Posts

Showing posts from October, 2013

బార్యని వేదిస్తున్నాడని కేసు పెడితే, కేసు పెట్టిన పోలిసులు ని వేదించాడట!

                                                              అయన ఒక పోలిస్ కానిస్టేబుల్ . ఖమ్మం జిల్లా ,అశ్వాపురం  పోలిస్ స్టేషన్ లో ఉద్యోగం. మగాడు అంటే మగాడే ! అతనికి  పురుష ఆదిపత్య సమాజం ద్వారా సంప్రాప్తించిన అహంకారం ఉంది. దానికి తోడు ప్రజల మీద జులుం చేసే అదికారం ఉందనుకుంటున్న పోలిస్ ఉద్యోగమూ ఉంది. అందుకే ఒఆ అతనికి పెళ్లాం అంటే కొంత చిన్న చూపు ఉందేమో ఆమెను వేదించటం మొదలు పెట్టాడు . నేరస్తులును చూసినట్లే ఆమెను చూసి ఉంటాడు, అందుకే ఆమె ఆ వేదింపులు తాళలేక భర్త మీద కేసు పెట్టింది. "ఓఆ  సో స్, ఎంత దైర్యం ! అసలే పోలీసుని ,అందులో తాళి కట్టిన మొగుణ్ణి నామీదే కేసు పెడతావా అని కారాలు మిరియాలు నూరాడట. అయిన నేను పోలిసునే కదా నన్నెవరు అరెస్ట్ చేస్తారులే అనుకున్నట్లుంది పాపం.  కానీ ఖమ్మం జిల్లా S.P  గారు అయిన ఆవుల రంగనాద్ గారు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరుంది. కాబట్టి క్రింది స్తాయి అధికారులు కూడా జాగర్తగనే ఉంటున్నారు. దానీ వలన సదరు పోలిస్ కానిస్టేబుల్ గారి మీద అశ్వాపురం సి. ఐ గారు కేసు నమోదు చేసారు.    ఒక సారి కేసు నమోదు చేసి , కంప్లెంట్ లో ఉన్న విషయం నిజమేనని నిరూపించే ఆదారాలు దొర

కనీసం" ఎర్రబస్సులో " ఉన్న రక్షణ అవకాశం కోటి రూపాయల "వోల్వో బస్సులో " లేదన్న మాట !

                                                                    ఈ  రోజు  ఉదయం లేవగానే ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది. బెంగుళూర్ నుండి హైదరాబాద్ వస్తున్న "జబ్బార్ ట్రావెల్స్ ' కి చెందిన వోల్వో బస్ మహబూబ్ నగర్ జిల్లా , పాలెం అనే గ్రామం వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం వాళ్ళ, కల్వర్ట్ కు గుద్దుకుని 45 మంది సజీవ దహనమయ్యారని  తెలిసి మనసు అంతా బాదతో నిండి పోయింది .    అది కోటి రూపాయలు ఖరీదు చేసే వోల్వో బస్ అంటా .ఎ.సి. బస్ పూర్తిగా మూసి వేయబడి  ఒక్క డ్రైవర్ వద్ద డోర్ మాత్రమే ఉంటుంది. సాదారణ బస్సుల్లో మాదిరి మాన్యువల్   ఏమర్జెన్సీ డోర్ లు లాంటివి ఏమి ఉండవు అనుకుంటా . ఏందుకంటే రవణా శాఖ వారి ద్రుష్టిలోకోటి రూపాయల ఎ.సి. బస్సులకు ప్రమాదాలూ  జరుగవు అనుకుంటా! అందుకే దానికి కూడా  "అత్యవసర ద్వారం " ఉండాలి అనే నిబందన పెట్టడం మర్చి పోయి ఉంటారు. ఇక పోతే బస్ సీటింగ్ పరిమితి, 44 మాత్రమే. కానీ కడపటి వార్తలు అందే సమయానికి సజీవదహనమయిన వారే 45 మంది. డ్రైవర్ , క్లీనర్ తో కలిపి మొత్తం ఏడుగురు డ్రైవర్ సీటు దగ్గర ఉన్నసీట్  డోర్ ద్వారా బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారట. మెయిన్ డోర్ ఏమో ఆట

తమిళనాడులో కుష్బూ ! తెలంగాణాలో సోనియా ! ఇద్దరూ దేవతలే!

