"గాందీ గారి స్వాతంత్ర్యం" వచ్చేదాక "బాయ్ ఫ్రెండ్"ల సంస్క్రుతికి బై, బై చెప్పండి.

                                                               
    

\
                            స్వాతంత్ర్యం వచ్చిన అరవయి అయిదేళ్లకు కూడా ఈ దేశంలో మన "జాతిపిత" గాంది గారు నిర్వచించిన "స్వాతంత్ర్యం " రానందుకు మనం సిగ్గుపడాలి. అయన జన్మ దినాలు ఘనంగా చెయ్యడం కాదు. ఆయన కలలు కన్న నిజమయిన స్వాతంత్ర్యాన్ని మనం సాదించిన నాడే ఆయనకు  ఏటా నివాళులు అర్పించగల అర్హత మనకు వస్తుంది.

  ఏ నాడు ఆడది అర్థరాత్రి, నిర్భయంగా  బయటకు వెళ్లి రాగల్గుద్దో, అ నాడే నిజమయిన స్వాతంత్ర్యం అన్నారు అయన. అయన ఆ మాట ఆ రోజు ఎందుకు అన్నారో, నిన్న డిల్లీలో జరిగిన సంఘటన  చూశాక అర్థమవుతుంది. ఇది కేవలం దేశంలో శాంతి బద్రతలు సమస్యగా బావించి ఆయన ఆ మాట అని ఉండరని నా అభిప్రాయం. స్త్రీ పట్ల సమాజ ద్రుక్పదం లో మార్పు రావాలి. ఆ రోజే అది సాద్యపడుతుంది. స్త్రీని లైంగిక అవసరాలకు పనికొచ్చే వస్తువుగా చూసినంత కాలం ఇది సాద్య పడదేమో అనిపిస్తుంది.  అప్పట్టి దాక మన దేశం స్వతంత్ర బారతం అని చెప్పుకుంటానికి వీలు లేదు.

 ఆ నాడు "మనువు" స్త్రీ రక్షణ  గూర్చి, వాస్తవిక ద్రుక్పదంతో, కుటుంభ రక్షణ నిత్యం అవసరమని చెపితే, ఈ నాటి వరకు ఆయన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు "అభ్యుదయవాదులు" అని చెప్పుకునే వారు. కాని ఈ నాడు వ్యభిచారం చేసే వారు సైతం పురుషుని అండ లేకుండా తమ వ్రుత్తి చేయలేక పోతున్నారు అంటే స్త్రీకి నిత్యం పురుష రక్షణ ఎంత అవసరమో గ్రహించాలి. అదే రక్షణ గురించి నిన్న వేలాది ఆడపిల్లలు, దేశ రాజధానిలో గళమెత్తారు. కాకపోతే వారు కోరింది, పురుష రక్షణ కాదు, ప్రభుత్వ రక్షణ, లేక రాజ్య రక్షణ. కాని మనుషుల బుద్దులు, ముఖ్యంగా మగాడి బుద్ది మారకుండా ఉన్నంత కాలం, బయపెట్టే చట్టాలున్నంత మాత్రానా స్త్రీల మీద లైంగిక దాడులు ఆగుతాయి అనుకోవడం భ్రమే కావచ్చు. అదే నిజమయితే, వరంగల్ లో ముగ్గురు కుర్రాల్ని ఎన్ కౌంటర్ చేసిన తర్వాత, మన రాష్ట్రం లో అత్యాచారాలు అగి పోవాలి. లెఖ్కలు చూడమనండి. ఆగాయా? లేదు! ఎందుకని?

  స్త్రీ బోగ వస్తువుగా పరిగణించబడటం " మనువు" కాలం కంటే నేడే అదికంగా ఉంది. కేవలం స్త్రీల శరీరాల మీద కొన్ని కోట్ల వ్యాపారం నడుస్తుంది. కాకపోతే వారిని ఒప్పించి కొంత, బలవంతంగా కొంత కావచ్చు. మరి ఈ విదంగా పురుష శరీరం ఉపయోగపడుతుందా? తేడా ఎఖ్ఖడుంది? కేవలం బారతీయ మగవాడి బుద్దే దీనికి కారణమా? ప్రపంచ మగవాల్లంతా వేరే విదంగా ఉన్నారా?మరి మగవాడి బుద్దిని మార్చకుండా  స్త్రీలు తొందరపడి బయటకు వస్తే జరిగేదేమితో తెలుసా? నిన్న డిల్లీలో జరిగిందే. కాబట్టి స్త్రీలు కూడ తమ సహజ రక్షణ దారులయిన, తండ్రి, భర్త, కొడుకు, ఎవరో ఒకరు కుటుంబ సభ్యుల రక్షణలో జీవిస్తే మంచిది. "బాయ్ ఫ్రెండ్"ల సంస్క్రుతికి బై, బై చెప్పండి. మొన్న సంఘటనలో బాయి ప్రెండ్ వెంట ఉండడం కూడ దుండగులకు తప్పుడు సంకేతానిచ్చి ఉంటుంది.   ఎక్కడ స్త్రీలు అణందంగా ఉంటారో అక్కడ దేవతలు నివసిస్తారట. ఇది అభ్యుదయవాదులు చెప్పింది కాదు. ఆ "మనువు " చెప్పిందే!
                                        (Republished post. OPD:23/12/12).

