నకిలీ అకౌంట్ ల పేస్బుక్ బాయ్ ప్రెండ్ కల్ల బొల్లి మాటలకు, బంగారం, డబ్బు, సర్వం సమర్పించుకున్న 14 యేండ్ల గర్ల్ ప్రెండ్!

                                                           
                                              పేస్ బుక్ పరిచయాల మోజులో పడి ఆడపిల్లలు ముఖ్యంగా టినేజ్ పిల్లలు ఎలా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారో ఈ  ఉదంతం ద్వారా తెలుస్తుంది. "కన్యా వరయతే రూపం " అని ప్రతి ఆడపిల్లా తనకు కాబోయే వాడి అంద చందాలకే తోలి ప్రాదాన్యం ఇస్తుంది అనేది సత్యం. ఆడపిల్లల యొక్క ఈ వీక్నెస్ ను ఆదారంగా చేసుకుని , కొంతమంది మోసగాళ్ళు తమ అందంతో పాటు లేని డబ్బూ దర్పం ఉందని నమిస్తో వారిని మోసం చేస్తున్నారు. దీనికి పేస్బుక్ లాంటి సామాజిక సైట్లు బాగా ఉపయోగపడుతున్నాయి.

 ఉత్తర ప్రదేశ్ కు చెందిన మిస్బః అయూబ్ అలీఖాన్ 18 యేండ్ల యువకుడు. ఇతను ఒక కాలేజిలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తూ ,గత కొద్ది నెలలుగా కాలేజికి వెళ్ళడం మాని వేసాడు.కురాడు చూడటానికి ఏర్ర్రగా బుర్రగా బాగుంటాడు. అందుకే ఖాన్ కి ఆడపిల్లల్ని పటాయించి పబ్బం గడుపుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. వెంటనే పేస్ బుక్ లో రెండు ఖాతాలను తెరచాడు . ఒకటి ఆడపిల్ల పేరుతో, మరొకటి మగపిల్లాడి పేరుతో . ఆడపిల్ల పేరు శైలి పరేకా , మగ పిల్లాడి పేరు అర్మాన్ కపూర్. అర్మాన్కాపూర్ అకౌంట్ లో తన పొటొయే పెట్టాడు. అమ్మాయి ఖాతాలో ఎవరిదో పెట్టాడు. ఈ  రెండు ఖాతాల మద్య బోల్డంతా పరిచయం ఉన్నట్లు మెస్సేజులు,ఒక దాని నుంది మరొక దానికి , రెండింటికి తానే పంపుతూ,ఆ రెండు ఖాతాదారుల మద్య ప్రేమానుబందం ఉన్నట్లు , శైలీ పరికా ఖాతా తో add అయిన ఆడపిల్లల ను నమ్మించాడు. ఆ తర్వాత కొన్ని నాళ్ళకు, తనకు అర్మార్ కపూర్కు సరిపడటం లేదని కాబట్టి అతనితో తెగతెంపులు చేసుకుంటున్నాను అని చెపుతూ ఎవరికైనా ఇంటరెస్ట్ ఉంటే అతనికి గార్ల్ ప్రెండ్ అయినా తనకు అబ్యంతరం లేదని శైలీ పరికా లాగా చెప్పాడు. ఎందుకంటే, అతనితో గార్ల్ ప్రెండ్ గా ఉండకపోయినా సాదారణ స్నేహితులు లాగ ఉండటానికి అతనిలోని మంచి తనమే కారణ మని తనకు తానే తన నకిలీ పాత్ర ద్వారా పేస్బుక్లో చెప్పి , ఆడపిల్ల ల ద్రుష్టిలో అర్మాన్కాపూర్ అకౌంట్ కి ఒక ఇమేజ్ క్రియేట్ చేసాడు. .

