Posts

Showing posts from June, 2016

"మగబుద్ది" గురించి 'మనవు' చెప్పిన విషయాన్ని నిజమని రుజువు చేసిన "తెహెల్కా " చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ అత్యాచార ఉదంతం

Image
                                                                  నేను ఇంతకు ముందు పోస్టులో మగ బుద్ది  అనేది చంచల మైనది, అది జన్మతః వస్తుంది , కానీ అబ్యాసం అంటే విద్యా సంస్కారాలు చేత దానిని కంట్రోల్ చేయవచ్చు అని చెప్పటం జరిగింది. అంతే కాదు మగవారు సంస్కార హీనులుగా మారకుండా ఉండదానికి సమాజం లో స్త్రీలు కూడా  కొన్ని కట్టుబాట్లు పాటించాల్సి ఉంటుంది. కానీ స్వేచ్చా తప్పా మరేది చెప్పొద్దనే వారు వాస్తవాలను పరిగణన లోకి తీసుకోకుండా అలవిమాలిన ఆదర్శ సూత్రాలు వల్లే వేస్తూ చివరకు సమాజములో  "నేరము -శిక్ష" అనే ఏకైక పందానే  మగవారిని నియంత్రించి స్త్రీలకు రక్షణ ఇవ్వగలుగుతుందని  నమ్ముతున్నారు.  ఈ  సందర్భంగా నేను ఇదివరకు ప్రచురించిన టపా" మగబుద్దిని కంట్రోల్ చెయ్యాలంటే మగువలను దూరంగా ఉంచడం లాంటి సాంప్రదాయక విదానమే బెస్టా?" అనే దానిలో  "అసలు స్త్రీల పట్ల చాలా మంది మగాళ్ళు ఎందుకు  చంచల బుద్దితో  ప్రవరిస్తారు ? దీనికి పైకి చెప్పే కారణం ఒకటే . సంస్కార హీనులైన వారే అలా ప్రవర్తిస్తారు అని. కానీ ఎన్నో ఏండ్లుగా సంస్కారవంతులుగా చలామణీ అయిన వారు సహితం, స్త్రీల ఔన్నత్యాలు గురించ

జీతం ఎక్కువ ఇయ్యలేక " ఆవారా" గాడిని అద్యాపకుడుని చేస్తే, 11 మంది మీద అత్యాచారం చేసాడట!

Image
                                     నల్గొండ జిల్లాలో మరొక ఘోరం జరిగింది. మొన్ననే ఒక B.Tech అమ్మాయిని ఒక మాజీ సర్పంచ్ కిరోసిన్ పోసి చంపిన వైనం మరువక ముందే ఘోరాతి ఘోరం, నిచాతి  నీచమైన పని ఒకటి ఈ  జిల్లాలో జరిగింది. నల్గొండ జిల్లా పెద్ద వూర మండలం ,లోని ఎనిమిది తండ లో V.R.O  అనే స్వచ్చంద సంస్త ఒక పాఠశాల(ట్యూషన్ పాఇంట్) నడుపుతుంది. ఆ పాఠశాలలో గిరిజన బాలికలకు ఉచిత విద్య నందిస్తున్నారు. పిల్లలను డబ్బులు ఖర్చు చేసి పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివించే స్తోమత లేని పేద గిరిజనులు తమ పిల్లలను ఈ స్వచ్చంద సంస్త ఆద్వర్యంలో నడిపే స్కూలులో నైనా  చదువు కుంటే మెరుగైన  చదవు అబ్బుతుందని గంపెడంత ఆశతో చేర్పించి ఉంటారు.       ఇక కొన్ని స్వచ్చంద సంస్తల పని తీరు కూడ అంతంత మాత్రమే. ఎవరో దాతలు ఇస్తున్న సొమ్ముతో నడుపుతున్న సంస్తలుకు నైపుణ్యం , అనుభవం ఉన్న ట్యూటర్లు ను నియమించే స్తోమత ఉండదు. అందుకే అదే గ్రామానికి చెందిన ఒక ఆవారా గా తిరిగే వాడిని ఆ పిల్లలకు చదువు చెప్పడానికి అద్యాపకుడిగా నియమించారు. వాడు అసలే గాలికి తిరిగే వాడు. అటువంటి వాడి ముందు పదేండ్ల అమ్మాయి అయినా, 60 యేండ్ల అమ్మమ్మ  అయినా ఒకటే వాడికి. అందు

సిద్దరామయ్య గారికి విదేశీ పద్దతిలో ముద్దు పెట్టి స్వదేశీ పద్దతిలో సిగ్గుపడిన "గిరిజా శ్రీనివాస్ "!!

