"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?
Courtesy :From Bapu Cartoons మన పూర్వికులు చెప్పిన నీతి శాస్త్రాను సారం ఉత్తములైన భార్యా భర్తల లక్షణాలు క్రింది విదంగా ఉంటాయి . (1) శ్లో॥ కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయా తు రామః భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (ఉత్తమ భర్త లక్షణాలు ) కార్యేషు యోగీ : పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. కరణేషు దక్షః కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి. రూపేచ కృష్ణః రూపంలో కృష్ణుని వలె ఉండాలి. క్షమయా తు రామః ఓర్పులో రామునిలాగా ఉండాలి...
నేను మొన్న ఈ బ్లాగులో పెట్టిన ఒక టపాhttp://ssmanavu.blogspot.in/2012/12/blog-post_23.html కు స్పందిస్తూ, మిత్రులొకరు, బారతీయుల ద్రుష్టిలో కామం, శ్రుంగారం, దాంపత్యం అనేవి వేరు వేరు అంశాలు అని, విదేశి బావనలో "సెక్స్" అనే ఒకే అర్థం లో వాటిని చూసినా, మన పూర్వికుల ద్రుష్టి అందుకు బిన్నం గా ఉందని తెలిపారు. దానికి నేను, వీటి గురించి వివరంగా తెలుపమని కోరగా, వారు ఈ క్రింది విదంగా వివరించారు.
1.కామము: కోరిక
శరీర వాంఛ తీర్చుకోవాలనే కోరిక, ఇక్కడ మనసుల కలయికతో సంబంధం ఉండదు, ఏవరో ఒకరు ఉంటే చాలు.
2.శృంగారం: 1+కళ
కళాత్మకమైన కామం. తగ్గ జోడి, మనసుల కలయికవలన మాత్రమే కలిగేది.
మరింత సమాచారం కొరకు ఈ టపాని చూడొచ్చు http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_26.html