  అది చూసిన కొంత మంది పిచ్చి ముఖాలు అతను ను చూడటానికి చాలా బాగున్నాడు కాబట్టి , అతనితో ప్రెండ్ షిప్ కి ఆసక్తి చూపుతున్నట్లు శైలి పరికా అకౌంట్ కి మెసేజ్ లు ఇచ్చారు. దానితో ఖాన్ కుర్రాడికి రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు అయింది. వెంటనే అలా మెసేజ్ లు పంపిన 14 యేండ్ల అమ్మాయి (పోలిస్ వారు పేరు బహిర్గత పరచ లేదు ) కి అర్మాన్ కపూర్ ఆక్కొంట్ తో ప్రెండ్ రిక్వెస్ట్ పెడితే , దానికి ఆ' దీవానా 14' మనం పెట్టిన పేరు) అసెప్ట్ చేసిందట! ఇంకేముంది , ఇక రోజూ  చాటింగ్లే చాటింగులు. అలా చాటింగ్ ల సందర్బం లో తను కనిపించడానికి కురాడు లాగున్న , తనొక పెద్ద బిసినెస్ మాన్ అని, తనకు ఇండియాలో ఇతర దేశాలలో కోట్ల కొద్దీ ప్రాపర్టీ ఉందని చెపితే , దీవానా 14 అతని మాటలు నమ్మి, అతనితో ప్రేమాయణం నడపటానికి సాయి అందట! త్వరలోనే వారు పెండ్లి చేసుకోవటానికి కూడా  నిర్ణయించుకున్నారట!.

  ఇక ఈ  తాడు బొంగరం లేని ఖాన్ 18 , దీవానా 14 నుంచి కొంత సొమ్ము కాజెయ్యడమెలా అనే బుద్ది  పుట్టి ,ఒక ప్లాన్ ఆలోచించి, వెంటనే అది అమలులో పెట్టాడు. తను ఈ  మద్య ఒక ప్లాట్ కొన్నాను అని , దాని విలువ 2 కోట్లు అని , తమ పెండ్లి అయ్యాక ఆ ప్లాట్ లో ఒక విల్లా కట్టి సుఖంగా సంసారం చెద్దామనేదే తన ఆశయం అని చెప్పాడు. అయితే తన దగ్గర ప్రస్తుతం 1 కోటి 70 లక్షలు మత్రమే ఉందని, వేరే ప్రాజెక్టుల్లో పెట్టిన పెట్టుబడులు సకాలం లో రిలీజ్ కాకపోవడం వలన మిగతా 30 లక్షలు గురించి ఇబ్బంది అవుతుందని బొంకడమే కాక , ముఖం కొంత విచారం గా పెట్టాడు. దానితో దీవానా 14 కి సినిమా హీరోయిన్ల త్యాగ గుణం గుర్తుకు వచ్చి, తన వంతు సాయం తానూ చేస్తాను అని అందట. వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లి బంగారం 19 తులాలు దొంగిలించి , అదీ మరి ఇంకా కొంత డబ్బు కలిపి మొత్తం   పది లక్షల రూపాయాలు తెల్లారే ఖాన్ 18 కి ముట్ట చెప్పిందట. ఆ డబ్బు భంగారం తీసుకుని , "దాంక్స్" చెప్పిన వెళ్ళిన కాన్ 18 ఆ తర్వాత అమ్మాయి కంటికి కనపడితే ఒట్టు. ఆ తర్వాత అనేక చోట్ల వెదికినా పలితం దక్కలేదు. పేస్బుక్ లో ఈ  అమ్మాయిని ఉన్ ప్రెండ్ ని చేసేశాడు. దీని తో మటను మోసా పోయాను అని తెలుసుకున్న ఈ  బొంబాయి చివరకు తల్లి తండ్రులకు తానూ మోసపోయిన విషయం అంతా చెప్పేసరికి వారు స్టన్నయి పోయారట, తమ పిల్ల ఇంత తెలివి సంపాదించిందా పేస్బుక్ పరిచయం  తో అని!

