవ్‌ మల్హోత్రా ప్రసంగాల్ని యూట్యూబ్‌లో వినవచ్చు.
మతం అంటే మనమెవరూ చూడని దేవుడు. స్వర్గం-నరకం మొదలైన విషయాలపై ఒక సమాజానికున్న కొన్ని నమ్మకాలు. సైన్సు ఇంతగా అభివృద్ధి చెందిన ఆధునిక యుగంలో ఎవరూ చూడని విషయాలపై మాదే సరైన వాదం అంటూ దాన్ని విస్తరించేవాళ్ల ఉద్దేశాలు కేవలం మతవిశ్వాసమే అనడానికి వీళ్లేదు. సామ్రాజ్యవాదం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
భారతదేశంలో మెజారిటీ అనుకునే హిందూ సంస్కృతి ప్రపంచస్థాయిలో మైనారిటీలో ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇతర సంస్కృతులు ఎంతో బలంగా చొచ్చుకురావడం రోజురోజుకూ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మనదేశం కనీసం ఇప్పుడున్న స్థితిలోనైనా సమగ్రంగా ఉండాలా వద్దా అన్నది మన ముందు ఉన్న ప్రశ్న. మత విస్తరణను సామ్రాజ్యవాదానికి అనువైన ఆయుధంగా ఇతరులు వాడుకోవడం మన దేశాన్ని ప్రేమించేవాళ్లందరూ అర్థం చేసుకోవాలి 

Source:  http://epaper.andhrajyothy.com/detailednewsbox=Li4vRmlsZXMvMjAxNTAxMDIwMTAxMTExNzU3MTAwLmpwZw==&day=20150102

                                         ( 3/1/2015 post Republished).

Comments

 1. Narasimha Rao Garu, a sample of how our History books were modified. Please go through these links - 1) https://voiceofdharm.wordpress.com/2016/09/08/how-vedic-history-was-deleted-by-ncert-in-school-communist-anti-india-agenda-of-congress-exposed/ & https://pparihar.com/2016/09/08/how-vedic-history-was-deleted-by-ncert-in-school-communist-anti-india-agenda-of-congress-exposed/comment-page-1/#comment-12657

  ReplyDelete
 2. 2) On 26th Aug 2015, A delegation of scholars having national concerns met Hon'ble minister for state - culture and tourism as part of follow up on issue of Vedic Aryan Migration and requested correction in GOI website to knowindia.

  http://knowindia.gov.in/knowindia/culture_heritage.php…

  Hon'ble minister, understood the issue and ordered a study and thereby correction in the introductory content to Vedic Civilization.

  The delegation was led by Pt Shri M R Sharma, Chairman WBF India and matter was presented by Shri Lalit Mishra

  ReplyDelete
 3. THE EARLIEST EPIGRAPHIC EVIDENCE OF THE EPOCH OF KALIYUGA

  Two inscriptions have been found in 1897 on the Garudastambha of Trivikramasvami temple located in Peddacherukuru, Guntur district, Andhra Pradesh. One inscription is dated Kaliyuga 2625 (477 BC) and another inscription is dated Kalituga 2628 (474 BC). The date is given in Sanskrit "Kalyadyabdagane ashta(8) netra (2) rasa (6) dos (2) sankhye gate vatsare, Prapte'tha Prabhave Tapasyapi site pakshe dvitiyaa gurau...". These inscriptions refer to a Chalukya king Vishnuvardhana who was ruling from his capital Rajamahendravaram.

  Colonial historians failed to explain these inscriptions in the distorted chronology. Therefore, they conveniently distorted the date from Kali 2628 to 4428 by adding 1800 years. No historian ever objected to this kind of glorious methodology of Indian historical research till date.

  Source: https://www.facebook.com/photo.php?fbid=745284485613494&set=a.342774972531116.1073741826.100003958476692&type=3&theater

  ReplyDelete
 4. Deplorable Scenario : Systematic Destruction of Vedic Era History Education in Universities, Beyond NCERT Scandal

  NCERT scandal of erasing Vedic History from it's 10+2 curriculum, seems to be just a tip of iceberg. Education on Vedic era History is systematically vandalized, deteriorated in previous decades from all top universities with a few exceptions.

  The ugly lobby of accused history professors registered terrific success in their dubious agenda :

  A) Probably, none of faculties of universities listed below has a PHD in Vedic Era History

  B) Only one professor Krishnendu Ray of Calcutta university has a BA and Certificate course in Sanskrit which is prerequisite for Vedic Era history.

  Comparatively, Calcutta University has maintained a balance in specialization of faculties teaching ancient history, It has 03 professors teaching Pre Buddha history in a way, Vedic Era History. http://www.caluniv.ac.in/academic/arts_%20ancient.htm…

  However, situation is very bad in universities listed below, Not a single professor has got specialization in Vedic Era history, no specific diploma nor certification in Vedic Corpus

  1) JNU = http://www.jnu.ac.in/SSS/CHS/people.htm

  2 ) Pune = http://www.unipune.ac.in/…/mental_moral_and_social_science/…

  3) Researches getting conducted in Pune University = http://www.unipune.ac.in/…/history/his_webfiles/research.htm

  4) Madras = http://www.unom.ac.in/index.php…

  5) Karnataka = http://www.kud.ac.in/content.aspx…

  6) Bangalore = http://bangaloreuniversity.ac.in/history/

  7) Ambedkar = http://www.aud.ac.in/faculty/permanent-faculty

  8) Assam University = http://www.aus.ac.in/history.html

  Taken from Mr. Lalit Mishra Facebook (Friend) Post

  ReplyDelete

Post a Comment

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )