"కెమెరామెన్ T V 9 తో యాంకర్ పద్మావతి " ఎపిసోడ్ లో T V 9 కు పెరగడం తప్పా , పద్మావతికి ఒరిగిందేమిటి?
ఈ రోజు కొన్ని మీడియా చాన్నల్లలో ఒక స్క్రోలింగ్ చూశాను. హైదరాబాద్ కి చెందిన యాంకర్ పద్మావతి అనే ఆవిడ తన భర్త సతీష్ ని ప్రియురాలి తో ఉండగా పట్టుకుని దేహశుద్ది చేసి బుద్ది చెప్పిందని. చాలా సంతోషం వేసింది ఆ వార్తా చూసి. కట్టుకున్న ఇల్లాలికి అన్యాయం చేసి మరో ప్రియురాలితో కులుకుతున్నందుకు అతడికి ఆ ఇల్లాలు తగిన బుద్ది చెప్పి ఉంటుంది అనుకున్నాను. కాని ఇదే వార్తా కొన్ని చానల్లలో ఇంకొక రకంగా అంటే యాంకర్ కి వ్యతిరేకంగా రావడం తో ఆసక్తి పెరిగి అసలు కద ఏమిటా అని ఆరా తీస్తే , T V 9 వారి పుణ్యమాని యాంకర్ పద్మావతి ఎపిసోడ్ దొరికింది. అది చూసాక మొగుడు పెళ్ళాల పంచాయతీలు వారికి ఏ మాత్రం ఉపయోగపడుతున్నాయో తెలియదు కాని T V చానల్లు తమ రేటింగ్ లు పెంచుకోవటానికి మాత్రం పిచ్చ పిచ్చగా ఉపయోగ పడుతున్నాయని అర్దమవుతుంది. ...