                                                               దేవత అంటే ఎవరు? ఈ   ప్రశ్న  కు బదులివ్వండి అని అని తెలంగాణా కాంగ్రెస్ వారిని అడిగితె  తడుముకోకుండా  ఠక్కున చెప్పే సమాధానం "సోనియా గాందీ ". ఎందుకంటే వారికి రాజకీయ పునర్జన్మ ఇచ్చింది ఆమె అని వారి ప్రగాడ విశ్వాసం మరి!. అయిదు కోట్ల మంది అరుపులను ఆఫ్ట్రాల్  అని తన జన్మ దిన కానుకగా ప్రకటించిన "తెలంగాణా" రాష్ట్ర ఏర్పాటుకు ఆమె పార్టీ కట్టుబడి ఉండేలా చేసినందుకు ఆమె కు తెలంగాణా కాంగ్రెస్ వారు జీవితాంతం చాకిరి చేసినా వారి రుణం  తీరదు కాక తీరదు . కాబట్టే వారు ఆమెకు తమ గుండెల్లో గుడి కట్టారు. ఆ అభిమానాని వారు బహిరంగంగా ప్రదర్శించారు కూడా !.  తెలంగాణా లో కె,సి,ఆర్  గారు తెలంగాణా తల్లి ఆకృతిని ఆవిష్కరించి , ఆమే తమ దేవత అని ప్రకటించారు . కానీ తెలంగాణా కాంగ్రెస్ వారు మాత్రం తమ దేవత "సోనియా గాందీ" గారే అని తేల్చేసారు . తెలంగాణా ను ఇచ్చింది సోనియా గాందీ గారే కాబట్టి ఆమె  గారే "తెలంగాణా  దేవత" కావాలని వారి ద్రుడాభిప్రాయం. రేపు ఒక వేళ తెలంగాణా లో కాంగ్రెస్ వారు ,అధికారం లోకి వస్తే "తెలంగాణా

ఉప్పెనతో ఊళ్లు కొట్టుకుపోతుంటే,'ఉత్సవ సభకు 'రమ్మంటునాడు 'ఉత్త'రాకుమారుడు !.

                                                          ఈ   రోజు  టి.వి. చానళ్ళు చూసారా , 'ఊరిదంతా ఒక దారి అయితే ,ఉలిపికట్టెది ఇంకో దారీ' అన్నట్లు ఉంది ,ఒక చానల్ వారు చెసే ప్రసారాలు చూస్తుంటే . అన్ని చానల్లోను సింహబాగం ,గత మూడు రోజులుగా రాష్ట్రాన్ని ముంచెతుతున్న వర్షాలు, వాటి వలన ప్రజలకు కలుగుతున్న కష్ట నష్టాలు గురించి ప్రసారం చేస్తుంటే , ఒకే ఒక చానల్ మాత్రం హైదరాబాద్లో జరుగబోతున్న "సమైఖ్య శంఖారావం " సభ గురించి ప్రసారాలు చేస్తుంది.            "ఉప్పెనలా కదలి రండి"            "ఊరువాడాఏకమై రండి"            "తెలుగుతల్లి విలపిస్తుంది "            "తెలుగువాడి వేదన కంటే తెలుగు తల్లి బాదే ముఖ్యం"            "తెలుగు తల్లి పిలుస్తుంది !రా! కదలి రా! "  ఇలాంటి  స్లోగన్ లతో ఆ చానల్ ఊదర గొడుతుంటె , చూసే వారికి ఏమనాలో అర్దం కావటం లేదు. బాషలు, ప్రాంతాలు, మనుషులకే కానీ, తనకు ఆ బేదబావమేమి లేదన్నట్లు ,ప్రక్రుతి పగబట్టిన దానిలా ఆంద్రప్రదేశ్ ను వర్షాలతో అతలాకుతలం చేస్తోంది. అటు సీమాంద్రలోనే కాక ,ఇటు తెలంగాణాలోను వాగులు, వంకల

విభజన వాదుల్లో ఉన్న సమైక్యతా బావం ,సమైక్య వాదుల్లో లేకపోవడం విడ్డూరం!

