నాగమణి కోసం ఆశపడి నిలువు దోపిడీకి గురి అయిన 82 ఏండ్ల వృద్ధుడు !!?
అమ్మాయి కనపడితే చాలు పదేండ్ల పిల్లవాడి దగ్గర్నుంచి పండు ముదుసలి వరకు చొంగ కార్చుకుంటుటారు కొంతమంది మగవాళ్ళు. వీరిలో ఉన్న ఈ బలహినతనే ఆదారంగా చేసుకుని బ్రతిమాలో బ్లాక్మయిల్ చేసో తమ పబ్బం గడుపుకుంటుటారు, కొంతమంది కిలాడి లేడీ లు. అదిగో అటువంటి కోవలోకే వస్తారు ఈ నాగమణి లాంటి వారు. అయన గారి పేరు రాఘవయ్య . వయస్సు 82 సంవత్సరాలు. ఊరు ఖమ్మం దగ్గర పల్లెటోరు. అయన గారు ఈ మద్య అంటే గత నెల 19 వ తారీకున సికింద్రాబాద్ నుంచి ఖమ్మం రైల్ లో వస్తున్నాడు. ఆ ప్రయాణం లో అయన గారికి నాగమణి అనే యువతి పరిచయమైంది. ఆమె ఈ ముసలాయనతో మాటలు కలిపి పరిచయం చేసుకుంది. ఆ తర్వాత అయన వద్ద నుండి విజిటింగ్ కార్డు తీసుకుంది . ఆ మరుసటి రోజే హట్టాతుగా నాగమణి రాఘవయ్య గారి ఇంటికి వెళ్లింది . దీని తో ఉబ్బితబ్బిబ్బయిన రాఘ వయ్య ఆమె రాకకు కారణం అడిగితే , తనకు ఏదైన ఒక ఉద్యోగం చూపెట్టమని , తనకు అది తక్షణ అవస...