తమిళనాడులో కుష్బూ ! తెలంగాణాలో సోనియా ! ఇద్దరూ దేవతలే!
దేవత అంటే ఎవరు? ఈ ప్రశ్న కు బదులివ్వండి అని అని తెలంగాణా కాంగ్రెస్ వారిని అడిగితె తడుముకోకుండా ఠక్కున చెప్పే సమాధానం "సోనియా గాందీ ". ఎందుకంటే వారికి రాజకీయ పునర్జన్మ ఇచ్చింది ఆమె అని వారి ప్రగాడ విశ్వాసం మరి!. అయిదు కోట్ల మంది అరుపులను ఆఫ్ట్రాల్ అని తన జన్మ దిన కానుకగా ప్రకటించిన "తెలంగాణా" రాష్ట్ర ఏర్పాటుకు ఆమె పార్టీ కట్టుబడి ఉండేలా చేసినందుకు ఆమె కు తెలంగాణా కాంగ్రెస్ వారు జీవితాంతం చాకిరి చేసినా వారి రుణం తీరదు కాక తీరదు . కాబట్టే వారు ఆమెకు తమ గుండెల్లో గుడి కట్టారు. ఆ అభిమానాని వారు బహిరంగంగా ప్రదర్శించారు కూడా !. తెలంగాణా లో కె,సి,ఆర్ గారు తెలంగాణా తల్లి ఆ...