                                                      ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. తెలంగాణా నాయకులు మొన్నటిదాక ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ వారు ప్రకటించినప్పటి నుంచి ఏ పార్టీ వారు కూడా   తెలంగాణాలోని ఇతర పార్టీల వారి మీద పెద్దగా విమర్శలు చెయ్యడం లేదు సరికదా, సిమాంద్రా  నాయకుల వాదనలను సమైక్యంగా ,సమర్దవంతంగా తిప్పికొడుతున్నారు . రాష్ట్ర ఏర్పాటు విషయంలోను వారు పైకి పార్టీల పరంగా ఏమనుకున్నా, అందరూ అవసరమైనప్పుడు అయిక్యంగానే ప్రవర్తించారు . దీనికిగాను సీమాంద్రా ఉద్యోగుల నాయకుడు అశోక్ బాబు కూడా , తమ ప్రాంత నాయకుల అనైక్యతను ఎత్తి చూపే అనేక సందర్బాలలో  ప్రస్తావించడం గమనార్హం.   ఇకపోతే సీమాంద్రా నాయకులలో, పేరుకే సమైక్యతా రాగం . కానీ శ్రుతి వేరు,తాళం వేరు, లయ  వేరు. ఒకరంటే ఒకరికి చచ్చినా పడదు. సీమాంద్రా తెలుగుదేశం వారంటే, సీమాంద్రా వై.సి.పి. వారికి ఒంటి మీద తేళ్ళు , జెర్రులు పాకినట్లుంటుంది. అలాగే తెలుగు దేశం వారికి. లగడ పాటి, ఉండవల్లి లాంటి రాజకీయ నాయకులు చలసాని శ్రీనివాసరావు లాంటి సమైక్యాంద్రా వాదులు ఎంత గొంతు చించుకున్నా ,ఎన్ని

మా ఇల వేల్పు గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం" గురించి E.T.V 2 వారు ప్రసారం చేసిన "తీర్దయాత్ర" కార్యక్రమం చూడండి

Image
                                                        మొన్న 19-9-2013 వ తారీకున E.T. V. 2  వారు తమ తీర్ద యాత్ర కార్యక్రమం ద్వారా మా ఇలా వేల్పు అయిన శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ వారి దేవాలయం, గార్లఒడ్డు గ్రామం, ఏనుకూర్  మండలం, ఖమ్మం జిల్లా ,గురించి ప్రసారం చేసారు. అయితే ఒక చిన్న పొరపాటు టి. వి. వారు చేసినది ఏమిటంటే మా ఇలవేల్పు వేంచేసిన మా స్వగ్రామం పేరు "గార్లఒడ్డు" అయితే "గార్ల" అని ప్రకటించటం జరిగింది. దానికి గాను వారిని పొరపాటు సరిదిద్దవలసినదిగా కోరటం జరిగింది. ఏది ఏమైనా ఇది మా ఇలవేల్పు దేవాలయంనకు సంబందించింది కాబట్టి మా బ్లాగు మిత్రులు , వీక్షకులు ఆ దేవదేవుని దర్శన బాగ్యం కలిగించాలనే  ఈ  వీడియో లింక్ ను ఇవ్వడమైనది.మా బ్లాగులో 400 వ టపాగా మా ఇలవేల్పు గురించిన సమాచారం ప్రచురించడం నా అదృష్టంగా బావిస్తున్నాను. ఆ లక్ష్మీ నరసింహుని కరుణా కటాక్ష వీక్షణాలు మా బ్లాగు వీక్షకులు అందరి మీద ప్రసరింప చేయాలనీ ఆ దేవ దేవుని ప్రార్దిస్తూ ......  మద్దిగుంట నరసింహ రావు                                                                                                 

మనిషి కమ్యూనిస్ట్! మనసు మాత్రమే "కరెన్సీ ఇస్ట్"!

                                                                   మనిషిని చెప్పె మాటలు బట్టి కాక, చేసె పనులు బట్టి అంచనా వెయ్యాలి.ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఏ వ్యక్తి అయినా తన సహజ గుణానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేడు. అలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది నటన అయి ఉండాలి. మన దేశం లో నిజాయితీ,నిబద్దత కలిగిన రాజకీయ నాయకులు అన్ని పార్టీలలో ఉన్నారు. కాకపొతే వెనుకటి తరంలో అలాంటి వారు ఎక్కువుగా ఉంటే, ప్రస్తుత కాలంలో వేళ్ల మీద లెఖ్ఖ పెట్టగలిగే స్తాయికి వచ్చారు.  ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అంటే మిగతా వారికన్నా ఎంతో నిజాయితీ పరులు అయి ఉండే వారు. వెనుకటి తరంలో అటువంటివారు చేసిన సేవల వలనే ఈ నాటికి దేశంలో ఆ పార్టీలు బ్రతికి ఉన్నాయి. కానీ నేతి బీరకాయలో నేయి ఎంత ఉంటుందో కేరలకు చెందిన సి.పి.యం. నేత అయినా "సమర్ ఆచార్జీ" లో కమ్యూనిజమ్ అంత ఉందని రుజువు అయింది.   ఆయన పేరు  సమర్ ఆచార్జీ. వయస్సు  సంవత్సరాలు.కేరళ మార్క్శిస్ట్ పార్టీకి స్తానిక నేత. పాపం ఆయనకు చిన్ననాటినుండి ఒక కల కనే వాడు. అది డబ్బు కట్టల మీద నిద్రించాలని. కానీ ఆయన బీదరికం ఆయన కోరికకు అడ్డు పడుతూ ఉండేది. చేసే ఉద

లగడపాటి గారు మాటి మాటికి చెప్పే బ్రహ్మాస్త్రం అదేనా?