Image
                                            ఈ దేశ , సంస్కృతి సాంప్రదాయాల్ని,ఔనత్యాన్ని  కాంగ్రెస్ పార్టీ లోని కొంతమంది పెద్దలు తమ బరితెగింపు చేష్టల ద్వారా నాశనం చేస్తున్నారో క్రింద ఇవ్వబడిన వీడియోల ద్వారా తెలుసుకోవచ్చు. స్త్రిలైనా పురుషులైనా తాము నివసించే సమాజం లోని కట్టుబాట్లను, సంస్కృతి సాంప్రదాయాలను పాటించాల్సిన అవసరం ఉంది . అదే పదిమందికి రోల్ మోడల్ గా ఉండాల్సిన రాజకీయనాయకులకు అయితే , కేవలం వాటిని పాటించడమే కాకుండా వాటిని పరిరక్షించాల్సిన అవసరం కూడా ఉంది. మన దేశం లో పిన్నలకు  ఆశీర్వాదం ఇవ్వాలన్న , పెద్దల పట్ల అభిమానం తో కూడిన గౌరవం చూపాలన్న దానికి ఒక పద్దతి అంటూ ఉంది. విదేశ సంస్కృతి మాదిరి "ముద్దులు పెట్టె" అభిమాన ప్రదర్శన ఇండియాలో కుదరదు. అది చూసే వారికి ఎంతో ఎబ్బెట్టు కలిగిస్తుంది.       అయితే ఇండియాలో  ఈ బహిరంగ  ముద్దుల వ్యవహారం లో కాంగ్రెస్ పార్టీ వారికి విదేశీ సంస్కృతి వంటబట్టినట్లు ఉంది. అందుకే పోయిన ఎలెక్షన్ ప్రచార సందర్భంగా, మీరట్ అభ్యర్థిని అయిన ,  యాక్టర్ నగ్మాను , తాత  వయసు ఉన్న గజరాజ్ శర్మ అనే MLA గారు బహిరంగంగా ముద్దు పెట్టి , "ఇది వాత్సల్యం తో పెట్

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

Image
                                                                                                                                            చలంగారు చెప్పిన కధల్లో మాదిరి మనుషుల జీవితాలు సాగితే చలం గారు కూడా దేవుడే అయి ఉండేవాడు. కాని చలం గారు ఒక మనిషి మాత్రమే! అందుకే అయన కోరుకున్న విదంగా సమాజం ఉండదు . ఆయన్ని నడిపించిన విది  ప్రకారమే సమాజం ఉంటుంది. ఆ విదే  విదాత. అతనికి గల మరో పేరే దేవుడు! మనస్సు నచ్చినట్లు ఎప్పుడూ చెయ్యటం కాదు మనిషి  కి ఉన్న స్వేచ్చకు అర్దం. ఇచ్చిన మాటకు కట్టుబడి, ఇతరుల స్వేచ్చకు బంగం కలిగించకుండా , తన పరిదిలో తానుండటమే   నిజమైన స్వేచ్చ. అటువంటి పరిదిని దాటిన వారు ఈ  సమాజం లో జీవించలేరు అని ఈ   క్రింది ఉదంతం తెలియ చేస్తుంది.   ఖమ్మం నగరానికి 25 కిలో మీటర్లు దూరం లో ఉన్నది కూసుమంచి మండలం హెడ్ క్వార్టర్  కూసుమంచి . దానికి దగ్గర లో ఉన్న ఒకా నొక గ్రామం లో వెంకట్  అనే 35 సంవత్సరాల వ్యక్తీ మరియు అతని తమ్ముడు ఎంతో అన్యోన్యంగా ఉండే వారు. వారివువురూ వివాహితులు. వెంకట్ కు ఒక మగ పిల్లవాడు మరియు ఒక ఆడపిల్ల సంతానం. అతని తమ్ముడుకు ఇరువురూ ఆడపిల్లలు.వెంకట్ ఆటో డ్రైవర్ కాగా

ఆమెను అదృష్టం అమెరికాకు పంపినా , గ్రహచారం మళ్ళీ మైలవరం కే లాక్కొచ్చిందట !!

Image
                                           సినిమాలు చూసి యువత పిచ్చిదయిపోతుందో  లేక  సమాజం లో ఉన్న పిచోళ్ళని చూసి సినిమాలు తీస్తున్నారో తెలియదు కానీ, కొంతమంది ప్రేమ వ్యవహారాలు చూస్తుంటే అచ్చం ప్రేమ సినిమాకి పనిని వచ్చే కధలు మాదిరే ఉంటున్నాయి. ఉదాహరణకి మొన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసి హాస్పిటల్ పాలు అయినా "మానస " అనే అమ్మాయి ఉదంతమే చూద్దాం.     అమ్మాయిది కృష్ణా జిల్లాలోని మైలవరం. హేమంత్ అనే కుర్రాడిని ప్రేమించింది. సరే ,చాలా మంది తల్లి తండ్రులు ఒప్పుకోనట్లే అమ్మాయి ప్రేమించినోడిని పెండ్లి చేసుకోవడానికి ఆమె తల్లి తండ్రులు ఒప్పుకోలేదట. సింపుల్ గా తన ప్రేమ వ్యవహారం గురించి పెద్దలకు చెప్పింది కానీ, వారు చూసిన సంబంధం వద్దని మాత్రం గట్టిగా చెప్పలేక పోయిందో, చెప్పినా వారు వినిపించుకోలేదో కానీ, తల్లితండ్రులు కుదిర్చిన అమెరికా సంబంధం చేసుకుని , అమెరికా వెళ్ళిపోయింది.         ఇక ఇక్కడ ఆమెను గాఢంగా ప్రేమించిన ప్రియుడు , ఆమె పెండ్లి చేసుకుని అమెరికా పోయినంత సేపు కామ్ గా ఉండి , తీరా ఆమె కాపురానికి వెళ్ళిపోయాక , "నీవు లేకుండా నేను బ్రతుకలేను" అనే సినిమా డైలాగులతో ఫోన

స్త్రీలను స్త్రీలు పెండ్లి చేసుకోవడం సాధ్యమైతే , స్త్రీలపై స్త్రీల అత్యాచారాలూ సాద్యమే !!!

