రిజర్వేషన్ లు అంటే ఆగ్రహం వెలిబుచ్చే వారంతా "రెండో రకం మెదడు " వారేనా ??!!!
ఈ దేశం లో రిజర్వేషన్ సిస్టం మీద కారాలు మిరియాలు నూరేవారు , ఈ మద్య ఎక్కువుగా సోషల్ మీడియాలలో హల్ చల్ చేస్తున్నారు. కుల ప్రాతిపదిక న రిజర్వేషన్ లు వద్దని , ఆర్దిక ప్రాతిపదిక న రిజర్వేషన్ లు అమలు చేయాలని ఒక విచిత్ర వాదాన్ని వారు ముందుకు తెస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్దిక ప్రాతిపదిక పరంగా ఆర్దికంగా విద్యార్దులకు సహాయం చేస్తూనే ఉన్నాయి ప్రభుత్వాలు. కాని ఇది చాలదు అని ఉద్యోగాలలో కూడా ఆర్దిక ప్రాతిపదిక మీదే రిజర్వేషన్లు కల్పించాలని అడ్డగోలు వాదం చేయడమే కొంచం ఆశ్చర్యాన్ని కలుగ చేస్తుంది. ఈ విషయం లో రాజకీయ నాయకులు మౌనంగా ఉండి తమాషా చూస్తున్నారు. ఎందుకంటే ఒక్క సారి రిజర్వేషన్ ల తుట్టె ను కదిపితే ఏమి జరుగుతుందో వారికి బాగా తెలుసు. అందుకే కొంతమంది పిల్లలను రెచ్చగొట్టి , వారిని ముందు పెట్టి వీరు తెర వెనుక బాగోతం నడుపుతున్నట్లు అనుమానంగా ఉంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఈ విషయం మీద ఎక్కువుగా స్పందిస్తున్న తీరు చూస్తుంటె , వారి