హత్యా యత్నం చేసింది అల్లుడే కదా అని 2 సార్లు క్షమిస్తే , ముచ్చటగా మూడోసారి సక్సెస్ అయ్యాక సరెండర్ అయ్యాడట!
ఆడపిల్లల్ని రాచి రంపాన పెట్టె అత్తింటి ఆరళ్ళు ఉన్నప్పుడు ఆమెను రక్షించు కోవలసిన బాద్యత తప్పకుండా పుట్టింటి వారిదె. సాoప్రాదాయ ప్రకారం అయినా కూతురి బాద్యత అల్లుడికి అప్పచేప్పడమంటే ఆమెకు పుట్టింట్లో లేని లోటును తిర్చమనే తప్పా , ఆమెను శాశ్వతంగా పుట్టింటికి దూరం చెయ్యమని కాదు. ఎ తల్లి తండ్రులు , అన్నదమ్ములు , ఆమె రక్షణ బాద్యత నుండి తప్పించుకొలెరు. చివరికి రాజ్యమైనా సరే పౌరులను చట్టవ్యతిరేకంగా చంపే అధికారం కలిగి ఉoడదు . మరి కేవలం తాళి కట్టాను కదా అనే మగ గర్వంతో ఆలి ని చంపే అధికారం ఎవరు ఇచ్చారు? ఆత్మహత్య చేసుకోవడానికే హక్కు నివ్వని బారత దేశం లో ఒక తల్లి కన్నబిడ్డను చంపే అధికారం లేని సమాజం లో, ఎట్టి కారణం చేతనైనా కానీ భర్తకు భార్యను చంపే అధికారం లేదు కాక లెదు. ఇష్టం లేకపోతె కారాణాలు చూపించి విడాకులు తీసుకుని వేరు అయి పోవడం తప్పా శిక్షించే హక్కు కూడా లేదు . అసలు ఆలి న...