"దొరలా" దొంగ బ్రతుకు బ్రతికే కన్నా, "దొంగలా" దొర బ్రతుకే మిన్నా!
అరవై నాలుగు కళల్లో "చోర కళ" కూడా ఒకటి. అనుకుంటాం కాని దొంగతనం అంత ఈజీ కాదన్ సెలవిస్తుంటారు అనువభవజ్ణులు.సరే వారు అనుబవంతో అన్నారో, ఊహతో అన్నారో తెలియదు కాని అవకాశం దొరికితే ఇండియాలో దొంగతనం చెయ్యడం చాలా సుళువు. ఒక పెద్దమనిషి ఎన్నికల సమయంలో పంచాయతి ప్రెసిడెంట్ గా నిలబడ్డాడట. పాపం డబ్బున్న ప్రత్యర్ది, గెలుపు కోసం తన అక్రమ సంపాదన(బ్లాక్ మని) విరజిమ్ముతుంటే, ఏమి చేయాలో పాలుపోక,రాత్రుళ్ళు దొంగతనాలకు వెళ్ళి, పగలు ప్రచారంలో ఆ డబ్బును పంచాడట!అలా ప్రెసిడెంట్ గా గెలిచి పదవి అనుబవిస్తుంటే, కొంతకాలానికి సదరు దొంగతనాలు బయట పడి కటకటాలా పాలు అయాడు ప్రెసిడెంట్ గారు.ఇది నిజంగా జరిగిన విషయం. పై ఉదంతంలో ప్రె...