Comments

  1. ఎక్కడ స్త్రీలు అణందంగా ఉంటారో అక్కడ దేవతలు నివసిస్తారట
    అంటే మగాళ్ళు నాశనమైపోయినా ఫర్వాలేదన్న మాట? స్త్రీలు బావుంటే చాలు, వాల్లుండడానికి. వాళ్ళేం దేవుల్లండి బాబూ..?

    ReplyDelete
    Replies
    1. స్త్రీలను ఆనందంగా ఉంచడం లోనే కుటుంబ సౌక్యం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లోనే మగాడి అనందం ఇమిడిఉంటుంది." బార్య ఒళ్లో సేద దీరగలిగే వాడికి బారులేలా"!

      Delete
    2. మనువు గారూ, మీరు ఈ కాలములో లేరులెండి. అప్పుడెప్పుడో పాత కాలములోనే ఉన్నారు. కాకపోతే, అప్పుడెప్పుడో మనువుగారు చిత్ర విచిత్రమైన రూల్సు పెట్టి ఆడాళ్ళ గొంతు కోసాడు. ఇప్పుడు మనువుగారూ షివల్రీ చూపిస్తున్నారు. అంతే తేడా. భార్య ఒల్లో తల పెట్టుకుని హాయిగా బతకాలా? అదే భార్య కోర్టులో కేసులు పెట్టి, మగాణ్ణి కోర్టులు చుట్టూ తిప్పుతూ ఉంటే .. ఉద్యోగాలు పోయి, పిల్లలకు దూరమయ్యి, తలను ఉరితాడులో పెట్టి శాశ్వతంగా సేద తీరుతున్నారు నేడు మగవారు. భారత దేశములో ప్రతీ సంవత్సరం ముప్పై వేల పైచిలుకు పెల్లైన ఆడవారు ఆత్మ హత్య చేసుకుంటు ఉంటే, వారి రెట్టింపు సంఖ్యలో (అరవై వేల పై మాటే) మగవారు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. మగవాడు స్త్రీని గౌరవించాలి. . కానీ, తనను తాను గౌరవించుకోకుండా.. బతకాల్సిన ఖర్మ మాత్రం పట్టకూడదు. దేవతలు పూజలే అందుకుంటారే, స్నానాలే చేసుకుంటారో.. వారి ఇష్టం. మగవారు తమ బతుకు దుర్భరం కాకుండా చూసుకోగలిగితే అదే పదివేలు ఇప్పుడు.

      Delete
    3. శ్రీకాంత్ గారు, మీ ఆవేదన సహేతుకమయినది. ఈ మద్య సుప్రీం కోర్ట్ వారు సైతం కొంతమంది స్త్రీలు గ్రుహ హింస చట్టాన్ని, ఇతర చట్టాల్ని ఎంత అజ్ణానంగా దుర్వినియోగం చేస్తున్నారో గుర్తించారు. కాబట్టి బర్త తరపు బందువుల విషయంలో ఆచి, తూచి, అడుగెయ్యాలని ఇటు పోలిస్ లకు, అటు క్రింది కోర్టులకు మార్గ దర్శనం చేసారు. మీరు చెపుతున్న ఆత్మ హత్యల లెఖ్ఖలు నిజమా! ! అదారాలు ఏమీటో చెప్పగలరు.

      సమాజం అనేది ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు. ఇది తెలియబట్టే మన వారు యుగానికో(మన్వంతరం), మనువు ఉంటాడని చెప్పారు. మార్పు కావాలని కోరుకునే వారిలో నేను మొదటి వాడిని కావాలని నా అభిలాష. కాకపోతే అది మన సంస్క్రుతి నుంచి రావాలే తప్పా ఇతర సంస్క్రుతలను అనుసరించి లేక అనుకరించి మాత్రం కాదు.

      Delete
    4. క్షమించాలి. మీరు ఏకపక్ష వాదణలు చేస్తున్నారనుకుని కాస్త హార్ష్ గా రాశాను. ఆత్మ హత్యలకు సంబందించిన వివరాలను తప్పకుండా ఇస్తాను.

      Delete
  2. బాయ్ ఫ్రెండ్ పక్కన ఉండడం కూడా ఓ సంకేతం అనేది దారుణమైన వికృత ఆలోచన.

    మీరు చెప్పిన దాని ప్రకారం చూసినా స్త్రీకి పురుషుడు రక్షణ అనుకున్నా ఆ అమ్మాయి పక్కన ఉన్నది పురుషుడే.

    వాడు బాయ్ ఫ్రెండా , తమ్ముడా అని మదోన్మాదులు ఎలా చూస్తారండీ?