Image
                                                                                                జంబ లకిడి పంబ అనే పేరుతో E.V.V సత్యనారాయణ గారి దర్శకత్వం లో 1993 లో వచ్చిన కామెడి సినిమా చాలా వెరైటిగా ఉండి ప్రేక్షకులను కాసేపు నవ్విస్తుంది. జంబ లకిడి పంబ అంటె పురుషులు తమ సహజ గుణం కోల్పోయి ఆడంగుల వలే ప్రవర్తించడం . అది సభ్య సమాజానికి ఎబ్బెట్టుగా అనిపించడమే కాకుండా నవ్వూ పుట్టిస్తుంది . అంటె  ప్రక్రుతి ప్రసాదించిన సహజ గుణానికి అనుగుణంగా ప్రవర్తించడం లోనే హ్యూమన్ డిగ్నిటి ఉంటుంది తప్పా , వెకిలి చేష్టలు, వికార మనస్తత్వం అనేవి  తప్పకుండా మానవ  ఔన్నత్యానికి గొడ్డలి పెట్టు లాంటివి        ఇన్నాళ్ళు మనవ సమాజంలో స్త్రీలపై లైంగిక దాడులు పురుషులు మాత్రమే చేస్తూ వస్తున్నారు కాబట్టి "రేప్ "అంటె స్త్రీ మీద పురుషుడు చేసే లైంగిక దాడి అని నిర్వచనం . కాని ఈ  నిర్వచనానికి కాలం చెల్లే రోజు దగ్గర్లోనే ఉన్నట్లుంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే "స్వలింగ వివాహాలు  " చట్ట బద్దం చేసారు. మన దేశం లో కూడా చట్ట బద్దం  చేయమనే "బడ్డు వాదం  " మొదలైంది . వీరి కోరిక ప్రకారం "స్వలింగ

ప్రభువు చెప్పాడని, వేపుడు చేసిన "మనిషి మాంసం " వీధుల్లో పంచుతూ పట్టుబడ్డ పాస్టర్ !

Image
                                                 ఈదేశం లో క్రిస్టియన్ సంస్థలు "స్వస్థత కూటములు" పేరిట సభలు నిర్వహిస్తూ , సర్వ రోగాలకు నివారిణి యేసు నామమే తప్పా వేరేది కాదని, రోగాలు వచ్చిన వారు హాస్పిటల్స్ కి వెళ్లే కంటే తాము నిర్వహించే "స్వస్థత కూటములకు" వస్తే సరిపోతుందని చెపుతూ అమాయక భక్తుల ఆరొగ్యాలతో చెలగాటలాడుతున్నారు. ఆ మధ్య ఒక స్కూల్  ప్రధానోపాధ్యాయురాలు  25 ఏండ్ల  తన కుమారుడు కి జబ్బు చేస్తే హాస్పిటల్ కి తీసుకువెళ్లకుండా , ఇంట్లో నే ఉంచి ప్రార్థనలు చేస్తూ కూరుచుంటే , అతను కాస్తా చచ్చిపోయాడు. అయినా సరే తన కుమారుడు తిరిగి జీవిస్తాడని ఆ శవాన్ని ఇంట్లో పెట్టి ప్రార్థనలు చేస్తుంటే, కుళ్లిపోతున్న ఆ శవం కంపు భరించలేక , చుట్టుపక్కలోళ్లు కంప్లయింట్ చేస్తే , పోలీసులు వచ్చి, ఇంటి తలుపులు విరగ గొట్టి శవాన్ని పోస్టు మార్టం కి, ఆమెను జైలుకి తరలించారు.    ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చ్చిందంటే , ఇదే మతానికి చెందిన పాస్టర్ ఒకతను , తన పిల్లవాడికి సుస్తీ చేస్తే , ఆ జబ్బు నివారణ కోసం , ప్రభువు ఆదేశించాడు అని , వండిన మనిషి మాంసం ని తీసుకుని వెళ్లి , వీధుల్లో కనిపించిన

"అనుమానం " అనే పెను బూతాన్ని అంతం చేయక పొతే , అది కుటుంబాలని ఎలా అంతం చేస్తుందో చూడండి !

Image
                                                                                            ఎయిడ్స్ , కాన్సర్ , బి.పి. , షుగర్ , ఇత్యాది వాటిని వ్యాదులుగా గుర్తించిన ప్రభుత్వాలు , వాటి నివారణ కోసం హాస్పిటల్స్ ని నెలకొల్పి ప్రజల్ని వాటి బారి నుండి కాపాడ డానికి బారి ఖర్చును చేస్తుంది . చాలా సంతోషం . కాని విటికంటే  భయంకరమైన వ్యాది ఒకటి మన సమాజంలో కుటుంబాలు కుటుంబాలనే అంతం చేస్తుంటే , దాని గురించి ప్రభుత్వాలు పట్టించుకోవటం మాట అటుంచి  అసలు దానిని "వ్యాది " గానే గుర్తించక పోవడం చాలా దురదృష్ట కరం . ఆ వ్యాది పేరే "అనుమానం ".                  పైన చెప్పిన వ్యాదులలో ఎయిడ్స్ తప్పా మిగతావి వ్యక్తులకి మాత్రమె ప్రమాద కరమైనవి . ఎయిడ్స్ వలన కుటుంబం కి ప్రమాదం ఉన్నప్పటికీ , అది శాంతి బద్రతల సమస్యలు సృష్టించదు . కాని అనుమానం వ్యాది అలా కాదు . అది వ్యక్తులని నేరస్తులుగా మార్చి చివరకు కుటుంబాలనే సమూలంగా నాశనం చేస్తుంది . దానికి ఉదాహరణే  పైన చూపిన రెండు కేసులు . ఈ  రోజు దిన పత్రికలో ప్రచురితమైన ఆ  రెండు కేసులలోని విషయాలు క్లుప్తంగా ఇవి :   తూర్పు గోదావరి జిల్లా , గోకవరం మండలం లో

"గడ్డ పగిలిపోవును గాక ! గడ్డ పగిలిపోవును గాక " అని గొంతెత్తి విజ్ఞాన వేదిక లను సవాలు చేస్తున్న "దేవుని బిడ్డలు".

