పేరుకి "కరుణగిరి కారుణ్య భవన్",కానీ ఆడపిల్లలకి అరణ్య భవన్ అట!
గురువు శిష్యుల బందం తండ్రి పిల్లల సంబందం అనేది సాంప్రదాయ బావన. ఆడపిల్లలు చదువుల నిమిత్తం ఉన్న ఊరిలో కాకుండా పొరుగూరు వెళ్లి హాస్టల్లో ఉండి చదువుకోవలసిన పరిస్తితి. అక్కడ తల్లి తంద్రుల పర్యవేక్షణ ఉండదు. కాబట్టి ఆ యా పాఠశాలలు, లేక వసతి గ్రుహాల నిర్వాహకులే ఆ బాద్యత తీసుకోవాల్సి ఉంటుంది. వీరందరి కంటే ఆడపిల్లలకు విద్య బోదించే గురువులు వయసుతో నిమిత్తమ్ లేకుండా కన్న తండ్రి వలే వారికి విద్యాబోదనతో పాటు నైతిక జీవన ఆవశ్యకత గురించి చెప్పాల్శిన బాద్యత ఉంది. ఒక వేళా వారి ప్రవర్తనలలో ఏదైన అనుమానం అనిపిస్తే తల్లితండ్రులకు తెలియ చెప్పాల్శిన బాద్యత కూడా ఉంది. కానీ తండ్రి వయసున...