                                                                           తెలంగాణా ఏర్పాటుకి కేంద్ర ప్రబుత్వం ఒ.కె. చెప్పిన నాటినుండి "లగడపాటి" గారు తన దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉందని, అది సరి అయిన సమయంలో అంటే ఆంద్రప్రదేశ్ ను సమైఖ్యంగా ఉంఛటానికి గల దారులన్నీ మూసుకుని పోయాకా ఆ ఆస్త్రం వదులుతాను అని, దాని వలన విభజన ఆగిపోతుందని, పదే పదే చెపుతున్నారు. ఆ బ్రహ్మాస్త్రం ఏమై ఉంటుందా అని ఆయన మాటలుని సీరియస్ గా తీసుకునే వారు తెగ ఆలోచిస్తుంటే, ఆ .. ఇవ్వన్నీ పనిక్ రాని మాటలే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని ఉద్యమాలు చేసినా కేంద్ర ప్రభుత్వం మాత్రం తను అన్న మాటకు కట్టుబడినట్లు, శరవేగంగా రాష్ట్ర విభజన చర్యలు కానిచ్చేస్తుంది. దీనితో సీమాంద్రా నాయకులకు దిక్కు తోచని పరిస్తితి ఎదురయింది. మరి లగడపాటి గారు తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడు ప్రయోగిస్తారో ఆశావాదులుకు అర్దం కావటం లేదు. అసలు ఆయన దగ్గర ఉన్న ఆ మహా అస్త్రం ఏమిటి అనేది కూడా తేలలేదు.నేను ఇంతవరకు అనుకున్నది ఏమిటంటే, కేంద్ర పెద్దలకు ఆంద్రప్రదేశ్ లోని కొంత మంది రాజకీయ నాయకులకు ఏదో చీకటి ఒప్

యెహ్! బానిస! బానిసలకు ఇంత అహంబావమా!

శ్రీ పాండవ వనవాసమొ, శ్రీ క్రిష్ణ రాయబారమో గుర్తు లేదు కానీ నేను చిన్నప్పుడు చూసిన సినిమాలో ఎన్.టి ఆర్ గారు బీముడిగా ’దారుణీ రాజ్య సంపద’ అనే పద్యాన్ని పాడి(బాక్ గ్రౌండ్ ఘంటసాల అనుకోండి)ఆపగానే,దుర్యోధనుడిగా నటిస్తున్న యస్ వి ఆర్ గారు ఒక డైలాగ్ కొడతారు.అది"యెహ్! బానిస! బానిసలకు ఇంత అహంబావమా!" అని. అది బాగా క్లిక్ అయిన డైలాగ్! ఎందుకంటే అప్పటి దాక కొండంత రాగం తీసి యన్.టి.ఆర్ గారు పద్యం పాడితే, ఒక్క డైలాగ్ తో అది పనికి రాని ప్రేలాపన గా మిగిలి పోయింది. అలాగే ఉంది ఇప్పుడు సీమాంద్రా యం.పి.ల పరిస్తితి చూస్తుంటే! తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు ప్రకటించిందని, కేంద్రం మీద కారాలు మిరియాలు నూరుతూ, సీమాంద్రాకు చెందిన పదమూడు మంది కాంగ్రెస్ టి.డి.పి, వై.యస్.ఆర్ సి.పి. యంపిలు రెండు నెలలు క్రితం లోక్ సభ స్ఫీకర్ మీరాకుమార్ గారికి యమ అర్జంట్ అన్నట్లు రాజీ నామాలు సమర్పించేసారు . ఇచ్చి రెండు నెలలు అవుతున్నా స్పీకర్ గారు వాటిని ఆమోదించ లేదని, లగడ పాటి గారు డిల్లీ హై కోర్టులో పిటిషన్ కూడా వేసారని అంటున్నారు. రాజ్య సభలో ఒక్క హరిక్రిష్ణ గారు తప్పా, ఏ యం.పి. కూడా తమ రాజీ నామాను ఆమోదింపచేసుకోలేక

సీమాంద్రా ప్రజలను నట్టెట్లో ముంచి ఇంట్లో మనవరాలితో స్టెప్పులేసి మురిసి పోతున్నాడంటా!.

