ఈ రాజ్యం రాళ్లెతిన్న వాళ్లది కాదు,కాలెత్తిన వారిదే!
అవును నిస్సందేహంగా కాలెత్తిన వారిదే. శ్రీ,శ్రీ గారు ,"తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరోయి" అని ప్రశ్నిస్తూ వారే దాని నిర్మాతలు అంటాడు.ఇదే సూత్రం రాజ్యానికి అన్వయిస్తే,శ్రమజీవులదే రాజ్యం కావాలి.కార్మిక, కర్షక,యువత,ఈ విదంగా ఎన్నిపేర్లు పెట్టిన ఈ రాజ్యం వారిది కాజాలదు. వారి పేరుమీద పబ్బంగడుపుకునే వారిదే. మరి వీరెవరో తెలుసా? మరెవరో కాదు, వాళ్ళు "రాళ్ళెత్తుతుంటే" వారి మీద "కాలెత్తి" దౌర్జన్యాలు చేసిన "దొర బిడ్డలే".
ఒకప్పుడు,వాళ్ళు డైరెఖ్ట్గా కాలెత్తేవారు కాబట్టి "దొర దాష్టికం" రుచి ప్రజలకు తెలిసేది. అందుకే తిరుగుబడ్డారు జనం. ఇప్పుడు ఆ విదానం మారింది.వారు డైరెక్టుగా కాలెత్తడం లేదు. వారి "మాఫియా" చేత ఆ పని చేస్తున్నారు. ఆ విదంగా "ప్రజా సంపద" ను దోపిడి చేసి అలా దోచుకున్న సొమ్ముతో "కాలెత్తిన" వారు "కరుణామయులు"’దాన కర్ణుల" అవతారమెత్తి, దానాలు చేస్తూ,ప్రజల వోట్లను కొల్లగొడుతూ "రాజ్యాదికారం" సంపాదిస్తున్నారు.
కాబట్టి వేయి మంది మహా కవులు కోటి గొంతులతో ఎలుగెత్తి అరచినా ఈ రాజ్యం నాడు, నేడు,రాళ్లెతిన్న వాళ్లది కాదు,వారి మీద కాలెత్తిన వారిదే!ప్రజల ద్రుష్టిలో వారే కథానాయకులు(ఖల్ నాయకులు) మరి!
dammu unnavaadidea ii prapancham...leani vaadu arichea arupulu gaaliloa kalisi poayeavea...nuvvu manuvu ashramam peartoa doachukonea daanni yeamantaaru baabu..okkokkadidi okkoka technic doachukoavadamloa..antea..
ReplyDeleteనీ అభిప్రాయం నీకు ఉండటంలో తప్పులెదు, కాని క్రిష్ణా రావు, వ్యక్తిగత విమర్శలు చేసేటప్పుడు ఆదారసహితంగా, వెనుకా ముందు ఆలోచించుకుని చెయ్యడం నేర్చుకో. ణా ఆశ్రమం పేరు మీద నేను దోపిడి చేస్తుంటే బహుశా నా అంత నీచుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరని నేను ఒప్పుకుంటాను. నీ ఆరొఫణ అబద్దమయితే నీవు "అలాగేనని" ఒప్పుకుంటావా?
Deleteబాగుంది మీ జోక్ . దన్యవాదాలు, సార్వబౌమ గారు
ReplyDelete