Image
                                                                                           హిందువులు ఒక యజ్ఞం చేస్తుంటే అజ్ఞానం అంటారు. దేవుని కి అభిషేకం చేస్తుంటే పాలు ఎందుకు వేస్ట్ చెయ్యడం అంటూ  సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టెస్తుంటారు. వందల యేండ్లుగా నయా పైసా తీసుకోకుండా ఉబ్బస వ్యాది ఉపశమనానికి ఉచితంగా "చేప ప్రసాదం " ఇస్తుంటే సభలు పెట్టి మరీ నానా యాగీ చేస్తుంటారు. దేశం లో సైన్స్ తెలిసిన మేమే పెద్ద విజ్ఞానులం , పూజలు  చేసే హిందువులు అంతా  పెద్ద పిచ్చి పువ్వులే అని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటారు.సైన్స్ వేరు . నమ్మకం వేరు.  దీనిని భారత రాజ్యాంగం కూడా అంగీకరించింది. అయినా సరే పదే పదే హిందువుల  మనోబావాలను తీవ్రంగా గాయపరుస్తూ  విదేశి శక్తుల మెప్పును   పొందుతుంటారు.ఇదీ, తాము మాత్రమే జనానికి విజ్ఞానం అందించే పని చేస్తున్నామని ప్రజలని నమ్మింప చూస్తున్న కొంతమంది "విజ్ఞాన బాబుల " నిత్యక్రుత్యాలు. పైకి వీరు చేసేది విజ్ఞాన బొదలె అని జనానికి అనిపించినా , నిజానికి వారు చేస్తుంది మాత్రం,  విదేశి మతాలు చేసే మత మార్పిడులకు పరోక్షంగా సహాయం చేయడం . అదెలాగో చూడండి.  

బార్యను "రేప్" చేసిన వారు భర్త మరియు అతని బందువులట!

Image
                                                                  భారత రాజధాని "డిల్లీ" నిర్భయ ఉదంతానికే కాదు, మరెన్నో నిక్రుష్టపు పనులకు చరిత్రగా మిగిలిపోబుతుందా! అనిపిస్తుంది ఈ ఉదంతం వింటే.   అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్నారట! అమ్మాయి తల్లి తండ్రుల ఇష్టం లేకుండా మొన్ననే పెండ్లి కూడ చేసుకున్నారట. అ తర్వాత ఆ పెండ్లిని రిజిస్టర్ చేయించుకుందామని చెప్పి, నూతన దంపతులు, వారితో పాటి అబ్బాయి ఇద్దరు బందువులు కుర్రాళ్లు కారులో బయలు దేరారట. కారులో ప్రయానిస్తున్న బార్యకు(?), భర్త మత్తు మందు కలిపిన  కూల్ డ్రింక్ ఇచ్చాడట. ఆమే దానిని తాగి మత్తులోకి వెళ్ళిపోయిందట.వారు ముగ్గురు ఆమెను "రేప్" చేసి "నజఫ్గడ్" లో రోడ్డు ప్రక్కన పడేసి వెళ్ళి పోయారట.స్ప్రుహలో లేని ఆమెను గుర్తించి పోలిసులకు సమాచారం అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఇచ్చిన పిర్యాదు మేరకు  పోలిసులు ఆమే భర్త ఇంద్రజీత్ మీద,అతని బందువులమీద కేసు నమోదు చేసి వారిని అరెశ్ట్ చెయ్యడం జరిగింది. ఇది తాజా సమాచారం.    పై కేసులో నాకొక అనుమానం ఏమిటంటే, ఇంద్రజీత్ అనే వాడు నిజంగా అమేను మస్పూర్తిఘా పెండ్లి చేసుకున్

ఈ ఇల్లు కొన్న వారికి ,ఆ ఇంటావిడ "ఫ్రీ " అట !!!?

