కేవలం "అవినీతి" తరపున వకాల్తా పుచ్చుకునే మీకు," రామ నీతి" ఎలా తెలుస్తుంది రాంజెటల్మాని గారూ!
హిందూ జీవన విదానం మీద దాడి చెయ్యడం వెనుక, ఒక పద్దతి ప్రకారం కుట్ర జరుగుతుందా అనిపిస్తుంది.లేకపొతే ఏమిటి చెప్పండి,స్త్రీ పురుషుల సంబందం గురించి మాటాడవయా జెటల్మాని అంటే సీతకు రాముడు కరక్ట్ కాదంటావా!
అసలు ఒక భర్త మంచివాడా కాదా అని నిర్ణయించాల్సింది ఎవరు?కేవలం బార్య మాత్రమే.అంతే కాని ఎదురింటి ఎల్లయ్యకో,పొరుగింటి పుల్లమ్మకో ఆ అధికారం లేదు. ఉదాహరనకు బార్యా భర్తలు ఉన్నారనుకుందాం.పొరపాటునో గ్రహపాటునో,భర్తకు రోజు బార్యను నాలుగు దెబ్బలు కొట్టందే నిద్ర పట్టన్ని అలవాటు అయిందనుకోండి.అలాగే బార్య కూడ ఆ విదంగా దెబ్బలు తినందే నిద్ర పట్టన్ని అలవాటు అయిందనుకోండి.వారివురు ఎటువంటి కలతలు లేకుండా కాపురం చేస్తూ, జీవితాన్ని హాయిగా(వాళ్ల ద్రుష్టిలో) గడుపుతుంటే,మనం ఆ భర్తని మంచి భర్త కాడని సర్టిఫై చెయ్యగలమా?అతని ప్రవర్తన సమాజం ద్రుష్టిలో విపరీతమైనదిగా ఉన్నప్పటికి బార్య ద్రుష్టిలో అలవాటుపడ్డ హింసాఆనందం. ఇటువంటి వారి విషయంలోనే కొంతమంది పెద్దలు జ్యొక్యం చేసుకుని బార్య చేతనే తిట్లు తిన్న సందర్బాలు స్వయంగా చూసాను.అందుకే అంటారు "బార్యా బర్తలు వారిష్టం కొట్టుకుంటారు, తిట్టుకుంటారు,మద్యలో మీకెందుకురా" అని బార్యా తరపువారిని,భర్త తరపు వారిని పెద్ద మనుషులు మందలిస్తుంటారు.
ఇదంతా ఎందుకు చెపుతున్నామంటే రాముడు విషయంలో కూడ సీతమ్మకే నిర్ణయించే అధికారముంటుంది తన భ్హర్త మంచివాడు అవునా కాదా అనేది.రామాయణం లో సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి మద్య వారి సంసార విషయంలో ఎక్కడైనా పొరపొచ్చాలు వచ్చినట్టు ఉందా?వారు విడి విడి గా ఉన్న రోజుల్లొ కూడా నిరంతరం ఒకరికోసం ఒకరు తపించి పోయారే!కేవలం రాజ ధర్మం కోసం తను మదనపడుతూ కూడ బార్యని పరిత్యజించిన రాముడు,ఆ తరవాత కూడ అంఏ ద్యాసలోనే తపించిన రాముడు,యజ్ణం చేయాల్సి వస్తే తన బార్య బంగారు ప్రతిమను చేయించి తన ప్రక్కనుంచుకుని కార్యక్రమం నిర్వహించిన రాముడు ని మంచి బర్త కాదు అని చెప్పట్టానికి మీకు నోరేలా వస్తుంది జెటల్మాని గారు?
బార్య కంటానికి పుట్టింటికి పోతే, పక్కింట్లోకి తొంగిచూసే గుణమున్న మగాళ్లున్న ఈ కాలంలో సీత రాముల ఆదర్శ దాంపత్యం గురించి చెప్పకుండా,రాముడు మంచివాడు కాదంటావా? మరి ఎవరు మంచోడు?మంది పెళ్లాల్ని ఎత్తుకుపోయే రావాణాసురుడా?సిగ్గుండాలి ఏదైనా మాట్లాడే ముందు.వయసు మీద పడి చిత్త చాపల్యం వచ్చిందనుకోవటానికి అవినీతి పరుల తరపున బాగానే బల్ల గుద్దుతున్నారుగా! రాముడు గురించి వాగమని మీకెవ్వరైనా డబ్బులిచ్చారా? ఏమిటీ?.లేకపోతే ఎప్పుడూ లేని ఈ విపరీత బుద్ది మీకేలా జెటల్మాని గారు."వినాశ కాలే విపరీత బుద్ది"
ఇంతకీ జగన్ తరుపున వకాల్తా పుచ్చుకున్నది ఈ రాంజెఠ్మలానియేనా?
ReplyDeleteఅవును ప్రసాదు గారు,ఈ మహానుభావుడే!ఆయనకి వకాల్తా పుచ్చుకున్నది!
Delete