మనదంతా రివర్స్! ఆడే దానిని చూడటం, చూసేదానిని ఆడటం.!
ఆటలు ఆడి ఆనందించాలి,నాటకాలు చూసి ఆనందించాలి. కాని మనమేం చేస్తున్నాం? దీనికి రివర్స్ లో ఆటలుని చూసి ఆనందిస్తున్నాం.ముఖ్యంగా క్రికెట్ ఆట.ఇది మన దేశానికి పట్టిన మహమ్మారి అని చెప్పక తప్పదు. ఆబివ్రుద్ది చెందిన ఏ దేశం లోను దీని ఊసే లేదు.ఆంగ్లేయుల పుణ్యమాని,వారి పిచ్చి మనకి పట్టుకుని,చివరకు దాని పిచ్చిలో మనముండిపోయాం. ఎన్ని పని గంటలు దీని పిచ్చి వల్ల, నాశనమవుతున్నాయో తలుచుకుంటే ఈ జాతి బవిష్యతు గురించి ఆలొచించే వారికి బాద కలగక మానదు. ఆఫ్ట్రాల్ మనకంటే చాలా చిన్న దేశాలతో పోటిపడి, అప్పుడప్పుడు గెలుస్తూ,అదేదో ఘనకార్యం చేసినట్టు దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటూ,అసలు సమస్యలు మీద యువతకు అవగాహన లేకుండా చేస్తూ, పందగ చేసుకుంటుంటే ఎవరికి ఏమి చెప్పలేని స్తితిలో ఈ దేశ మేదావి వర్గం ఉంది.ఈరాష్ట్రంలో తాగుడు వ్యాపారమైనట్టు, దేశం లో ఈ క్రీడ ఒక పెద్ద వ్యాపార మయింది. ఒలంపిక్స్ లో ఏమి గెలువలేక,జాతి పరువు అంతర్జాతీయ మైదానాలలో తొక్కి పారేసి ముకాలు వేలాడేసుకు వచ్చే మన క్రీడాకారుల్ని చూస్తున్నపుడు, కలిగే బాద ముందు వేయి సార్లు పాకిస్తాన్ మీద క్రికెట్లో గెలిచినఆనందం దిగదుడుప...