పురాణాలు "హంబగ్" అనే వారు, మొన్న కేదార్ నాద్లో జరిగిన "గంగావతరణం" గూర్చి ఏమంటారు?
మన పురాణాగాదలను "పుక్కిట పురాణాలుగా కొట్టి పారేసే సో కాల్డ్ విదేశి బావజాల అభిమానులకు ఇది ఒక చెంపపెట్టు ఉదాహరణ కాగలదు. సాక్షాత్తు కేదారనాదుని సాక్షిగా జరిగిన ఒక మహ విలయం సామాన్యమైనది కాదని, అది మన పూర్వికులు పురాణాలలో చెప్పిన ’గంగావతరణం"లాంటిది అని తెలియవస్తుంది.మన పురాణాల ప్రకారం టూకీగా గంగ భువికి ఏతెంచిన విదమిది. పూర్వం బగీరదుడు,తన వంశీయులకు సద్గతి కలిగించడానికి పైన ( దేవ లోకంలో) ఉన్న గంగను బూమి మీదకు తీసుకు రావడానికి కటొర తప్పస్సు చేస్తాడు. దానికి మెచ్చిన గంగ తాను భూమి మిదకు రావడానికి అబ్యంతరమ్ లేదని, అయితే బూమి మీదకు వచ్చే క్రమంలో తనను తట్టుకునే శక్తి భూమికి లేదని ఆ శక్తి ఒక్క ముక్కంటికి మాత్రమే ఉందని, కాబట్టి ఆ మహా దేవుడు అంగీకరిస్తే తాను బువి మీదకు రావడానికి అబ్యంతరం లేదని తెలుపగా, మహా బక్తుడైన బగీరదుడు పట్టుదలతో, శివుని గూర్చి తపంబొనరించి, ఆ జడదారిని మెప్పించి ఆయన సమ్మతి గంగకు తెలియ చేయగా, ఆ గంగ ఉత్తుంగ తరంగిణిఅయి దివి నుండి బువికి దూకుతుంటే అందరూ బయ విహల్వులై...