మొన్న "ఎవడు" అనే సినిమాకి ఆడియో రీలిజ్ ఫంక్షన్ జరింగింది. అది కొడుకు హీరోగా నటించే సినిమా కాబోలు, తంద్రి అయిన శ్రీ శ్రీ చిరంజీవి గారు ముఖ్య అతిదిగా హాజరు అయ్యారు. సరే ఎలాగు వచ్చారు కాబట్టి, ఒక నాలుగు మాటలు కొడుకు నటనా కౌశ్యల్యం గురించి మాట్లాడి , సినిమా తీసినవారిని ఆశిర్వదిస్తే బాగానే ఉండెది. కాని దానితో పాటు ఆయనలోని అసలు నటుడు అప్పుడప్పుడు ఎలా భయటకు వస్తుంటాడొ ఆయనే సోదోహరణంగా చెప్పి ఆయన గారి అభిమానులను అలరించాడు. ఆయన గారు చెప్పిన విషయం అభిమానులను అలరించవచ్చు గానీ, ఆయనని నమ్ముకుని ఓట్లు వేసిన సీమాంద్రా ప్రజలను మాత్రం తప్పకుండా ఆలోచనలో పడేస్తుంది. ఆయన గారు చెప్పిన విషయం ఏమిటంటే :- సినిమాలో శ్రుతి హాసన్ చేసే డాన్స్ చూస్తుంటే,చిరంజీవి గారికి అసలు మనసు ఆగటం లేదట! ఆయనకు తెలియకుండానే ఆయన కాళ్ళు లేచి నిలబడ్డాయట! ఆ సమయం లో ఇంట్లో ఆయన గారి మనవరాలు తప్పా ఎవరూ లేరట. అప్పుడూ ఆ పాపనే శ్రుతిహాసన్ గా బావించి ఆమె తోనే స్టెప్పులేస్తున్నట్లు బావిస్తూ, మనవరాలితో డాన్స్ చేసారట ! పాపం ఈ విదంగా ఆయనలోని నటుడుని త్రుప్తిపరచారు మహారాజశ్రిచిరంజీవిగారు. పాపం హాపీగా సినిమాలో స్తెప్పులే

సీమాంద్రా ఉద్యోగుల "అత్మాభిమానం"కాపాడిన "పైలిన్" తుఫాన్

                                                                                                                                       మొత్తానికి నేను ఇంతకు ముందు టపాలో చెప్పినట్లు సీమాంద్రా ఉద్యోగులు సమ్మె విరమించారు. కొన్ని శాఖల వారు తాత్కాలికం అంటున్నా, యన్.జి.వో లు సమ్మె కొన సాగిస్తూనే విదులు నిర్వహిస్తామంటున్నా మొత్తానికి అరవై రోజుల సమ్మెకు ఎలా తెర దించాలో తెలియక అల్లాడుతున్న ఉద్యోగుల ఆత్మాభిమానాన్ని కాపాడింది ఆగ మేఘాల మీద ముంచుకొస్తున్న పైలిన్ తుఫాన్ అని చెప్పవచ్చు.   రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచుతామని శ్పష్టమైన హామి వచ్చే వరకు సమ్మెను విరమించమని భీష్మ ప్రతిజ్ణ చేసిన సీమాంద్రా ఉద్యోగుల గోడు పట్టించుకోవడానికి కేంద్రం ఏ మాత్రం సుముఖత చూపలేదు, సరి కదా రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియలు మరింత వేగవంతం చేసింది. తమ సమ్మె వలనే  టి. నోట్ ఆమోదం రెండు నెలలు ఆలస్యం అయింది అని ఉద్యోగ సంఘాలు అంటున్నా మొత్తానికి కేంద్రం అయితే తెలంగాణా అనేది అనివార్యం అన్నాకా సీమాంద్రా ఉద్యోగుల ఆశలు అన్నీ ఆవిరి అయిపోయినట్లే లెఖ్ఖ.దానికి తోడు గ్రూప్ ఆప్ మినిశ్తర్స్ ని కూడ కేంద్రం నియమించాకా వారు చేయగలిగింది

శ్రీ శ్రీ గారు హేళన చేసినా, భారతీయ తాత్విక చింతన యే కరెక్ట్ అని తేల్చిన బౌతిక శాస్త్రజ్ణులు!

