పది రూపాయల ఖర్చు కు వేనుకాడినందుకు , పది కత్తిపోట్లు తినాల్సి వచ్చిందట !

అది హైదరాబాద్ నగరo . నగరం అనగానే అంతా నాగరికతే వెళ్లి విరిస్తుంది అనుకుంటే పొరపాటే . ఒక పక్క ఎంత హాయ్ టెక్ కల్చర్ ఉంటుందో , మరొక పక్క బోల్డంత కంపు కొట్టే కల్చర్ ఉంటుంది . నగరం కాబట్టి మురుగు ఎక్కువుగానే ఉంటుంది . పందులు ఉంటాయో లేవో కానీ ఆ పందులు లేని లోటును అక్కడ కొంత మంది యువకులు భర్తీ చేస్తున్నారట . పని పాట చెయ్యలేని బేవార్స్ రకాలు కొందరు కొన్ని మరుగు ప్రాంతాలలో మాటు వ...