Image
                                                                                స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా ,ఎంతవరకు వచ్చిందే నీ పయనం అంటె , ఇంటితో పాటు ఇంటావిడను కూడా అమ్మే వరకు " అందట . అలా ఉంది ఈ ఇండోనేషియన్ ఆధునిక ఇల్లాలు చేసిన పని. అదేమిటో చూదామా ?     ముందు ఇల్లును చూసి,ఆ తర్వాత ఇల్లాలును చూడాలి అని మన పెద్దలు అంటుటారు .దీనిలో విశేషం ఏమిటంటే ఒక ఇల్లాలి అభిరుచులు , నైపుణ్యం ,సమర్ధత అనేది ఆమె నిర్వహించే గృహ నిర్వహణ లో తెలుస్తుందని మన పెద్దల అభిప్రాయం . ఇక పొతే ,సంప్రాదాయ' ఇల్లు -ఇల్లాలు 'కాన్సెప్ట్ ని నిరసించే స్త్రీ వాదులు   స్త్రీలను పురుషులతో సమానంగా ఎదగకుండా చేస్తున్న అంశాల్లో, ఇంటి బాద్యతలు స్త్రీలకు అప్పచెప్పడం ఒకటని అంటారు. స్త్రీలను పురుషుల ఆస్తిగా బావిస్తున్నారని , ఆ ఆదిమ  బావన వలననే నేటికి స్త్రీలను గృహ నిర్భందం కు గురిచేసి వారికి గల స్వేచ్చా స్వ్వాతంత్ర్య హక్కులను హరిస్తున్నారు అని తెగ బాధపడి పోయె వారి సంఖ్య తక్కువేమి కాదు . మరి అటువంటి వారికి ఒక స్త్రీ అందులో ఒక ఇంటికి సర్వ హక్కులు కలిగిన యజమాని ,తను కూడా తన ఇల్లు లాగే ఒక ఆస్తి అనే తరహాలో ,అడ

శ్రీ వాణి లాంటి స్త్రీలూ ఉంటారు! తస్మాత్ జాగర్త!

Image
                                                                                                                                                                      సత్యమేవ జయతే నానృతమ్                                 సత్యేన పంథా వితతో దేవయానః                                 యేనాక్రమాంత్యా ఋషయోహ్యాప్తాకామా                                  యాత్ర తత్సత్యస్య పరమం నిధానమ్ అర్థం : సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు. సత్యం ద్వారా దివ్య (దేవ)మార్గం అవగతమౌతుంది. ఆ మార్గంలోనే ఋషులు తమ అభీష్టాలను వెరనేర్చుకొని పరమ నిధానాన్ని చేరుకోగలిగారు.               రాష్ట్రంలో  సంచలనం స్రుష్టించిన అనంతపురం శ్రీ వాణి కేసు అటు పోలిస్ వారిని విస్మయ పరిస్తే, ఆమె కోసం పోరాడుతున్న ప్రజా సంఘాలను తల వంచుకునేలా చేసింది.   అనంతపురం జిల్లాకి చెందిన శ్రీవాణి అనే యువతి రాఘవ అనే అబ్బాయిని ప్రేమించింది అట. వారి మద్య  చిగురించిన ప్రేమ ఎందుకో చిటపటలాడింది. దానితో ఆ అమ్మాయి ఆ అబ్బాయి మీద కసి పెంచుకుంది. ఈ మద్య అమ్మాయిల మీద ఆసిడ్ దాడులు, లైంగిక దాడులు ఎక్కువుగా జరుగుతుండడం, ప్రజా సంఘాల తీవ్ర నిరసనలతో అలర్ట్ అవుతున

స్నేహితురాలిని, భర్త అతని స్నేహితుని చేత ’గాంగ్ రేప్’ చేయించిన బార్య!.

Image
                                                                                                                                                                స్త్రీల మీద లైంగిక దాడులు ఈ మద్య ఎక్కువ అవుతున్నాయని జాతి మొత్తం ఎలుగెత్తి ఘోషిస్తున్నా మదాందులకు కించిత్ అయినా బెరుకు కలగడం లేదు. "నిర్భయ" లాంటి కఠిన చట్టాలు సైతం వారిని భయ పెట్ట లేక పోతున్నాయి. ఇక పోతే స్త్రీల మీద చేసే లైంగిక దాడుల్లో అక్కడక్కడా స్త్రీల పాత్ర  కూడా ఉండటం కొత్తేమి కాదు. వ్యభిచార గ్రుహాలు నడిపే వారు, విటులకు అమ్మాయిలను సరపరా చేస్తూ, మాట వినని వారిని తమ అనుచరుల చేత లైంగిక దాడి చేయించటం సినిమాలలో చూస్తుంటాం . కనీ సాక్షాతు బార్యయే దగ్గరుండి మరీ, తన స్నేహితురాలి మీద తన భర్త మరియు అతని స్నేహితునితో "గాంగ్ రేప్" చేయించిందంటే అటువంటి మహా ఇల్లాల్ని ఏ తీరుగ కొనియాడాలి?!   మద్య ప్రదేశ్ లోని మొరీన జిల్లాలో, మొరీనా పట్టణానికి 75 కిలోమీటర్ల దూరం లో సబల్ గర్ అనే ప్రాంతం లో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో వంటమనిషి ఉద్యోగం కొరకు ఒకామే దరఖాస్తు చేసుకుందట. ఆమె స్నేహితురాలైన "పిస్తా దేవి" అనే

నకిలీ అకౌంట్ ల పేస్బుక్ బాయ్ ప్రెండ్ కల్ల బొల్లి మాటలకు, బంగారం, డబ్బు, సర్వం సమర్పించుకున్న 14 యేండ్ల గర్ల్ ప్రెండ్!

