"కెమెరామెన్ T V 9 తో యాంకర్ పద్మావతి " ఎపిసోడ్ లో T V 9 కు పెరగడం తప్పా , పద్మావతికి ఒరిగిందేమిటి?
ఈ రోజు కొన్ని మీడియా చాన్నల్లలో ఒక స్క్రోలింగ్ చూశాను. హైదరాబాద్ కి చెందిన యాంకర్ పద్మావతి అనే ఆవిడ తన భర్త సతీష్ ని ప్రియురాలి తో ఉండగా పట్టుకుని దేహశుద్ది చేసి బుద్ది చెప్పిందని. చాలా సంతోషం వేసింది ఆ వార్తా చూసి. కట్టుకున్న ఇల్లాలికి అన్యాయం చేసి మరో ప్రియురాలితో కులుకుతున్నందుకు అతడికి ఆ ఇల్లాలు తగిన బుద్ది చెప్పి ఉంటుంది అనుకున్నాను. కాని ఇదే వార్తా కొన్ని చానల్లలో ఇంకొక రకంగా అంటే యాంకర్ కి వ్యతిరేకంగా రావడం తో ఆసక్తి పెరిగి అసలు కద ఏమిటా అని ఆరా తీస్తే , T V 9 వారి పుణ్యమాని యాంకర్ పద్మావతి ఎపిసోడ్ దొరికింది. అది చూసాక మొగుడు పెళ్ళాల పంచాయతీలు వారికి ఏ మాత్రం ఉపయోగపడుతున్నాయో తెలియదు కాని T V చానల్లు తమ రేటింగ్ లు పెంచుకోవటానికి మాత్రం పిచ్చ పిచ్చగా ఉపయోగ పడుతున్నాయని అర్దమవుతుంది.
పద్మావతి కదనం ప్రకారం ఆమెకు సతీష్ తో పెళ్లి అయి 10 యేండ్లు అవుతుంది. వారిది ప్రేమ వివాహం. ఆమె మాటలు బట్టి వారి పెండ్లి అబ్బాయి ఇంట్లో వారికి ఇష్టం లేదు. వారి మోజులు తీరగానే గొడవలు ప్రారంబం అయ్యాయి కాబోలు , ఆటను వేరే ఆమె తో తన తండ్రి ఇంట్లో ఉన్నట్లు ఉంది. ఆ రెండవ ఆవిడకి 3 సంతానం అని చెప్పడం చూస్తే పద్మావతి సతీష్ విడిపోయి 5,6 యేండ్లు అయి ఉంటుంది. ఆమెను 10 యేండ్లుగా కట్నం కోసం వేదిస్తున్నాడు అంటె పోలిస్ కేసు కోసం టెక్నికల్ పాయింట్ అయుంటుంది . మరి ఇంత హట్టాతుగా ఇన్నేళ్ళు తర్వాత ఈ చానల్ దాడి జరిపింది అంటే డబ్బు సెట్టిల్ మెంట్ కోసం తప్పా, సంసార సెట్టిల్మెంట్ కోసం కాదు అనేది అర్దమవుతుంది.
తన వైవాహిక జీవితం గురించి ఎంతో గోల చేసిన పద్మావతి చివరకు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కక తప్పలేదు. పోని T V 9 వారు చిత్రికరించిన సన్నివేశాలు ఏమైనా కోర్టుల్లో ఆమెకు ఉపకరిస్తాయా అంటె అదీ లేదు. ఎంత సేపు" రెడ్ హండెడ్ గా పట్టు బడ్డాడు , రెడ్ హాండెడ్ గా పట్టు బడ్డాడు " అని ఆమె భర్తను గురించి T V 9 యాంకర్ వాగటమే తప్పా, ఆమె భర్త ఎవరితో పట్టుబడ్డాడో అర్దం కాలేదు. సీన్ లో ఉన్నది ఆతను అతని తండ్రి మాత్రమే . యాంకర్ పద్మావతికి భర్త , మామల మీద ఆవేశమే తప్పా ఆలోచన ఉన్నదానిలా కనిపించడం లేదు.భర్తని ముందుగా ఒకటి పీకి , తను నాలుగు పీకించుకుంది . ఆమె కొట్టినప్పుడు పెడిల్మని కొడుతుంది. అతను కొట్టేటప్పుడు మాత్రం ఇల్లదిరిపోయెలా అరుస్తుంది. ఈ ఎపిసోడ్ ను కనుక కోర్టులో సాక్యంగా ప్రవేశ పెడితే ఆమె మిద జడ్జ్ గారికి సానుభూతి కలుగుతుంది అనుకోవడం అనుమానమే . పై పెచ్చు ఆమె ప్రవర్తన వలననే భర్త తన తల్లి తండ్రుల వద్దకు చేరి ఉంటాడు అని అనుకుంటారు. అంతే కాదు ఈ ఎపిసోడ్ ని చూస్తే లేడి యాంకర్ లను పెండ్లి చేసుకోవటానికి పురుషులు కొంచం ఆలోచించాల్సి వస్తుంది . ఏదైనా తేడా వస్తే తమ కుటుంబాలు TV చాన్నాళ్ళ దురాక్రమణ లకు బలి కావాల్సి వస్తుందేమోనని బయపడాల్సి వస్తుంది. నిజానికి పై ఎపిసోడ్ లో పద్మావతి తన ఆరోపణలను ఇతర సాక్ష్యాలతో రుజువు చేస్తే తప్పా ఆమె భర్త మీద కేసు పెట్టడానికి , T V 9 వారు చేసిన గలాటా ఉపయోగపడదు. కాని ఆమె భర్త లేక మామగారికి మాత్రం ఆమె మీద ఆమె కు సహకరించిన వారిమీద , అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడం, ఇంట్లోని వారిని బయబ్రాంతులకు గురి చెయ్యడం మీద క్రిమినల్ కేసులు పెట్టవచ్చు. మరి ఇంత చేసి సదరు యాంకర్ పద్మావతి సాధించింది ఏమిటి? ఈ ఆకస్మిక ఆపరేషన్ వలన T V 9 చానల్ రేటు పెరగడం తప్పా , పద్మావతికి పెద్దగా ఒరిగేదేమీ లేదు. మరింత సమాచారం కోసం "పాడిందే పాటరా , పాచి పళ్ళ యాంకరా" అన్నట్లున్న క్రింది వీడియోను చూడవచ్చు.
Comments
Post a Comment