బార్యను "రేప్" చేసిన వారు భర్త మరియు అతని బందువులట!




                                                               

  భారత రాజధాని "డిల్లీ" నిర్భయ ఉదంతానికే కాదు, మరెన్నో నిక్రుష్టపు పనులకు చరిత్రగా మిగిలిపోబుతుందా! అనిపిస్తుంది ఈ ఉదంతం వింటే.

  అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్నారట! అమ్మాయి తల్లి తండ్రుల ఇష్టం లేకుండా మొన్ననే పెండ్లి కూడ చేసుకున్నారట. అ తర్వాత ఆ పెండ్లిని రిజిస్టర్ చేయించుకుందామని చెప్పి, నూతన దంపతులు, వారితో పాటి అబ్బాయి ఇద్దరు బందువులు కుర్రాళ్లు కారులో బయలు దేరారట. కారులో ప్రయానిస్తున్న బార్యకు(?), భర్త మత్తు మందు కలిపిన  కూల్ డ్రింక్ ఇచ్చాడట. ఆమే దానిని తాగి మత్తులోకి వెళ్ళిపోయిందట.వారు ముగ్గురు ఆమెను "రేప్" చేసి "నజఫ్గడ్" లో రోడ్డు ప్రక్కన పడేసి వెళ్ళి పోయారట.స్ప్రుహలో లేని ఆమెను గుర్తించి పోలిసులకు సమాచారం అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఇచ్చిన పిర్యాదు మేరకు  పోలిసులు ఆమే భర్త ఇంద్రజీత్ మీద,అతని బందువులమీద కేసు నమోదు చేసి వారిని అరెశ్ట్ చెయ్యడం జరిగింది. ఇది తాజా సమాచారం.

   పై కేసులో నాకొక అనుమానం ఏమిటంటే, ఇంద్రజీత్ అనే వాడు నిజంగా అమేను మస్పూర్తిఘా పెండ్లి చేసుకున్నాడా?తల్లితంద్రులని కాదని, దిక్కు మొక్కు లేని దానిలాగ ఎవరిని పడితే వారిని నమ్మి ప్రేమించి పెండ్లి చేసుకునే అమ్మాయిలకు ఈ ఉదంతం ఏమన్నా కనువిప్పు కలిగిస్తుందా? ఈ విషయంలో ఆ ముగ్గురు మ్రుగాళ్ళు చెరిచింది కేవలం ఒక అమ్మాయిని అనడం తప్పు. వాళ్ళు మొత్తం వివాహ వ్యవస్తనే చెరిచారు. కాబట్టి వారికి మరణమే సరైన శిక్ష.

    ఒక ఆడపిల్లని నాశనం చేస్తే, నేరస్తుల మీద చర్యలు తీసుకునే హక్కు,అమ్మాయి కుటుంబ సబ్యులకు ఉండాలి. కేవలం ప్రాసిక్యుషన్ కు సహాయం చెయ్యడమే కాకుండా తమకు నమ్మక మున్న  ప్రైవేట్ విచారణ సంస్తలతో, విచారణ చేయించే హక్కును కలిగి ఉండాలి.సమాజంలో నేరాల్ని అరికట్టడానికి,నిక్ష్పాక్షికమయిన దర్యాప్తు అవసరం. దీనికి సమర్దులఈన వ్యక్తులు అవసరం.దీని కోసం  కేవలం పోలిసుల మీదే ఆదారపడకుండా,సమర్దులైన వారికి  లైసెన్సులు ఇస్తే  ప్రైవేట్ దర్యాప్తు సంస్తలు సహితం నేరకట్టడిలో దోహదపడగలవు. ఇవి పోలిస్ వారితో కలిసి పని చేసేలా చేస్తే, పోలిస్ దర్యాప్తుల పట్ల అపోహలు తొలిగే అవకాశం ఉంటుంది. అంతే కాకుండ బాదితుల కుటుంబ సబ్యులు సహితం అటు దర్యాప్తులో, ఇటు ప్రాసిక్యుషన్లొ,కేసు మొదలుపెట్టిన దగ్గర్నుంచి ముగిసే వరకు పర్యవేక్సించే అవకాశం ఉంటుంది.ఇది నేర కట్టడికి బాగ దోహదపడగలదు.