Image
                                                                                                          పేస్ బుక్ పరిచయాల మోజులో పడి ఆడపిల్లలు ముఖ్యంగా టినేజ్ పిల్లలు ఎలా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారో ఈ  ఉదంతం ద్వారా తెలుస్తుంది. "కన్యా వరయతే రూపం " అని ప్రతి ఆడపిల్లా తనకు కాబోయే వాడి అంద చందాలకే తోలి ప్రాదాన్యం ఇస్తుంది అనేది సత్యం. ఆడపిల్లల యొక్క ఈ వీక్నెస్ ను ఆదారంగా చేసుకుని , కొంతమంది మోసగాళ్ళు తమ అందంతో పాటు లేని డబ్బూ దర్పం ఉందని నమిస్తో వారిని మోసం చేస్తున్నారు. దీనికి పేస్బుక్ లాంటి సామాజిక సైట్లు బాగా ఉపయోగపడుతున్నాయి.  ఉత్తర ప్రదేశ్ కు చెందిన మిస్బః అయూబ్ అలీఖాన్ 18 యేండ్ల యువకుడు. ఇతను ఒక కాలేజిలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తూ ,గత కొద్ది నెలలుగా కాలేజికి వెళ్ళడం మాని వేసాడు.కురాడు చూడటానికి ఏర్ర్రగా బుర్రగా బాగుంటాడు. అందుకే ఖాన్ కి ఆడపిల్లల్ని పటాయించి పబ్బం గడుపుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. వెంటనే పేస్ బుక్ లో రెండు ఖాతాలను తెరచాడు . ఒకటి ఆడపిల్ల పేరుతో, మరొకటి మగపిల్లాడి పేరుతో . ఆడపిల్ల పేరు శైలి పరేకా , మగ పిల్లాడి పేరు అర్మాన్ కపూర్.

విదేశి "స్వస్తత ప్రార్థనలు" కు కళ్లొస్తాయి, కాళ్లొస్తాయి, కాన్సర్ కూడా తగ్గుద్ది అంటే పట్టించుకోని విజ్ణానులకు హిందూ "చేప ప్రసాదం" మీద అంత కోపం ఎందుకు?

Image
                                                                                                      చట్టం  అనేది అన్ని  కులాలకు, మతాలకు సమానం గా వర్తిస్తుంది అని మన రాజ్యాంగం చెపుతుంది. మరి మన బత్తిన సోదరులు ఇచ్చే చేప ప్రసాదం వల్ల ఉబ్బసం తగ్గడం అనేది హంబగ్ కాబట్టి  ఆ కార్యక్రమానికి ప్రబుత్వ పరంగా ఏ సహాకారం ఇవ్వ రాదని కోరుతూ గత రెండు మూడెండ్ల నుండి కక్ష కట్టినట్లు "జన విజ్ణాన వేదిక వారు "చేప ప్రసాదం" పంపీణీ కార్యక్రమానికి తీవ్ర అడ్డంకులు కలిగిస్తున్నారు. దీని మీద అంద్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్తానం ఒక అభిప్రాయం వెలిబుచ్చినప్పటికి, దానిని వారు ఖాతరు చేస్తున్నట్లు లేదు. మొత్తం ఈ తతంగం వెనుక ఏదో గూడుపుటాణి ఉందనిపిస్తున్నది.   లేకుంటే శాస్త్రీయత, అనేది కేవలం హిందూ మత విదానాలకే వర్తిస్తుందా? ఇతర మతాల వారి కార్యక్రమాలకు వర్తించవా? విడేశి మతానికి చెందిన వారు వారాల తరబడి ప్రబుత్వ సహాకారంతో వివిద గ్రౌండ్స్ లలో "స్వస్తత కూటములు" ఏర్పాటు చేసి, అక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తె కళ్లొస్తాయి! కాళ్లోస్తాయి! కాన్సర్, మధుమేహం లాంటి మహమారిలు అంతులేకుండా పోతాయి అని చెప్ప

భార్యను చంపి స్నానం చేయించి , శవంతో ఎంజాయి చేస్తూ, రాత్రల్లా గడిపిన శర్మ ది శాడిస్ట్ !!

Image
                                                                                                                    తోలి చూపులోనే వలచి , వెంటపడి ,పెద్దలను బ్రతిమాలి పెండ్లి చేసుకున్న మొగుడు , చివరకు తనని దారుణంగా చంపడమే కాక , తన శవం పై ఒక రాత్రల్లా ఎంజాయి చేస్తాడని  ఊహించలేక పోయింది ఆ అమ్మాయి! తమ కూతురిని పెండ్లి చేసుకుని పువ్వులో పెట్టుకుని చూసుకుంటాను అని తమను బ్రతిమాలుతున్న వాడు తమకు అల్లుడు అయితే తమ కూతురు జీవితం ఎంతో ప్రేమమయంగా ఉంటుంది అనుకున్నారు కాని,  ఇలా కూతురి ని చంపి ఆమె శవంతో పడుకునే  "మ్రుగాడు " తమ అల్లుడు అవుతున్నాడు అని ఏ నాడూ అనుకోలేదు ఆ అభాగ్య తల్లితండ్రులు. వినడానికే ఒళ్ళు గగుర్పొడిచే ఈ భయానక ఉదంతం పోయిన  సోమవారం డిల్లీలో  జరిగింది. వివరాలులోకి వెలితే      న్యూ డిల్లీకి చెందిన ప్రదీప్ శర్మకు పాతికేళ్ళు . అతని స్వస్తలం ఉత్తరప్రదేసశ్  లోని  బులందేశ్వర్ . తన అన్న పెండ్లిని చూడటానికి వచ్చిన మోనికను చూడగానే  తొలిచూపులోనే  తన మనస్సు పారేసుకున్నాడు. అప్పటికే శర్మకు  లొకాలిటిలో "బాడ్ బాయ్ " అనే బిరుదు ఉంది. పనిపాటా లేక రికామీగా తిరిగే ఉల్

తన ప్రేమను తిరస్కరించారని తల్లితండ్రులను చంపి , వారి శవాల సమక్షంలో ప్రియుడితో 72 రోజులు గడిపిన కసాయి కూతురు!