                                                        ప్రముఖ విప్లవ కవి శ్రీ, శ్రీ గారు "మిద్యావాది" అనే కవితలో   మాయంటావా!   అంతా  మిద్యంటావా   నా ముద్దుల వేదాంతీ.   మాయంటావు, లోకం   మిద్యంటావూ!  అని భారతీయ అద్యాత్మిక వాదాన్ని అవహేళన చేస్తూ, బౌతిక ప్రపంచమే సత్యం అంటాడు. సరే ఆయన ఏమన్నా ఆయన శ్రమజీవుల కష్టాలు గురించి రాసాడు కాబట్టి, వారి అభ్యుదయానికి బౌతిక బావజాలం ఉపయోగపడవచ్చు. కానీ అంతిమ సత్యం ని ఎవరూ మార్చలేరు.   బారత దేశం లోని అద్యాత్మిక వాదులు ఏనాడో చెప్పారు. ఈ కనిపించే ప్రపంచం అంతా  శూన్యం నుండి ఉద్బవించిందే అని. దానినే శంకరా చార్యులు మాయ అన్నాడు. అంతకు ముందు నాగార్జుణుడు శూన్యత్వమే అసలైన నిర్వాణమనీ, అది కారణ రహితమైన అస్తిత్వమనీ, అందులో అన్ని పరిణామాలూ సమత్వం పొందుతాయని చెప్పారు .  ఇదే అతని శూన్యవాద సారాంశం. ఆచార్య శంకరుని మాయా వాదానికి నాగార్జునుని శూన్య వాదమే ప్రాతిపదిక అయ్యిందని పెద్దలు చెబుతారు.   ఏది ఏమైనా దేనినైనా  మనిషి కంటే మనసు ముందు దర్శిస్తుంది. అయిన్ స్టీన్ కూడా ఏ నాడు ప్రయోగ శాలలో అడుగు పెట్టలేదని అంటారు. కానీ ఆయన ఆవిష్కరించిన  బౌతిక సత్యాలు ఆయన మన

సీమాంద్రా ఉద్యోగుల "ఉద్యమ కధ" కంచికి చేరనుందా?

                                                                 చిన్నప్పుడు పరవస్తు చిన్నయ సూరీ గారి కధలు పాఠ్యాంశాలుగా ఉండేవి.అందులోని కధలు ఇప్పటికి గుర్తు వస్తూనే ఉంటాయి. అందులో ఒకటి "పరాధికారం పైన వేసుకుని చచ్చిన గాడిద" కధ ఒకటి.    ఒక ఊరిలోఒక రజకుడు ఉండేవాడు. అతనికి బట్టలు మోయడానికి ఒక గాడిద, ఇంటిని కాపల కాయడానికి ఒక కుక్క ఉన్నాయి. అందులో కుక్క కి యజమాని అంటే  తగని ఒళ్ళు మంట. ఎందుకంటే దానికి సరిపోను తిండి పెట్టడని. ఆ కారణం చేత ఇంటి కాపలా విషయంలో నిర్లక్ష్యంగా ఉండేది. కానీ గాడిద మత్రం అలా కాదు. తనతో ఎంత చాకిరి చేయించినా దానిలో స్వామి భక్తి చెక్కు చెదరలేదు. యజమానికి నమ్మకంగా పని చేయాలన్నదే దాని అభిమతం.   ఒక రోజు ఆ రజకుడు చాకి రేవుకు వెళ్ళి వచ్చి ఒంటి బడలికతో ఆదమరచి నిద్రిస్తున్నాడు. అంతలో ఒక దొంగ రజకుడి ఇంటికి కన్నం వేసి దొంగ తనం చేస్తున్నాడు. దానిని కుక్క, గాడిద రెండూ గమనించాయి. దొంగ ప్రవేశిస్తే మొరగవలసిన బాద్యత కుక్కది. కానీ యజమాని మీద కోపంతో అది మొరగలేదు. దానిని గమనించిన గాడిద కుక్కను కారణమడిగితే, తనను పట్టించుకోని  యజమానికి ఎంత సేవ చేసినా వ్రుధాయే అంటుంది.

"తిట్టను పోరా వెదవా" అంటున్న దిగ్విజయ్ సింగ్!