   ,ఇంతకుముందు మన రాష్ట్రంలో జరిగిన "ఆయేషా" కేసులొ జరిగిన పోలిస్ దర్యాప్తు రాష్ట్ర పోలిస్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలి పోతుంది. ఆ కేసులో ఆయేషా కుటుంబ సబ్యులు పోలిస్ వారి దర్యాప్తును తీవ్రంగా తప్పు పట్టడమే కాక అసలు నిందితుడు సత్యం నిర్దోషి అని చెప్పడం  జరిగింది. ఇదంతా జరగడానికి కారణం, కుటుంభ సబ్యులు కూడ తమకు నమ్మక్కమున్న దర్యాప్తు సంస్తతో దర్యాప్తు చేయించుకునే అవకాశం ఉంటే అపవాదులు అపోహలు ఉండవుకదా!

  వ్యక్తి కుటుంబం లోబాగం. ఒక వ్యక్తికి ప్రాణభంగం లేక మాన భంగం జరిగితే అది సంబందిత కుటుంభం నకు జరిగినట్లే. రాజ్యం దండించే అధికారాన్ని కలిగియున్నప్పటికి, అది కుటుంబ హక్కును నిరాకరించజాలదు.చట్ట ప్రకారం నిందితులను శిక్షించేలా చేసే హక్కు కుటుంబానికి ఉంటుంది. ఒక వేళా ఎవరైనా ఇతరులు తమ కుటుంబ వ్యక్తుల మాన ప్రాణాలు హరింప చేస్తుంటే, వారిని కాపాడుకోవటానికి నేరస్తుల ప్రాణాలు తీసే హక్కు ప్రతి కుటుంబ సభ్యుడికి ఉంటుంది.   ప్రబుత్వ  దర్యాప్తు సంస్తల మీద అనుమానముంటే , తమకు నమ్మకమున్న దర్యాప్తు సంస్తల ద్వార దర్యాప్తు చేయించుకునే హక్కు కుటుంబాలకు ఉండేలా చట్ట సవరణలూ రావాలి.ఇది పోలిస్ వారి దర్ర్యాప్తుకు అదనంగా ఉండొచ్చు.కొన్ని "గ్రుహ హింస" కేసుల్లో కూడ, అత్తవారింటిలో ప్రాణాలు కోల్పోయిన కోడళ్లు విషయంలో," ఏదో విదంగా పోలిస్ వారిని మేనేజ్ చేసి కేసు నుండి బయటపడొచ్చు, కోడలి ఇంటి తరపు వారు నుండి తమకు ఆపద ఉండకుండా చూస్తే చాలు" అని  అత్తింటి వారు  బావిస్తుంటారు.ఇటువంటి కేసుల్లో కూడ కుటుంబ దర్యాప్తు హక్కు, ఒక నియంత్రణల పని చేసి, ఆడపిల్లల ప్రాణాలతో చెలగాటమాడకుడ అత్తింటి వారు హద్దుల్లో ఉండేలా చేస్తుంది. కుటుంబ సబ్యుల కేసును పరిష్కరింపచేసి, దోషులకు శిక్ష పడేలా చెయ్యటమే వారికి కుటుంబమిచ్చే  నిజమయిన నివాళి. 

  మొన్న జరిగిన "నిర్బయ" కేసులో కూడ కొన్ని అనుమానాలు వస్తున్నాయి.నిందితుల స్వచ్చంద లొంగుబాటు, ఆ పై  ఇద్దరు నిందితుల "ఎలిబి" ప్రకటన  ఇందుకు దోహడ పడుతున్నాయి. కేసు కోర్టు పరిదిలో ఉన్నందున దాని గురించి చర్చించ రాదు కాబట్టి, ఏమి జరుగుతుందో చూద్దాం. ఇవన్నీ , ప్రైవేట్  దర్యాప్తు సంస్తల అవసరాన్ని నొక్కి చెపుతున్నాయి.          

                                              (Republished Post. 12/4/2013.)

Comments

  1. https://saviourwords.blogspot.in/2016/06/blog-post_20.html?showComment=1466492420233#c4966031903844246304 పై లింక్ ని ఒకసారి చుడండి వారి అజ్ఞానం ఎలా చ్పిస్తున్నారో

    ReplyDelete
    Replies
    1. CV గారు మీ కామెంట్ ఈ పోస్టుకి సంబంధించింది కాదు.ఇంతకు ముందు ప్రచురించిన పోస్టు కి సంబందించినది అయి ఉండవచ్చు అనే ఉద్దేశ్యం తో ఆ పోస్ట్ కామెంట్ బాక్స్ లో కాపీ చేసి పెట్టాను.చూడగలరు.

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం