1956 తర్వాత తెలంగాణా లోకి వచ్చిన ఇల్లరికపు అల్లుళ్ళ సంతానం కి "పీజ్ రియంబర్స్ మెంట్ " ఇవ్వరా ?!
మాత్రు దేవో భవ ! పితృ దేవో భవ ! ఆచార్య దేవో భవ ! ఇది మనం ప్రత్యక్ష దేవుళ్ళని దర్శించే సంప్రదాయం. ఎవరికైనా సరే అమ్మ వాస్తవం అయితే అయ్య నమ్మక్కం . కానీ మన తెలంగాణా అధికారులకు మాత్రం వాస్తవం కంటే నమ్మక్కం మీదే బోల్డంత నమ్మక్కం ఉన్నట్లుంది . అందుకే తెలంగాణా విద్యార్దులకు "పిజ్ రియంబర్స్మెంట్ " చెల్లించే విదానం గురించి సలహాలు ఇమ్మని ముక్యమంత్రి గారు కోరినప్పుడు కొందరు అధికారులు " 1956 కు ముందు ఉన్న తండ్రుల స్తానికతను మాత్రమే సంతానంకి వర్తింపచేసి పీజ్ రియంబర్స్ మెంట్ ఇవ్వాలని " వారు మాత్రమే తెలంగాణా బిడ్డలు అని నొక్కి చెప్పినట్లు తెలిసింది . సర్కార్ వారు కూడా అదే సలహాను అనుసరించి జీ.ఓ లు తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది సమంజసం అయిన నిర్ణయం అవుతుంద