                                                                                                                                                                                               మొత్తానికి అనుకున్నంతా అయ్యేటట్లున్నది హైద్రాబాద్ విషయం! మొన్న టి. నోట్ ను  కేంద్రం వారు అమోదించిన దాని ప్రకారం హైద్రాబాద్ తో కూడిన తెలంగాణా ఇస్తామని. అంతకు ముందు సోనీయా గాందీ గారు ఫర్ములా కే మొగ్గు చూపారని, దాని ప్రకారం హైద్రాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణా ఇవ్వటం జరుగుతుందని చెప్పినప్పుడు ఒక తెలంగాణా వాడిగా కేంద్రం ఆలోచనలో హైద్రాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం గా చేసే కుట్ర ఏమి లేదని సంతోషించడం జరిగింది. కానీ దిగ్విజయ్ సింగ్, చిదంబరం, కొంతమంది రాష్ట్ర నాయకుల హడావుడి గమనిస్తుంటే మనసెందుకో కీడు శకిస్తుంది. దానికి తగ్గటుగానే కె.సి.ఆర్ గారు మాటి మాటికి హైద్రాబాద్ మీద పూర్తీ హక్కులతో  కూడిన పది జిల్లాల తెలంగాణా ఇచ్చే దాక జాగర్తగా ఉండాలని అనటం కూడా అనుమానానికి బలం చేకూరుతున్నట్లైంది.   మొదట్నుంచి  ఉన్న డౌట్ ఒకటే. హైద్రాబాద్ మీద తెలంగాణా వారి పట్టు లేకుండా చేసే కుట్రలో బాగమే కాంగ్రెస్ వారి &quo

ఇటువంటి "పిచ్చి పట్టిన ప్రజలు, పోలిసులూ" ఉన్నది "భూతల స్వర్గమా? భూతాల స్వర్గమా?

                                                                మాట్లాడితే కొంతమంది అగ్ర రాజ్యం అని పిలువబడుతున్న అమెరికా న్ని ఆకాశానికెత్తుతూ,బారత దేశం ని తక్కువ చేసేలా, అదే ఆక్కడైతేనా అని పోలుస్తూ తమ ప్రాశ్చ్యత్య వ్యామోహాన్ని చాటుకుంటుంటారు.అక్కడ స్త్రీలకు ఉన్న స్వేచ్చ ఏమిటో తెలియదు కానీ మామూలు మానసిక సమస్య అయిన డిప్రెషన్ కలిగిఉన్నా  అక్కడ పిచ్చి కుక్కను చంపినట్లు కాల్చి చంపేస్తారు అని ఈ అమానవీయ సంఘటణ తెలియ చేస్తుంది.   అమెరికాలోని స్టమ్పోర్డ్ కు చెందిన మిరియం కేరీ ఒక డెంటిస్ట్ హైజీనియస్ నిపుణురాలు. ఆమెకు పద్దెనెమిది నెలల పాప ఉంది. ఆమె గర్బవతిగా ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు స్టెయిర్కేస్ నుండి పడటం వలన తలకు దెబ్బ తగిలింది. ఆమెరికా లో భద్రత తో కూడినా సంసార జీవనాలు అనేవి వుండవు. అదిక శాతం మంది స్త్రీలు పెండ్లి లాంటి లంపటాలు లేకుండా ఫ్రీగా జీవిస్తూ తమకు నచ్చిన వారితో కోరిన సంతానం పొందే స్వెచ్చ ఉంది కాబట్టి ఆమె సంతానం పొందింది కానీ "సం ఓదార్పు" పొందలేకపోయిందనుకుంటా, మెంటల్ గా డిప్రెషన్ కి గురయింది.   ఆ డిప్రెషన్ లో ఆమె తన కారులో పాపను తీసుకుని అమెరికా ఆద్యక్షుని నివాసమై

చేసే పూజలు "బతుకమ్మా, దుర్గమ్మా" అని, కానీ దీవీంచేది మాత్రం "చావమ్మా" అనా!

   మనకు దసరా నవ రాత్రులు వచ్చినవంటే అందరికి ఎంతో ఆనందం. అటు ఆంద్రాలోనూ, ఇటు తెలంగాణ లోనూ దసరా చాలా ముఖ్యమైన పండుగయే! ముఖ్యంగా ఈ పండుగ స్త్రీ శక్తి కి ప్రతీకగా "దుర్గా మాత ఆమె అవతార రూపాలైన వివిద శక్తులను పూజిస్తూ హిందువులు ఎంతో భక్తి ప్రపత్తులతో మెలగుతారు.                                                                              తెలంగాణ ప్రాంత స్త్రీలు వారిచుట్టుపక్కల పూసే గుమ్మడి, గునుగు, తంగేడు, కట్లపూలు, గన్నేరు పూలతో బతుకమ్మలు పేరుస్తారు. గుమ్మడిపువ్వులోని పచ్చని పుప్పొడిని పసుపు గౌరమ్మగా భావిస్తారు. భక్తిక్షిశద్ధ ప్రధానం కానీ, మిగతా శిష్టులు చేసే ఉపాసనలతో వీరికి పనిలేదు. అమ్మా! నీవీ రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు గెలిచి బతుకమ్మా! అని బతుకమ్మను కోరుకుంటారు. . అదే వివిధ రకాల వాయినాల నైవేద్యం. ఒక్కొక్కరు ఒక్కో పదార్థాన్ని చేసి తెచ్చి బతుకమ్మకు నివేదించి, స్త్రీ మూర్తులనే దేవీమూర్తిగా భావించి వాయినాలిచ్చుకుంటారు. బలాన్నిచ్చే నువ్వులు, బెల్లంతో నూలు ఉండలొకరోజు, సేవలడ్డూలు, పాయసం, దోసకాయ, పెసరపప్పు (నానపెట్టింది), పెసరపప్పు వేయించి, పిండిచేసి, చక్కెర, నెయ్యితో

