అత్యున్నత న్యాయ స్థానాన్ని, రాజకీయ పార్టీగా బావించి కామెంట్ చెయ్యడం మంచిదా?

                                            

  మన దేశానికి అత్యున్నత న్యాయస్తానం మన సుప్రీమ్ కోర్ట్. వేర్వేరు కేసులు విచారించినప్పుడు, ఆ యా కేసుల్లోని విషయాలను బట్టి,  తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మధ్య అఖిలేశ్  యాదవ్ కేసులో, ఆయన బార్యను విచారణ నుంచి తప్పించడం, జగన్ వర్గానికి ఒక అవకాశం దొర్కినట్లయ్యింది అనుకుంటున్నారు. పాలనా పరమయిన వ్యవహారాల్లోల్లో సంబందం లేదని,అఖిలేష్ బార్యని విచారించవద్దన్న  సుప్రీం కోర్ట్, జగన్ ని ఎంద్కు విచారించ మంటూంది అని  కోర్టు వారిని బహిరంగంగా ప్రశ్నించడం  ఆక్సేపణియం.

  ఇక్కడ రెండు కేసుల్లోని అంశాలు సారూప్యత కలిగి ఉన్నాయా లేవా అన్నది అప్రస్తుతం. ఏమయినా ఒక కేసులోని తీర్పు తమ కేసుకూ వర్తిస్తుంది అని ఎవరైనా బావిస్తే దానిని న్యాయవాదుల ద్వారా పిటిషన్  రూపంలో కోర్టు వారి ద్రుష్టికి తీసుకు వచ్చి న్యాయం పొందాలే తప్ప,చవక బారు రాజాకీయ వ్యాఖ్యలు చెయ్యడాం లేక చేయించడం న్యాయస్తానల ఉన్నతిని కించపరచడమే అవుతుంది. న్యాయస్తానాల్ని, రాజకీయ పార్తీలుగా బావించడం  రాజకీయ అనుభవ శూన్యతకు  నిదర్శణం అనుకోవాలా.లేక కావాలనే, ప్రజల ద్రుష్టిలో న్యాయాస్థానాలు నిబద్దతని అనుమానించేలా చేస్తున్నారా? అయినా ప్రజలందరూ   అమాయకులనుకోవడం అత్యాశే అవుతుంది!  లక్షల కోట్లు ఆర్జించిన  వ్యక్తి కేసు, అఖిలేష్ యాదవ్ గారి బార్య కెసు ఒకటేనా? ఏది ఎమయినా పతిదాన్ని రాజకియం చెయ్యలనుకోవడం రాజకీయంగా అత్యున్నత పదవులు కావాలనుకునే వారు చెయ్య కూడని పని. రేపు తిర్పులు తమకు వ్యతిరేకం వస్తే ఇద అధికార పార్టీ వారి కుట్ర లో బాగమేనని ప్రజల్నునమ్మించాలని చూస్తున్నట్లుంది.
                        కేంద్ర ప్రభుత్వం వారు కూడ శ్రద్ద తీసుకుని కోర్టులలో పెండిన్గ్ లో ఉన్న రాజకీయ నాయకులకేసులన్ని, త్వరితగతిన విచారణ పూర్తి చేయించి, నిజనిజాలు ప్రజలకు వెల్లడి చెయ్యాలి. ప్రజల్ని పాలించాలనుకున్న వారికి  కోర్టుల "క్లీన్ చిట్" కంపల్సరీ. కోర్టు కేసు లు పెండింగ్ ఉన్నంత కాలం "నిందితుడిని" అమాయకుడు గానే పరిగణించాలని "బారతీయ న్యాయ ద్రుక్పదం". కాబట్టి,రాజకీయ పదవులు కావాల్నుకున్న వారు కూడ తాము న్యాయస్తానాల మీద దాడిచేసే బదులు, తమ కేసును "ప్రజా ప్రయోజనాల" ద్రుష్త్యా, మరియు తమ స్వచ్చత నిరూపణ ద్రుష్ట్యా తొందరగా కేసులను  పరిష్కరించాలని కోరితే మంచిది.మన దేశంలో కోర్టులు సాద్యమయినంత వరకు ప్రజల "ప్రాధమిక హక్కులు" కాపాడడానికే ప్రాదాన్యత ఇస్తాయని ప్రపంచ వ్యాప్తంగా పేరు. ప్రభుత్వాల్ని ఎన్నోసార్లు, తమ’ సంచలనాత్మక తీర్పులు’ ల తో తప్పు బట్టిన చరిత్ర మన సుప్రీమ్ కోర్టుకి ఉన్నది అనటం నిర్వి వాదాంశం.

   కాబట్టి అయిన దానికి కానిదానికి  ప్రతి విషయాన్ని రాజకీయ కోణం లో ఆలోచించటం మాని, తమ సచ్చీలిత మాటలతో కాకుండా, ఆదారసహితంగా నిరూపించుకున్న తర్వాతే "ప్రజా పాలన" గూర్చి ఆలోచిస్తే ఇటు వారిని నమ్ముకున్న ప్రజలకు, వారికి కూడమంచిది.       
    

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!