      వెంటనే తల్లితండ్రులు ముంబాయి పోలీసు ల వద్ద కేసు పెడితే వారు చీటింగ్ క్రింద కేసు బుక్ చేసి విచారణ చేపట్టారు. దానిలో బాగం ఉత్తర ప్రదేశ్ లోని ఖాన్ 18 ఉంటున్నా అతని టాటా గారి నివాసానికి వెళితే అతను గత
కొద్ది నెలలుగా ఇంటికి రావటం లేదని తెలిసింది. చివరకు ఇన్వెస్టిగషన్ ఆపిసర్ తెలివిగా ఒక పడకం రచించి దానిని అమలు చేసి ఖాన్ 18 ని పట్టుకుని రేమాండ్ కు పంపారు . అయన చేసినదేమిటంటే , పేస్బుక్ లో ఒక అమ్మాయి పేరుతో నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి, దాని ద్వారా , తమ లేడి కానిస్టేబుల్ ద్వారా ఖాన్ 18 తో పరిచయం పెంచుకుంటే , దీవానా 14 కి చెప్పిన కదయే ఆ లేడీ కానిస్టేబుల్ కి చెప్పాడట. దానితో సరే డబ్బు ఇస్తాను రా  అని అతన్ని ఒక చోటుకి పిలిచి , అక్కడకు వచ్చిన ఖాన్ 18 ని వల వేసి పట్టారు పోలిసులు. అదీ కద! ఇదీ పొలిసు వారు, వారి  రికార్డు ప్రకారం చెపుతున్న కద అయినప్పటికి నాకు ఉన్న అనుమానం ఏమిటంటే , దీవానా 14 ని వారి ఇంట్లో డబ్బు బంగారం తెస్తే వాటితో తాము లేచి పోయి పెండ్లి చేసుకోవచ్చు అని ప్లాన్ చేసి, తీరా అవి చేతికి అంది అన్నీ మోజులు తీరాక అమాయిని వదలి డబ్బూ , బంగారంతో పరారు అయి ఉంటాడు అనిపిస్తుంది. ఏది ఏమైనా , ఉన్నదీ పోయే , ఉంచుకున్నదీ పోయే అన్నట్లయింది దీవానా 14 పరిస్తితి !

            కాబట్టి ఇటువంటి ఉదంతాలు విని అయినా ఆడపిల్లలు ఎర్రి మొర్రి ఆకర్షణలకు లోను కాకుండా , ఒక క్రమశిక్షణతో మెలిగితే మంచిది. సాద్యమైనంత వరకు పేస్బుక్లు జోలిక్ వెళ్ళకుండా ఉంటేనే మంచిది. తల్లి తండ్రులు కూడా  తమ పిల్లలు ఏమి చేస్తున్నారో నిరంతంరం గమనిసూ ఉంటే పిల్లలు ఇటువంటి పిచ్చి పనులు చేసే అవకాశం ఉండదు. 14 యేండ్లకే ప్రేమలు, చాటింగ్ లు , దొంగతనాలు చేసి ప్రియులకు డబ్బు ఇవ్వడాలు ఇవ్వన్నీ చూస్తుంటే జ్ఞానం లేని ఆడపిల్లలకు స్వేచ్చ ఇస్తే అది దుర్వినీయోగమే అవుతుంది అనిపిస్తుంది. అలాగే 18 యేండ్లకే మోసాలు చేసి లక్షలు కాజేసే ఆలోచన చేసాడు అంటే , అతను  కచ్చితంగా అదుపు ఆజ్ణలో పెరిగిన వాడు కాదని అర్దం అవుతుంది. ఇలా యువత విపరీతంగా చెడి పోవటానికి అవకాశం ఇస్తున్న పేస్ బుక్ ను చైనా దేశం లో బాన్ చేసిన విదంగా మన దేశం లోను చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

                           (Republished Post OPD:13/12/2013)

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

మనల్ని ఆపదల నుండి కాపాడే నరసింహ మంత్రం