ఈయన గారు సినిమా నటన లో సింహం లెక్క ! చిత్తం మాత్రం "చిత్త కార్తె కుక్క "లెక్క!!!?

                                                                             

కమల్ హాసన్ ! ది గ్రేట్ సిని ఆర్టిస్ట్ . నేను N.T.R గారి నటన తర్వాత అభిమానించే నటన ఈయనదే ! నటన అంటె మూస తరహ పాత్రలు పోషించడం కాదని , వైవిద్యభరితమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలని నమ్మి ఆచరిస్తున్న గొప్ప వ్యక్తీ అతను. అందుకే నటన పరంగా అయన గారు సింహం . కాని నైతిక జీవనం విషయం లో మాత్రం అయన  ఆలోచనలు  గ్రామ సింహం లాగా ఉన్నాయి అనిపిస్తుంది.

   ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనేది నైతికంగా దిగజారిన పెద్దల సంతానాన్ని ఉద్దేసించి చెప్పే మాట. దాన్ని నిజం చేయాలని చుస్తున్నట్టుంది శ్రీ మాన్ కమల్ హాసన్. అయన వ్యక్తిగత జీవితం అయన ఇష్టం అయినప్పటికి , అయన సెలెబ్రిటి కాబట్టి , అయన ఉంటున్న సమాజం లోని నైతిక జీవన విలువలును  గుర్తించి మసలుకుంటె మంచిది. ఒక ప్రకటన ఇస్తున్నప్పుడు దాని ప్రభావం సమాజం మీద ఎలా ఉంటుందో తెలుసుకుని ఇవ్వడం కనీస ధర్మం. 

           అయన గారు, సహచర్యం అని చెప్పబడే "మోడ్రన్ కీపింగ్ " పద్దతిని ఎందుకు అవలంభించాడొ , దానికి దారి తీసిన పరిస్తితులు ఏమిటో ఆయనకే తెలియాలి. అటువంటి పరిస్తితులే అయన గారి కూతుళ్ళకు ఉండాల్సిన అవసరం లేదు. అటువంటప్పుడు తాను ఆచరించిన నైతిక హీన కుటుంబ జీవన్నానే తన కూతుళ్ళను కొనసాగించమని, పరోక్షంగా ప్రోత్సాహిస్తూ , మీడియా ప్రకటనలు ఇవ్వడమేమిటి? బహుసా అటువంటి పద్దతులు వలన తన కూతుళ్ళ సినిమా రేటింగ్ లు బాగా పెరుగుతాయని అయన ఆశ కాబోలు. మరి సామాన్య యువత మీద అయన ఇచ్చే సందేశం ప్రబావం ఎలా ఉంటుందో ఆలోచించవద్దా? 

  అయన కూతుర్లు డేటింగ్ లు చేసినా హ్యాపీయేనట.  పెండ్లీళ్ళు చేసుకోపోయినా పర్వాలేదు అట. కాని పిల్లలను కని తనకిస్తే వారితో ఆడుకుంటాడు అట. దీన్ని బట్టి అర్డంయ్యేది ఏమిటి? సీసన్ వచ్చినప్పుడు వీదుల్లో ఎగబడే "చిత్త కార్తె" కుక్కలు లెక్క  ప్రవర్తించి గర్భం తెచ్చుకుని పిల్లలను కని అయన చేతికి ఇస్తే , కుక్క పిల్లలను ఆడించినట్లు , కూతుర్ల పిల్లలను ఆడిస్తాడు అన్న మాట. ఈ  మద్య ఒక ఆర్టికిల్ చదివాను. ఇంగ్లాండ్ లో మగ వ్యభిచారులు ఎక్కువట. ఎందుకా అని ఆలోచిస్తే అక్కడ వివాహాలు రేటు చాలా తక్కువ. స్త్రీలు పెండ్లిళ్ళు చేసుకోకుండా , తమకు ఇచ్చ వచ్చినట్లు నచ్చిన  మగాళ్ళని కొనుకున్ని వారితో వ్యభిచరిస్తుండటం వలన , మగ వ్యభిచారులు  ఎక్కువ అవుతుండ  వచ్చు. అలా కుక్క సంస్క్రుతి ని అవలంభించి పిల్లలని కంటున్నారు కాబోలు. ఆ పద్ధతినే అవలంభించమని ఈ గ్రేట్ నటుడు అయిన శ్రీ శ్రీ శ్రీ కమల్ హాసన్ గారు తన సంతానానికి సలహా ఇస్తున్నాడు. 

    మై చాయిస్ , మై చాయిస్ అనే  సమాజ వ్యతిరేక పోకడలు చివరకు మనల్ని ఎక్కడకు నడిపిస్తాయి అంటె "కుక్క సంస్కృతి"కే అన్నది ప్రాస్చ్యాత సమాజాలను చూస్తే ఇట్టె అర్దమవుతుంది. ఇండ్లల్లో కుక్కలను పెంచుకోవచ్చు కాని, కుక్క సంస్కృతిని పాటించవచ్చా ? చెప్పండి !!

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )