లేచిపొండి ప్రేమికులారా! పోతే పొయేదేమి లేదు,మీ కామబాధలు తీరటం తప్ప!
మన సమాజంలో ఇటీవలి పరిణామాలు చూస్తే కొంతమంది మన పిల్లలకు ఇటువంటి సందేశమే ఇస్తున్నారా అనిపించక మానదు.వ్యవసాయం చేసే వారికి తెలుసు.గిత్తలను(కోడె దూడలు), వ్యవసాయ పనులు చేసే విధంగా మార్చాలంటే తగిన తర్ఫీదు ఇస్తారు.దీనినే ’సాగవెయ్యడం’ అంటారు. కేవలం జాతి సంతానోత్పత్తికి కొన్ని గిత్తలను ఆబోతులుగా వదలి వేస్తారు. వ్యవసాయాలు నడవాలంటే ఈ ప్రక్రియ కంపల్సరి. అలాగే సంసారాలు సజావుగ, ఒక నిర్మాణాత్మక పద్దతిలో సాగటానికి చిన్నప్పటినుండే మన పిల్లలకు తర్ఫీదు ఇస్టుంటాం. వారు సమాజంలో జరుగుతున్న ప...