'ప్రజా పతి ' అవుతాడేమోనని ఆశపడుతుంటే , పర్మనెంట్ పతి కావడానికే జీవిత కాలం సరిపోనట్లుంది!.
స్తిర చిత్తుడు కానివాడు ఏదీ సాదించలేడు. ఒక వ్యక్తీ యొక్క వైవాహిక జీవితం అతని పర్సనల్ మేటర్ కావచ్చు. కానీ కొన్ని వేల మందికి ఆరాద్య నీయుడు గా ఉన్న వాడు కొన్నిక్రమమైన జీవన పద్దతులు అవలంబించవలసి ఉంది . తెలుగు సినీ అభిమానులలో ఒక అత్యున్నత స్తానం సంపాదించుకున్న ఒక సినీ హీరో నిజ జీవితం లో మాత్రం చంచల మనస్తత్వం గలవాడిగా మిగిలి పోవటం విది లిఖితం . . బార్యా భర్తల బందం అనేది జన్మ జన్మ ల బందం అని హిందువుల నమ్మఖ్ఖం. పెండ్లి చేసుకోవడానికి పూర్వమే అన్నీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని తన వాళ్లకు నచ్చిన , తను మెచ్చిన అమ్మాయితో సంసార గృహంలోకి అడుగు పెడతాడు మగవాడు . అలా మొదలైన వారి సంసారం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడి విజయం సాదిస్తుంది అంటే జీవిత బాగస్వామి మీద ప్రేమాభిమానాలు తో పాటు స్తిరమైన మనస్సు, సర్దుకు పోయే గుణం ఉండబట్టే ఇది సాద్యపడుతుంది. భారత దేశంల...