    వ్యవస్థ లక్షణాలను బట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి వ్యక్తి ఆలోచనలుంటాయి. స్త్రీయా, పురుషుడా అని కాదు మనసు - బుద్ధి అనేదానిని బట్టి సమస్య వస్తుంది. స్త్రీలు మాత్రమే కాదు నేడు పురుషులు సైతం స్వేచ్చగా సంచరించే స్తితి జీవించే స్థితి లేదు.

    అన్నింటా కెరీరిజం - డబ్బుకు మాత్రమే విలువ ఉన్నట్లు వ్య్వహరించడం , విలువలకు తిలోదకాలివ్వడం, వ్యక్తిత్వాన్ని నేర్పే పాఠాలు , కార్యక్రమాలు మచ్చుకైనా కనపడకపోవడం కారణం.

    బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే బాయ్ ఉన్నాడన్న సంగతి మరచిపోతున్నారు. కాకుంటే వ్య్వస్థలో ప్రస్తుత పరిస్తితులను బట్టి స్త్రీలు - అమ్మాయిలు జాగ్రత్తగా మసలుకోవాలి. గాంధీ చెప్పిన అసలు స్వాతంత్ర్యం కోసం పోరాడాలి. అదీ తండ్రి - కొడుకు - భర్త ఇలా ఏ మగాడి తోడు లేకుండానైనా స్త్రీ స్వేచ్చగా తిరగగలిగే రోజులకోసం.

    ReplyDelete
    Replies
    1. "బాయ్ ఫ్రెండ్ పక్కన ఉండడం కూడా ఓ సంకేతం అనేది దారుణమైన వికృత ఆలోచన."
      ఇది కేవలం నాకున్న ఆలోచన గా బావించడం దురద్రుష్టం. సగటు అదునిక మగవాడు అని చెప్పుకుంటున్న వారి మస్తత్వం ఇది. నేను కొన్ని పరిశిలనలు జరిపాకే ఒక అవగాహనకు రావడం జరుగుతుంది. కావాలంటే కొంత మంది "బాయి ఫ్రెంద్డ్స్" అనే వారి గుండె తలుపుల్ని తట్టి చూడండి. విక్రుత నిజాలు ఎన్ని భయట పడతాయో. ఈ సో కాల్డ్ "బాయి ఫ్రెండ్" బాగోతం తెలిసిన వారు వారి వెంట ఉన్న ఆడ పిల్లల్ని ఏ విదంగా అంచనా వేస్తారు? "అటువంటిది కాకపోతే ఇటువంటి వాడి వెంట ఎందుకు తిరుగుతుంది" అనుకుంటారు. ఇలాంటివి చాల కేసులు ఉన్నాయి. "తాటి చెట్టు క్రింద పాలు తగినా అది కల్లే" అనుకోవడం మానవ సహజం. ఇది ఆడ పిల్లలు గ్రహించడం ముఖ్యం.

      ఆదర్శవాదం మనమెలా ఉండాలో చెపుతుంది. వాస్తవ ద్రుష్టి మన మెలా ఉన్నామో చెపుతుతుంది. ఆదర్శం గురించి అడగండి. కాని వాస్తవాన్ని అనుసరించి బ్రతకండి అని పిల్లలకు చెప్పాల్సిన బాద్యత పెద్దల పైన ఎంతైనా ఉంది.

      మొదటి సారి మా బ్లాగును దర్శించినందుకు హ్రుదయ పూర్వక దన్యవాదములు.

      Delete
  3. మిథ్రులారా భారత సంస్కారం తెలుసుకొండి
    కామము శృంగరం దాంపత్యం మూడింటి మద్య భెదం
    తెలుసుకొండి
    ఆంగ్లం లొ అనింటిని sex అంటారు
    చివరకు మనము లింగము (gender) అనె పదానికి కూడా sex అనె అంటున్నాము

    ReplyDelete
    Replies
    1. హేమ గారు ఆ మూడింటి మద్య బేదములను గురించి వివరంగా తెలిపి ఉంటే బాగుండేది.

      Delete
  4. సూటిగా చెప్పాలంటే..

    1.కామము: కోరిక
    శరీర వాంఛ తీర్చుకోవాలనే కోరిక, ఇక్కడ మనసుల కలయికతో సంబంధం ఉండదు, ఏవరో ఒకరు ఉంటే చాలు.


    2.శృంగారం: 1+కళ
    కళాత్మకమైన కామం. తగ్గ జోడి, మనసుల కలయికవలన మాత్రమే కలిగేది.

    3.దాంపత్యం: 1+2+విలువలు

    మోదటి దాని మీద నియంత్రణ ఉంటూ అభిరుచికి తగ్గ అమ్మయిని వివాహమాడి, ప్రణయలోకం లో విహరించడమే దాంపత్యం.

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారు! ఇంతకీ "బాయి ఫ్రెండ్" "గర్ల్ ఫ్రెండ్" మద్య ఏది ఉంటుంది? ఒకటోదా? రెండోదా? మూడోదా?

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం