కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం
రివర్స్..రివర్స్..రివర్స్.కాలం రివర్స్ అయింది.ఎండాకాలం లో వానలు పడుతున్నాయి.వానాకాలం లో ఎండలు కాస్తున్నాయి. రివర్స్ లో నీరు లేక రివర్స్ ని రివర్స్ చేసి నడిపించే రివర్స్ ఆలోచనలు మానవులకు వచ్చింది.అందుకే ఎత్తిపోతల పథకాలు ద్వారా నదుల్లో నీరు వెనుకకు నడుస్తున్నాయి.సహజ పద్దతిలో పంటలు పండించడం మానేసి ,రసాయనిక ఎరువులు వాడడం ద్వారా అటు భూమాత ఆరోగ్యం ఇటు మనుషుల ఆరోగ్యం పాడయి, చివరకు ప్రకృతి వ్యవసాయం వైపే సైన్స్ రివర్స్ అయింది.అటువంటి అనారోగ్య ఆహారం తినడం వలన ఏమో,మనుషుల ఆలోచనల్లోనూ రివర్స్ లక్షణాలు కనపడుతున్నాయి.పురుషులను స్త్రీలు.స్త్రీ లను పురుషులు పెండ్లాడి సంసారం చేసే సహజ పద్ధతికి కొంతమంది విముఖత చూపిస్తున్నారు.దాని బదులు రివర్స్ గేర్ లో స్త్రీలను స్త్రీలు,పురుషులు ను పురుషులు పెండ్లి చేసుకుంటున్నారు.పైగా వాటిని చట్టబద్ధం చేయమని పోరాడి కొన్ని దేశాలలో విజయం సాధించారు కూడా.
భార్యలు లేకుండా పురుషులు.భర్తలు లేకుండా స్త్రీలు పిల్లల్ని పొందే సౌకర్యం రావడం తో డ్యూయల్ పేరెంట్షిప్ రివర్స్ అయి సింగల్ పేరెంట్ లు తయారు అయ్యారు. ఇలా పుట్టిన వారంతా రేపు సేమ్ సెక్స్ మ్యారేజ్ లు చేసుకున్నప్పటికి వారసుల పుట్టకకు ఆటంకం లేని గొప్ప రివర్స్ మ్యారేజ్ వ్యవస్త్ క్రియేట్ అయింది.ఇలా చెప్పుకుంటూ పోతే సమాజం లో ఎన్నో రివర్స్ లక్షణాలు కనపడుతున్నాయి.
ప్రకృతిని ఆరాధించే తత్వం మూఢత్వం అనుకున్న మనిషి ప్రకృతిని జయించి తన గొప్ప తనాన్ని చాటే క్రమం లొనే ఈ రివర్స్ సంస్కృతి ఏర్పడుతుంది.కానీ అదే ప్రకృతి తాను రివర్స్ అయి మహా ప్రళయాలు సృష్టిస్తే కలి యుగం అంతమై కృతయుగం మొదలు అవుతుందేమో.......
Thanks for this useful information,
ReplyDeleteThis information is very useful to me,
Please update this type of information more
Khammam City Classified Directory Website