"అనుమానం " అనే పెను బూతాన్ని అంతం చేయక పొతే , అది కుటుంబాలని ఎలా అంతం చేస్తుందో చూడండి !

                                                       


                                    ఎయిడ్స్ , కాన్సర్ , బి.పి. , షుగర్ , ఇత్యాది వాటిని వ్యాదులుగా గుర్తించిన ప్రభుత్వాలు , వాటి నివారణ కోసం హాస్పిటల్స్ ని నెలకొల్పి ప్రజల్ని వాటి బారి నుండి కాపాడ డానికి బారి ఖర్చును చేస్తుంది . చాలా సంతోషం . కాని విటికంటే  భయంకరమైన వ్యాది ఒకటి మన సమాజంలో కుటుంబాలు కుటుంబాలనే అంతం చేస్తుంటే , దాని గురించి ప్రభుత్వాలు పట్టించుకోవటం మాట అటుంచి  అసలు దానిని "వ్యాది " గానే గుర్తించక పోవడం చాలా దురదృష్ట కరం . ఆ వ్యాది పేరే "అనుమానం ".

                 పైన చెప్పిన వ్యాదులలో ఎయిడ్స్ తప్పా మిగతావి వ్యక్తులకి మాత్రమె ప్రమాద కరమైనవి . ఎయిడ్స్ వలన కుటుంబం కి ప్రమాదం ఉన్నప్పటికీ , అది శాంతి బద్రతల సమస్యలు సృష్టించదు . కాని అనుమానం వ్యాది అలా కాదు . అది వ్యక్తులని నేరస్తులుగా మార్చి చివరకు కుటుంబాలనే సమూలంగా నాశనం చేస్తుంది . దానికి ఉదాహరణే  పైన చూపిన రెండు కేసులు . ఈ  రోజు దిన పత్రికలో ప్రచురితమైన ఆ  రెండు కేసులలోని విషయాలు క్లుప్తంగా ఇవి :

  తూర్పు గోదావరి జిల్లా , గోకవరం మండలం లోని గుమ్మళ్ళ దొడ్డి గ్రామం లో నివసించే శ్రీను, సుబ్బ  లక్ష్మి లు 8 ఏండ్ల క్రితం ప్రేమించి  చేసుకున్నారు . వారి ప్రేమకు గుర్తుగా 6 ఏండ్ల పాప  కూడా ఉంది . కాని కొన్నాళ నుంచి శ్రీనుకు  బార్య  మిద అనుమానం కలిగి చివరకు అది పెను  భూతంగా మారేసరికి వారి మద్య     మనస్పర్ధలు  ఏర్పడి సుబ్బ  లక్ష్మి పాపను    తీసుకుని పుట్టింటికి వెళ్ళింది . అయినా  సరే  అనుమాన భూతం ఆవహించిన శ్రీను ఆమెను కదతెర్చడానికి   నిర్ణయించుకుని  , కూరాగాయలు కొనుగోలు చేసి వస్తున్న సమయం లో ఆమె పై యాసిడ్ దాడి చేసి మరి చంపాడు . దానితో   స్తానికులు అతనిని స్తంబానికి కట్టి , మెత్తగా తన్ని పోలీసులకు అప్ప చెపితే , ప్రస్తుతం జైలులో ఉన్నాడతను . వారి 6  ఏండ్ల పాప తల్లి తండ్రులు కు దూరమయింది .

  ఇక   రెండవ  కేసు అయితే మరి దారుణం . ఒంగోలు లో నివసిస్తున్న వెంకటేశ్వరులు అనే ఆతను , బార్య మిద అనుమానంతో తన ఇద్దరి  కొడుకులను నీళ్ళ ద్రమ్ముల్లొ ముంచి ఘోరంగా హత్య చేసాడు . బార్యకు నూడిల్స్ లో విషం కలిపి ఇ స్తే , ఆమె మగతలోకి వెళ్లి పోగా ఆమె చనిపోయిన్దనుకుని , తానూ కూడా లారి క్రింద పడి ఆత్మ హత్య చేసుకో పోయాడు . కాని చివరకు గాయాల పాలై ఒంగోలు ఆస్పత్రి లో చేరాడు . అ విదంగా కొడుకులిద్దరూ ని కోల్పోయి బార్యా బర్తలు బ్రతికినా , భర్త జైలు పాలవక తప్పదు .

    పై ఉదంతాలు లో భర్తలు  నేరస్తులు మారడానికి కారణం ఎవరు ? అనుమానం అనే జబ్బు మాత్రమె  . సాదారణ హంతకులును  , అనుమానం తో అమానుషాలు చేసే వారిని  ఒకే గాటన కట్టి , నేర విచారణ చేస్తే   దాని కంటే అవగాహనా రాహిత్యం  మరొకటి ఉండదు . అనుమాన పిడితులను తోలి దశలోనే పసి గట్టి , వెంటనే సరి అయిన  ఫ్యామిలి కౌన్సలింగ్ తో పాటు మెడికల్  ట్రీట్ మెంట్ ఇస్తే , ఎన్నో కుటుంబాలను ఆ  పెను భూతం నుండి కాపాడే వీలు ఉంటుంది . దీనికి కావలసింది ముందు అనుమానం అనే దానిని ఒక వ్యాది గా ప్రబుత్వాలు గుర్తించి , వాటి నివారణ కోసం ఆసుపత్రులలో ప్రత్యెక విభాగాలు ఏర్పాటు చేయాలి . అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో నడచే ప్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లను వాటితో సమన్వయ  పరచి , బాదితులకు సరి అయిన సమయం లో తగిన చికిత్స అందేలా చేస్తే ,అనేక  కుటుంబాలను రక్షించే వీలు  ఉంటుంది అని నా అభిప్రాయం .
                                          (Republished Post. OPD:22/6/2014)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం