ప్రక్రుతి కన్నెర్ర చేస్తే,ఆంద్రా అయినా, అమెరికా అయినా ఒకటే.
మనుషులకు, ఇతర జంతుకోటికి ఒకటే బేదం,అది జ్ణానం. ఈ ఒక్క జ్ణానమే మనిషి తను సర్వ శక్తి మంతుడు అనే బావం కలగజేసి తను సాదించిన అట్టి శాస్త్ర జ్ణానం తో చివరకు ప్రక్రుతినే జయించగలను అనే స్తితికి వచ్చాడు.తాను ఎంత గొప్పవాడైనప్పటికి, స్రుష్తి కర్తను కానని,తాను స్రుష్టిలో అన్నిటితో పాటు బాగమేనని మనిషి గ్రహించి ప్రక్రుతికి అనుకూలంగా నడుచుకోవడం ఇటు మనిషికి అటు తక్కిన జీవకోటికి ఉత్తమం.
ఎంత జ్ణానం కలిగి ఉన్నామన్నది కాదు,ఏం చేస్తే ప్రక్రుతి మాత కరుణ కలిగి హాయిగా జీవిస్తాం అనే దిశగా మన చర్యలు ఉండాలి. ఉదాహరణకు ఈ ప్రక్రుతి వైపరీత్యాలకు "గ్లోబల్ వార్మింగ్"కారణమని తెలిసిన మనీషి దాని నివారణకు చర్యలు తీసుకునే పరిస్తితి లేక పోవడం విచారకరం. ఒక వేళ ఇదే పరిశ్తితి కొనసాగితే పేదో ఒక రొజు ప్రక్రుతి విలయ తాండవం చెయ్యడం ఖాయం.అప్పుడు ఈ సో కాల్డ్ సైన్స్ పరీజ్నాం మనిషిని రక్షింలేక పోవచ్చు,ఆఫ్ట్రాల్ చిన్న "శాండి,నీలం" లకే అల్లడి తల్లడవుతున్న మనం ఆ ప్రళయాన్ని నిరోదించగలమా? అందుకే ప్రక్రుతిని అనుసరించడం మనిషికి శ్రేయశ్కరం.
నీలం తుఫానులో నష్టపోయిన బాదితులను మన ప్రభుత్వం త్వరితగతిన నష్ట నివారణ చర్యలు తీసుకుని ఆదుకుంటుందని ఆశిస్తూ...
>>>>ప్రకృతి కన్నెర్ర చేస్తే ఆంధ్రా అయినా అమెరికా అయినా ఒకటే<<<
ReplyDeleteకానీ .....
ప్రాణ నష్ట నివారణా చర్యల్లో, సహాయక చర్యల్లో ఆంద్ర వేరు అమెరికా వేరు కదా.
మీ ఉద్దేశ్యం అర్థమైంది మాస్టారు! సమాజం పట్ల పట్ల అమెరికా వారికున్న నిబద్దత ఆంద్రా ప్రభుత్వానికి లేదన్నది నిర్వివాదాంశం.దాని వల్ల నష్టం లెక్కలో తేడాలుండవచ్చు.కాని ప్రక్రుతి విలయ తాండవం ఆపే శక్తి మనకి లేదు. ఇప్పుడు జరిగింది గోరంత,జరగబోయేది కొండంతా! దానిని ఎదుర్కోవడం అగ్రరాజ్యం వళ్ల కాదు. ఇంకొక విషయం ఏమిటంటే ఒక వేళా ఎక్కువ నష్టం ఇండీయా కు జరిగినా ఇక్కడున్న "కర్మ సిద్దాంతం" వలన మన వాళ్లు తొందరగానే కోలుకుంటారు. కాని మేమే గొప్ప అనే అమెరికా వారికి నష్టం కొద్దిగ్గా జరిగినా వారు మానసికంగా క్రుంగిపోయి పిచ్చివాళ్లవుతారు. దీని ప్రభావం నెమ్మదిగా తెలుసుద్ది.
Deleteఏది ఏమైనా "అడుసు త్రొక్కనేలా! కాలు కడుగనేలా!. ప్రక్రుతిని అనుసరించడం సర్వ విదాలా శ్రేయశ్కరం. మీ స్పందనకు దన్యవాదాలు.
బాగా చెప్పారు
ReplyDeleteమీ స్పందనకు దన్య వాదాలు మోహన్ గారు
Deleteచక్కగా చెప్పారండి.
ReplyDeleteమీ స్పందనకు దన్య వాదాలు anrd గారు
Delete