Image
                                                                   తమ పిల్లలు కులం కానివాడినో , లేక తాము కాద్దన్న వాడినో ప్రేమించి అతనితో పెళ్ళికి సిద్దపడితే , వారిని చంపిన కసాయి కుటుంబ సబ్యుల హత్యోదంతాలు మన దేశం లో అక్కడక్కడా జరిగాయి . వాటికి "పరువు హత్యలు" గా పేరు పెట్టి సదరు కుటుంబ సబ్యులకు "ఉరి శిక్ష " లు కూడా విదించిన సందర్బాలు ఉన్నాయి . ఇటుంవంటి దగుల్బాజీ పనులను సబ్యసమాజం ఒప్పుకోదు. అయితే పిల్లల ప్రేమ ను తిరస్కరించి వారిని చంపడం "పరువు హత్య" అయితే , తల్లితండ్రులు బాయిప్రెండ్తో తిరుగుళ్ళు మాని బుద్దిగా చదువుకోమన్నందుకు   వారినే మట్టుబెట్టడం ని ఏమనాలి? మన దేశంలోనే ఇది జరిగింది. దిగజారిన పిల్లల మానసిక స్తాయి కి అద్దంపట్టే ఈ ఉదంతం వదోదర లో జరిగింది .   ఆ అమ్మాయిని పదిహేనేళ్ళ క్రితం చేరదీసి పెంచిన తల్లితండ్రులు వారు . ఇప్పుడు ఆమెకు 16 యేంద్లు. చదువు ని నిర్లక్ష్యం చేసి  21 సంవత్సరాల కుర్రాడితో ప్రేమలో పడింది . అది తెలిసిన తల్లితండ్రులు బాయి ప్రెండ్తో సహవాసం మాని బుద్దిగా చదువుకొమ్మని మందలించారు  . అంతే! కస్సుమంది ! ఏకంగా ప్రియుడితో కలిసి వారిని

"గాందీ గారి స్వాతంత్ర్యం" వచ్చేదాక "బాయ్ ఫ్రెండ్"ల సంస్క్రుతికి బై, బై చెప్పండి.

Image
                                                                     \                             స్వాతంత్ర్యం వచ్చిన అరవయి అయిదేళ్లకు కూడా ఈ దేశంలో మన "జాతిపిత" గాంది గారు నిర్వచించిన "స్వాతంత్ర్యం " రానందుకు మనం సిగ్గుపడాలి. అయన జన్మ దినాలు ఘనంగా చెయ్యడం కాదు. ఆయన కలలు కన్న నిజమయిన స్వాతంత్ర్యాన్ని మనం సాదించిన నాడే ఆయనకు  ఏటా నివాళులు అర్పించగల అర్హత మనకు వస్తుంది.   ఏ నాడు ఆడది అర్థరాత్రి, నిర్భయంగా  బయటకు వెళ్లి రాగల్గుద్దో, అ నాడే నిజమయిన స్వాతంత్ర్యం అన్నారు అయన. అయన ఆ మాట ఆ రోజు ఎందుకు అన్నారో, నిన్న డిల్లీలో జరిగిన సంఘటన  చూశాక అర్థమవుతుంది. ఇది కేవలం దేశంలో శాంతి బద్రతలు సమస్యగా బావించి ఆయన ఆ మాట అని ఉండరని నా అభిప్రాయం. స్త్రీ పట్ల సమాజ ద్రుక్పదం లో మార్పు రావాలి. ఆ రోజే అది సాద్యపడుతుంది. స్త్రీని లైంగిక అవసరాలకు పనికొచ్చే వస్తువుగా చూసినంత కాలం ఇది సాద్య పడదేమో అనిపిస్తుంది.  అప్పట్టి దాక మన దేశం స్వతంత్ర బారతం అని చెప్పుకుంటానికి వీలు లేదు.  ఆ నాడు "మనువు" స్త్రీ రక్షణ  గూర్చి, వాస్తవిక ద్రుక్పదంతో, కుటుంభ రక్షణ నిత్యం అవసరమని చ

Ex బాయ్ ప్రెండ్ ని కాదని ఫ్రెష్ బాయ్ ప్రెండ్ తో రొమాన్స్ చేస్తే, రోమ్ లో కూడా కాల్చి చంపడం ఖాయమట !!

Image
ఇదిగో మరొక రుజువు దొరికింది. అదేనండి ప్రపంచం లో ఏ దేశం లో అయినా బాయ్ ప్రెండ్ , బాయ్ ప్రెండే , వాడిలో ఉండే  మగబుద్ది ఎక్కడైనా ఒకటే అనే దానికి రుజువు.కొంత మంది మనస్తత్వం ఎలా ఉంటుంది అంటె , పెళ్ళాం విడాకులు ఇచ్చి మరొక వ్యక్తిని పెండ్లి చేసుకున్నా పెద్దగా బాదపడరేమో కాని, గర్ల్ ప్రెండ్ కొంత కాలం తనతో తిరిగి , ఏదో కారణం తో మరొక బాయ్ ప్రెండ్ ను చూసుకుంటే చచ్చినా ఒప్పుకోరు. "దాన్ని చంపి నేను చస్తా " అంటారు. అంతేగా మరి! సంసార బందం కంటె బలియమైనది రంకు సంబందం. దానినే మై చాయిస్ వాదులు ప్రేమ బందం అంటారు కాబోలు!                       సరే, ఇంతకి అసలు విషయం ఏమిటంటే సో కాల్డ్ ఈ  ప్రేమ విషయాలలో బాయ్ ప్రెండ్లు  చాలా సీరియస్ గా  ఉంటూ గర్ల్ ప్రెండ్స్ తమ సొత్తు అయినట్లు , వారు తమని కాక వేరెవరి వంక చూసినా తట్టుకోలేక అతి కిరాతకంగా డాడి చేసి చంపడానికి కూడా వెనుకాడరు . ఇందుకు ఉదాహరణ , మన రాష్ట్రం లో జరిగిన శ్రీ లక్ష్మీ, మనోహర్ కేసు, వరంగల్ ఎన్ కౌంటర్ కేసు. అదే కోవలోకి వస్తుంది ఇటీవల రోమ్ లో అతి కిరాతకంగా వెంటాడి గర్ల్ ప్రెండ్ ను సజీవ దహనం చేసిన బాయ్ ప్రెండ్ ఉదంతం. వివరాలులోకి వెలితే     ర

