సిద్దరామయ్య గారికి విదేశీ పద్దతిలో ముద్దు పెట్టి స్వదేశీ పద్దతిలో సిగ్గుపడిన "గిరిజా శ్రీనివాస్ "!!
ఈ దేశ , సంస్కృతి సాంప్రదాయాల్ని,ఔనత్యాన్ని కాంగ్రెస్ పార్టీ లోని కొంతమంది పెద్దలు తమ బరితెగింపు చేష్టల ద్వారా నాశనం చేస్తున్నారో క్రింద ఇవ్వబడిన వీడియోల ద్వారా తెలుసుకోవచ్చు. స్త్రిలైనా పురుషులైనా తాము నివసించే సమాజం లోని కట్టుబాట్లను, సంస్కృతి సాంప్రదాయాలను పాటించాల్సిన అవసరం ఉంది . అదే పదిమందికి రోల్ మోడల్ గా ఉండాల్సిన రాజకీయనాయకులకు అయితే , కేవలం వాటిని పాటించడమే కాకుండా వాటిని పరిరక్షించాల్సిన అవసరం కూడా ఉంది. మన దేశం లో పిన్నలకు ఆశీర్వాదం ఇవ్వాలన్న , పెద్దల పట్ల అభిమానం తో కూడిన గౌరవం చూపాలన్న దానికి ఒక పద్దతి అంటూ ఉంది. విదేశ సంస్కృతి మాదిరి "ముద్దులు పెట్టె" అభిమాన ప్రదర్శన ఇండియాలో కుదరదు. అది చూసే వారికి ఎంతో ఎబ్బెట్టు కలిగిస్తుంది.
అయితే ఇండియాలో ఈ బహిరంగ ముద్దుల వ్యవహారం లో కాంగ్రెస్ పార్టీ వారికి విదేశీ సంస్కృతి వంటబట్టినట్లు ఉంది. అందుకే పోయిన ఎలెక్షన్ ప్రచార సందర్భంగా, మీరట్ అభ్యర్థిని అయిన , యాక్టర్ నగ్మాను , తాత వయసు ఉన్న గజరాజ్ శర్మ అనే MLA గారు బహిరంగంగా ముద్దు పెట్టి , "ఇది వాత్సల్యం తో పెట్టినది తప్పా , అన్యదా కాదు" అని అంటే మీడియా , ఫెమినిస్టులు నానా గగ్గోలు పెట్టారు. అప్కోర్స్ సాంప్రదాయవాదులు ఇంక్లూడింగ్ మీ ఆ చర్యను ఖండించారు అనుకొండి . అయితే ఇక్కడ విషయం ఏమిటంటే , తాత వయసు ఉన్నవాడు అయినా సరే , ఒక స్త్రీ పట్ల అభిమానం లేక వాత్సల్యం చూపించాల్సిన పద్దతి ఇది కాదు అని ఎలుగెత్తి చాటిన వారు , నిన్న కర్ణాటకలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని , వేలాది మంది సాక్షిగా ఒక మహిళా కార్యకర్త ఆయన బుగ్గ మీద ముద్దు పెట్టి , ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వెళితే చాలా కామన్ గా ఫీల్ అయినట్లు ఉంది. ఆమె ముద్దు పెట్టినప్పుడు చూసే వాళ్ళ మైండ్ లు బ్లాంక్ అయ్యాయి కానీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు మాత్రం చిరునవ్వులు చిందించారు. అసలు జరిగినది ఏమిటంటే ,
కర్ణాటకకు చెందిన కురుబ సంఘం వారు కొత్తగా స్థానిక సంస్థలకు ఎన్నికైన తమ కుల నాయకులను సన్మానించే సందర్భంగా ఒక బ్రహ్మాండమైన సభను పెట్టి దానికి ముఖ్యమంత్రిగారైన సిద్ద రామయ్య గారిని ఆహ్వానించారు. ఆసభ చివరలో ఆయనతో ఫొటోలు దిగడానికి అని వేదిక మీద నిలబడిన వారిలో "గిరిజా శ్రీనివాస్ " అనే మహిళా నాయకురాలు కూడా ఉందట. ఆమె ముఖ్యమంత్రి గారి పక్కనే నిలబడి ఉంది. ఫొటో తీయడం కాగానే , వెంటనే ముఖ్యమంత్రి గారి తలను తనవైపు లాకొని , ఆయన బుగ్గ మీద చుట్టుకున్న ముద్దు ఒకటి పెట్టి , సిగ్గుపడుతూ , ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. దానితో ముఖ్యమంత్రిగారు ఇబ్బంది కరమైన నవ్వులు నవ్వారని మీడియా వారు అంటున్నారు. ఆ తర్వాత ఆమెను "ఇదేమిటమ్మా ఇలా చేసావు? అంటే "ఆ.. ఆయన నాకు తండ్రి లాంటి వారు , ముద్దు పెట్టుకుంటే తప్పా " అని అమాయకంగా అడిగిందట.
మరి గజ రాజ్ కూడా ఇలాంటి వివరణ ఇస్తే "అబ్బే ఆయన బాడీ లాంగ్వేజ్ అలా లేదు " అన్నారు. మరి అదే బాడీ లాంగ్వేజ్ ను అబ్సర్వ్ చేస్తే "గిరిజా శ్రీనివాస్ " ది కూడా ఆమె వివరణను సపోర్ట్ చేసేదిగా లేదూ అని చెప్పాల్సి వస్తుంది. తండ్రై లాంటి వాడిని ముద్దు పెట్టుకున్నాక సిగ్గుపడడం ఎందుకు? ముసి ముసి నవ్వులు నవ్వడం ఎందుకు? ఏదో బావగారికి ముద్దు ఇచ్చినట్లు !అయినా ఆయన పట్ల తన గాఢ అభిమానం చూపించాలి అనుకుంటే పెద్ద ఆయన కు పాదాభివందనం చేస్తే ఎంత సంస్కారవంతంగా, సాంప్రదాయపరంగా ఉండేది? ఇలా విదేశీ పద్దతిలో ముద్దులు ఇచ్చి , స్వదేశీ పద్దతిలో సిగ్గుపడితే దానిని ఏమంటారో పెద్దలు చెప్పాలి.
మరి చివరగా ఒక ప్రశ్న . నగ్మా గారికి గజరాజ్ పెట్టిన ముద్దు "మిస్ బిహేవ్ "అయినప్పుడు , సిద్దరామయ్య గారికి గిరిజా పెట్టిన ముద్దు ఏమవుతుంది? ఇది కూడా మై చాయిస్ సంస్కృతిలో భాగమే కాబోలు. ఇక సిద్దరామయ్య గారికి ఇచ్చిన ముద్దు, నగ్మాగారికి పెట్టిన ముద్దు గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి క్రింది వీడియోలను చూడండి.
Source: https://youtu.be/bAZoigxtBbg
Source: https://youtu.be/N56ioQjXD-w
Comments
Post a Comment