డిల్లీలో జరిగింది అమ్మాయి మీద అత్యాచారం కాదు!
అవును దేశ రాజదానిలో ఒక అబల మీద ముష్కరులు చేసిన మూకుమ్మడి మానభంగం కేవలం ఆ అమ్మాయి మిద జరిగినది కాదు. మొత్తం బద్రతా వ్యవస్త మీద జరిగినది గా బావించాలి. అందుకే ఈ రొజున డిల్లి ప్రజలు మహ ఉగ్రులై "ఇండియా గేట్" వద్ద ఒక్క పెట్టున నినదిస్తున్నారు.
ఘనత వహించిన డిల్లీ పోలిస్ వారు ఏమి మాయ చేశారో ఏమో, తెల్లారే సరికి ఇద్దరు నిందితులు నేరాన్ని అంగీకరించి, నాటకీయంగా తమకు "ఉరిశిక్ష" విదించమని వేడుకున్నారట! కేవలం మానభంగానికి ఉరి శిక్ష లేదని పోలిస్ వారు నిందితులకు చెప్పి ఉండాలి. బాదితులు అత్యాచారం వల్ల మరణిస్తె తప్పా, అటువంటి శిక్ష విదించడానికి వీలు లేదు. ఈ వెదవలకు ఉరిశిక్ష వేయడం కోసం ఎవరూ ఆ తల్లికి ప్రాణ హాని జరగాలని కోరుకోరు. ఒక వేళ చట్టం మార్చినా అది భవిష్యత్ నేరాలకే కాని జరిగిన దానికి వర్తించదు. కాబట్టి "ఉరి" అనేది అసంభవం అని తెలిసే ఆ మాట వాడి ఉంటారు.
ఇక్కడ ఇంకొకటి కూడ అనుమానించాల్సి ఉంది అందులో ఇద్దరు ఇడెంటిఫికేషన్ పెరేడ్ కి ఒప్పుకోలెదంట! నిందితులు నేరం అంగీకరించినప్పటికి ప్రొసీజర్ అనుసరించాల్సిందే.అప్పుడే నిజమయిన దోషులకు శిక్ష పడే అవకాశం ఉంటుంది.బాగ డబ్బున్న వారిని కాపాడటానికి "నిర్బాగ్యులు" నేరాంగీకారం చేసి శిక్షలు అనుబవించటం వింతేమి కాదు. జైల్లో రాజ బోగాలు దొరికె కండిషన్ మీద ఇటు వంటివి జరుగుతుంటవి. అవినీతి వ్యవస్తలో అన్ని సాద్యమే. కాబట్టి ప్రొసీజర్ ని కచ్చితంగా ఫాలో కావాల్సిందే.
ప్రబుత్వం ఈ కేస్ ను స్పెషల్ కేస్ గా ట్రీట్ చేసి, త్వరితగతిన విచారణ జరిపించి, నిజమయిన దోషులకు శిక్షలు పడేటట్లు చర్యలు తీసుకోవాలి. ఒక అమ్మాయి తరపున యావత్ జాతి ఎందుకు నినదిస్తుందో ఈ అంధ,బధిర సర్కార్ అర్థం చేసుకుని తదనుగుణంగా వ్యవహరించాలి.
స్త్రీలు అంటే ఆట ఆడుకుని, విసిరేసే ఆట బొమ్మలనుకునే మగ వెదవలకి, ఈ కేస్ ఒక గుణపాటం కావాలి. అబలలే కదా అని అత్యాచారాలు చేసేవాళ్లు ఈ రోజు దేశ రాజదానిలో నినదిస్తున్న ఆ గొంతులను చూస్తే, వారి గొంతుకల్లో తడి ఆరిపోవాల్సిందే. ఎప్పుడూ కాలం ఒకే లాగ ఉంటుందనుకోవద్దు. అమ్మాయిల వెంట బాయి ఫ్రెండ్ లే ఉంటారనుకోవద్దు, వారిని కన్న వారు, తోడపుట్టిన వారు, వారి వెనుక మొత్తం సమాజమే ఉంటుంది. ఒక వేళా పాలకులు కళ్ళు తెరవకపోతే, కుర్చీ లు సైతం ఖాళీ చేయాల్సి ఉంటుంది.ఇది ఇప్పుడు డిల్లీలో జనం గుండె చప్పుడు కావచ్చు. అది దేశం లోని ప్రతి గల్లీ దాకా పాకకుండ చూడాల్శిన బాద్యత ప్రభుత్వ పెద్దల పైన ఉంది. తక్షణ చర్యలు అవసరం.
Comments
Post a Comment