ఆఫీసుల లో "అతివ సేవ "ల కోసం ఆత్రపడి పోయే వారిని "వెధవ" లుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం !
కొంత మంది మగాళ్ళు ఉంటారు .వారు ఇంట్లో పూచిక పుల్లనైనా కదిలించడానికి ఇష్ట పడరు. వంటింట్లో ఇల్లాలికి సాయం చేయాలన్నా ,ఇంట్లో పిల్లలకు అవసరమైనవి చేసిపెట్టాలన్నా తెగ నామోషి ! కాని అదేమి విచిత్రమో కాని ,సదరు పురుష పుంగవులు ఆపీసు పనుల విషయం కి వచ్చే సరికి తోటి ఉద్యోగునుల పట్ల ప్రత్యేక శ్రద్ద ,అభిమానం కనపరుస్తూ ,వారి పని భారం అంతా తమదే అన్నట్లు తెగ పీలై పోతూ ,వారికి సకలోప చర్యలు చేయడానికి తెగ ఆత్రపడి పోతుంటారు. నిజానికి ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లలకు ఈ తరహ మగవాళ్ళు తమ పట్ల చూపే ప్రత్యేక అభిమానానికి బాగా ఇబ్బంది పడిపోతుంటారు. వారు చూపే ప్రత్యేక అభిమానాన్ని ఎలా తిరస్కరించాలో తెలియక నానా అవస్థలు పడ...