మనదంతా రివర్స్! ఆడే దానిని చూడటం, చూసేదానిని ఆడటం.!
ఆటలు ఆడి ఆనందించాలి,నాటకాలు చూసి ఆనందించాలి. కాని మనమేం చేస్తున్నాం? దీనికి రివర్స్ లో ఆటలుని చూసి ఆనందిస్తున్నాం.ముఖ్యంగా క్రికెట్ ఆట.ఇది మన దేశానికి పట్టిన మహమ్మారి అని చెప్పక తప్పదు. ఆబివ్రుద్ది చెందిన ఏ దేశం లోను  దీని ఊసే లేదు.ఆంగ్లేయుల పుణ్యమాని,వారి పిచ్చి మనకి పట్టుకుని,చివరకు దాని పిచ్చిలో మనముండిపోయాం.
ఎన్ని పని గంటలు దీని పిచ్చి  వల్ల, నాశనమవుతున్నాయో  తలుచుకుంటే  ఈ జాతి బవిష్యతు గురించి ఆలొచించే వారికి బాద కలగక మానదు. ఆఫ్ట్రాల్ మనకంటే చాలా చిన్న దేశాలతో పోటిపడి, అప్పుడప్పుడు గెలుస్తూ,అదేదో ఘనకార్యం చేసినట్టు దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటూ,అసలు సమస్యలు మీద యువతకు అవగాహన లేకుండా చేస్తూ, పందగ చేసుకుంటుంటే ఎవరికి ఏమి చెప్పలేని స్తితిలో ఈ దేశ మేదావి వర్గం ఉంది.ఈరాష్ట్రంలో తాగుడు వ్యాపారమైనట్టు, దేశం లో  ఈ క్రీడ ఒక పెద్ద వ్యాపార మయింది.

  ఒలంపిక్స్ లో ఏమి గెలువలేక,జాతి పరువు అంతర్జాతీయ మైదానాలలో తొక్కి పారేసి ముకాలు వేలాడేసుకు వచ్చే మన క్రీడాకారుల్ని చూస్తున్నపుడు, కలిగే బాద ముందు వేయి సార్లు పాకిస్తాన్ మీద క్రికెట్లో గెలిచినఆనందం దిగదుడుపే , అన్నది మన క్రీడా లోకం యెంత తొందర్గా గుర్తిస్తే అంత మంచిది.
           నేననుకుంటాను,  ఎప్పుడూ,క్రికెట్ ఆట చూసే వాడికి, నీలి చిత్రాలు చూసే వాడికి పెద్ద తేడా ఉండక పోవచ్చు.ఇద్దరిలో ఒకటే నరాల టెంక్షన్ తాప్ప ఒరిగేది ఏమి ఉండదు. ఒక దాని మీద నియంత్రణ ఉంటె ఇంకొకదానిని ప్రభుత్వమే ప్రోత్సాహమిస్తుంది . దీని కోసం విలువైన  ప్రజల సమయాన్ని, పగటి పని గంటలను ఆదికారికంగా,అనదికారకంగా కూడా నాశనం చేస్తూ కాలం వెళ్ళ బుచ్చుతున్న, మనకు సోమరితనం అలవడింది అంటే అలవడదు మరి!

 రోజూ ప్రతి ఒక్కరు ఉదయమో సాయంత్రమో ఒక అరగంట ఆటలాడితే ఆరోగ్యం కలుగుద్ది కాని,ఇదెక్కడి పని !ఆటలను సంవత్సరం లో ఎక్కువ బాగం చూడటానికి  అలవాటు చేసుకోవడం?.ఏదైనా రాష్త్ర, జాతీయ,అంతర్జాతీయ పోటిలు ఏడాదికి ఒక సారి జరిగే వాటిని మాత్రమే చూడాలి.అది రివాజు.అభిరుద్ది చెందిన దేశాలను చూసైనా మనం పద్దతి మార్చుకోపోతే ఎలా?

 ఇక పోతే రెండవ ఆంశం,నాటకాలు. వీటిని చూసి ఆనందించాలి. కాని వీటిని మాత్రం మనమే నిజ జీవితాలలో  ఆడుతూ.జీవితాలలో స్వచ్చత కోల్పోతున్నాం.మనసులో ఒకటి,పైకొకటి ఇదే నేటి మన జీవన విదానమయింది.ఏది నిజయాతీగా చెప్పలేని పరిస్తితి.దీని ప్రబావమే మన సమాజ రుగ్మతలకు కారణం అని నా అభిప్రాయం.    Comments

  1. Yes This is True క్రికెట్‌ని బేన్ చేస్తే దరిద్రం వదిలిపోద్ది

    ReplyDelete

Post a Comment

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.