"నార్వే"వారిది "నరసింహ రక్షణా" లేక "హిట్లర్ శిక్షణా"?.
వల్లభనేని చంద్రశేఖర్,అనుపమ(తల్లి తండ్రులు) |
మన పురాణాలలో, పిల్లల రక్షణకు సంబందించి అద్బుతమయిన కథ"ప్రహ్లాద చరిత్ర".తన కుమారుడు తనకు ఇష్టం లేని చదువులు చదువుతున్నాడని తండ్రి "హిరణ్యకశిపుడు", కుమారుడయిన ప్రహ్లాదుని నానా కష్టాలకు గురి చేస్తాడు. అలా కష్టం కల్పించిన ప్రతిసారి ఆ శ్రీహరి, బాలుని కాపాడుతూనే ఉంటాడు. చివరకు అతని ఆగడాలు మితిమీరడంతో, పరమాత్మ "నరసింహ స్వామి" రూపంలో ఉద్బవించి ’హిరణ్యకశిపుని’ వదించి "బాల రక్షణ’ "భక్త రక్షణ" గావిస్తాడు. కాబట్టి మన దేవుళ్లలో నరసింహ స్వామి ని బాల సంక్షేమానికి ప్రతీకగా చెప్పవచ్చు.
మొన్న నార్వే దేశంలో ఒక పిల్లవాడు మూత్ర విసర్జన బట్టల్లొనే చెస్తే, స్కూల్ టీచర్లు ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకు రమ్మంటే,ఆ పిల్లవాడు ఇంటికి పోనని, ఇది తెలిస్తే తన తండ్రి ఊరుకోడని, అప్పటికి ఒకసారి ఇలానే ఇంట్లో చేస్తే,తండ్రి మందలించడమే కాక ఇంకొక సారి పాస్ పోస్తే,ఇండియా పంపిస్తానని బెదిరించాడని చెప్పాడట.అంతే! అది అక్కడి చట్టాల ప్రకారం పెద్ద నేరమట.వేంటనే స్కూల్ వారు "పిల్లల సంరక్షణ అదికారులుకు పిర్యాదు చేయడం, వారు వచ్చి,పిల్లాడిని,కొన్నాళ్లు వారి సంరక్షణలో ఉంచుకుని వదిలేసినప్పటికి, ఆ ఆంద్రా తల్లి తండ్రుల మీద కేస్ పెట్టి, 18 నెలల జెయిల్ శిక్షకు సిపార్సు చేస్తే, అది ఈ రోజే "తీర్పు" కోసం ఉంది. ప్రస్తుతం ఆ ఆబాగ్య తల్లి తండ్రులు వల్లభనేని చంద్రశేఖర్,అనుపమ, అక్కడి జైల్లోనే ఉన్నారు. వీరు క్రిష్ణా జిల్లా,హనుమాన్ జంక్షన్ కు చెందిన వారు.
నార్వె చట్టాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?.ఇది పిల్లల పట్ల వారికున్న " శ్రద్దా నిబద్దత" అనాలా? లేకా పిల్లల్ని, సహజ ప్రేమాను బందాలకు అతీతంగా ఒక సైంటిఫిక్ తరహాలో పెంచాలని చేసిన చట్టాలా? ఒక వేళ నిబద్దతె అయితె తల్లి తండ్రులకు కౌన్సిలింగ్ తరహాలో వారి తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశాలు ఇవ్వాలి కదా? అలా చెయ్యడం లేదని తెలుస్తుంది.
మొదటిది మన "నరసింహ రక్షణ" అయితే రెండవ తరహా ఖచ్చితంగా "హిట్లర్ శిక్షణే" అవుతుంది. మొదట్లో నేను పిల్లల పట్ల వారికున్న నిబ్బదత చూసి అబ్బుర పడినా, మన వారి విషయంలోనే కాక ఇతరుల విషయంలో వారు చూపించిన "అతి చట్ట" చర్యలు సహజ న్యాయానికి,కుటుంభ న్యాయ సూత్రాలకు,చివరిగా అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు కూడా వ్యతిరేకంగా ఉన్నట్లు ఉంది.
మన ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఏమి చెయ్య లేననడం బాద్యతా రాహిత్యమే అవుతుంది. ఈ బూ మండలం మీద "తల్లి తండ్రులను మించిన "సహజ రక్షణ, ప్రేమ, ఆత్మీయత" పంచే ఏజన్సీలు ఉన్నాయా? ఎక్కడో, నూటికో, కోటికో అటువంటి వారు ఉంటే, ఆ బాద్యతను రక్త సంబదీకులకు అప్పచెప్పాలి.పిల్లలు కుటుంబ ఆస్తి. ఏ బందువూ లేనప్పుడే అంతిమ బందువుగా ప్రబుత్వం బాద్యత తీసుకోవాలి. తల్లి తండ్రుల సన్నిది,పిల్లల సహజ హక్కు. "ఇది అంతర్జాతీయ వేదికల మీద "నార్వే" వారిని నిలదీయాల్శిన బాద్యత, అన్ని దేశాలతో పాటు మన దేశానికి కూడా ఉంది. .
Comments
Post a Comment