కసితో కాటేస్తున్న "వీరభోగినులు","వసంత రాయుళ్లు"

Image
          ’తా చెడ్డ కోతి, వనమెల్లా చెరిచిందంటా! ఇది కేవలం కోతికి మాత్రమే కాదు, ఆ కోతి నుండి పరిణామం చెందాడు అంటున్న మనిషికి వర్తిస్తుంది.అందుకేనేమో ఈ మద్య ఒక నమ్మలేని నిజాన్ని వినాల్సి వచ్చింది. ఏమిటంటే,బాబు గారేమో "స్వర్ణాంద్ర ప్రదేశ్" తెస్తానని హామి ఇస్తే, "రెడ్డి" గారేమో "హరితాంద్ర ప్రదేశ్" తెస్తానని హామి ఇచ్చారు. కాని మన దురద్రుష్టం  ఆ రెండూ రాలేదు కాని "ఎయిడ్సాంద్రప్రదేశ్" మాత్రం అయిపోయింది మన రాష్ట్రం.   బారత దేశంలో మనదే అగ్రస్తానంలో ఉన్నది అంట.కాబట్టి మన వాళ్ళు ఆ విషయంలో మంచి దిట్టలే అని మురిసిపోవచ్చు. వెనుకటి కాలంలో పనీ, పాటా లేకుండా "పైలా పచ్చీసుగా" తిరిగే రసికాగ్రేసరులను,"వసంత రాయుళ్లు" అనే వారట. అలాగే వేశ్యా వ్రుత్తిని స్వీకరించిన వారిని "భొగం సాని"  అనే వారట. ప్రతి శుభ కార్యం లో "భోగం మేళం" తప్పనిసరిగా ఉండేదట!ఇదంతా ఎందుకు అంటే ఈ నాడు మన రాష్ట్రాన్ని ఊపేస్తున్న ఈ ఎయిడ్స్ మహమ్మారికి కారణం "వీర బోగినులు" మరియు "వసంత రాయుళ్లే కారణం. హద్దూ, పద్దూ  లేని అనైతిక జీవితమే ఈ అనర్దాని

ఫేస్ బుక్ కుర్రాడ్ని పెండ్లాడితే ఫేస్ అంతా బ్లేడ్ తో ముద్దులు పెట్టాడట!.

Image
   మన వివాహరీతులు మారిపోతున్నాయి. సాంప్రాదాయ పద్దతి ప్రకారం పెంద్లికి ముందే వదూ వరుల కుటుంభ పెద్దల్లు ఆటు ఏదు తరాలు, ఇటుఏడు తరాలు చూడాలనే పాత పద్దతిలో కాకపోయిన వ్యక్తిగతంగా పిల్ల లేక పిల్ల వాడు ఎటువంటి వారుఅనే వాటితో పాటు  పిల్లా, పిల్లవాడి కుటుంభాలు ఎటువంటివి? వారికి సమాజంలో, బందువులలో ఎటువంటి పేరు ఉంది?సౌమ్యులా? తగాదాల మారి కుటుంబాలా? అనే వాటిని కూలం కషంగా  ఎంక్వైరీ చేసిం తర్వాతే వివాహాలు కుదుర్చుకుంటారు. వ్యక్తిగత స్వేచ్చ పేరుతో విపరీత దోరణులు అవలంభిస్తున్న నేటి యువతరం నైజం చూస్తుంటే పూర్వ కాలం వారి కంటే , ఈ కాలం వారే పెండ్లి సంబందాలు  విషయం లో ఎక్కువ జాగర్తలు తీసుకోవాలనిపిస్తుంది.                                          ఈ మద్య కుర్ర కారు సామాజిక వెబ్సైట్లైన ఫేస్ బుక్ లాంటి సైట్ లలో పరిచయాలు పెంచుకోవటానికి తహ తహ లాడుతున్నారు. కొంత మందయితే ఆ పరిచయాలనే ప్రణయంగా మార్చుకుని  పరిణయం దాక వెళుతున్నారు. వదూవరుల సమాచారం కొరకు ఫేస్ బుక్ లను ఉపయొగిస్తే తప్పు లేదు, కాని అందులో ఉన్న సమాచారం నిజమో కాదో తెలుసుకోకుండా, ఇతరత్రా విచారణలు చేయ కుండా ఎర్రగా, బుర్రగా , ఉన్నాడని  పెండ్లాడితే బ్లేడ్