"నార్వే"వారిది "నరసింహ రక్షణా" లేక "హిట్లర్ శిక్షణా"?.
వల్లభనేని చంద్రశేఖర్,అనుపమ(తల్లి తండ్రులు) మన పురాణాలలో, పిల్లల రక్షణకు సంబందించి అద్బుతమయిన కథ"ప్రహ్లాద చరిత్ర".తన కుమారుడు తనకు ఇష్టం లేని చదువులు చదువుతున్నాడని తండ్రి "హిరణ్యకశిపుడు", కుమారుడయిన ప్రహ్లాదుని నానా కష్టాలకు గురి చేస్తాడు. అలా కష్టం కల్పించిన ప్రతిసారి ఆ శ్రీహరి, బాలుని కాపాడుతూనే ఉంటాడు. చివరకు అతని ఆగడాలు మితిమీరడంతో, పరమాత్మ "నరసింహ స్వామి" రూపంలో ఉద్బవించి ’హిరణ్యకశిపుని’ వదించి "బాల రక్షణ’ "భక్త రక్షణ" గావిస్తాడు. కాబట్టి మన దేవుళ్లలో నరసింహ స్వామి ని బాల సంక్షేమానికి ప్రతీకగా చెప్పవచ్చు. మొన్న నార్వే దేశంలో ఒక పిల్లవాడు మూత్ర విసర్జన బట్టల్లొనే చెస్తే, స్కూల్ టీచర్లు ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకు రమ్...