తమిళ అన్న, తెలంగాణా తంబికి హాట్సాఫ్!

                                                              నిన్నటి దాక నాకొక చిన్న అనుమానం ఉంది. హైద్రాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేసి తెలంగాణా కి అన్యాయం చెయ్యడానికి సీమాంద్రా నాయకులు సోనీయా గాందీ ని ఒప్పించారా అని. కాని అలా జరుగలేదు. సోనీయా గాందీ ఇటలీ లో పుట్టిన ది కాబట్టి ఇండియా రాజకీయ బుద్దులు అబ్బి ఉండక పోవచ్చు. అందుకే పుట్టిన రోజు కానుకగా తెలంగాణా ప్రజలకు ఇచ్చిన మాటను నిల బెట్టుకుంది.  తమ పార్టీ సీమాంద్రలో నామ రూపాలు లేకుండా పోతుందని తెలిసినా తెలంగాణా వారికి హైద్రాబాద్ తో కూడిన పది జిల్లాల రాష్త్ర ఏర్పాటు తో కూడిన ఫార్ములా  కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అన్నా మాటను నిల బెట్టుకున్న  సోనియా గాందీ గారికి హట్సాఫ్!    ఇక పోతే నిన్న అధికారికంగా అంటే భారత కేంద్ర ప్రభుత్వ ఆమోదం ద్వారా ఒక చారిత్రాత్మక మార్పు జరిగింది. అదే కొత్త రాష్ట్రం గా29  వ రాష్త్రం తెలంగాణా ఏర్పడితే, దక్షిణ భారత దేశం లో అతి పెద్ద రాష్ట్రం గా తమిళనాడు అవతరించింది(.ఇప్పుడున్న పరిస్తితుల ప్రకారం పార్లమెంటులో బిల్లు నెగ్గడం ఖాయం కాబట్టి,) ఇప్పుడు దక్షిణ భారత దేశం లో అతి పెద్ద రాష్ట్రం తమిళ నాడు అయితే అతి చిన్న ర

ఒక్క రాహుల్ ముందు అయిదు కోట్ల సీమాంద్రులు ఆప్ట్రాలా!

Image
                                                                                                                                                        మనది ప్రజాస్వామ్య దేశమట! నమ్మమని నమ్మకంగా చెపుతుంటారు అధికారంలో ఉన్న వారు. ఇక్కడ మెజార్టీ ప్రజలు అవునన్నదే చట్ట రూపంలో చలామణీ అవుతుందని చాలా మంది విశ్వాసం. కాని అది తప్పు అని, డిల్లీ పాలకులకు ఆంద్రా ప్రజలు అంటే గడ్డిపరకతో సమానమని నిన్న జరిగిన సంఘటణ రుజువు చేస్తుంది.   గత 64  రోజులుగా సీమాంద్రా లోని అయిదుకోట్ల మంది ప్రజలకు నిత్యావసర సేవలు నిలుపుదల చేసి ఆ ప్రాంత ఉద్యోగులు,విద్యార్దులు, రైతులు, ఇతర అనేకానేక సంఘాలవారు రాజకీయాల కతీతంగా ,రోజూ కొన్ని లక్షలమంది ప్రజలు, చారిత్రాత్మకం అనిపించే రీతిలో, అహింసాయుతంగా ఆందోళన చేస్తుంటే, కనీసం కేంద్ర ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించిన పాపానా పోలేదు. వారు కోరుతుంది రాష్ట్ర విబజన ఆపమని, దానికి కారణం తమకు విబజన వలన కలిగే నష్టాలే అని అంటున్నపుడు వాటి మీద సవివరంగా వివరణ ఇచ్చి కనీసం వారీ భయాందోళనలు తీర్చాల్సిన బాద్యత కేంద్ర ప్రబుత్వానిదే. ఎందుకంటే ఇక్కడి ముఖ్య మంత్రి గారు కూడా అదే సందేహాలు వెలిబ

పేరుకి "కరుణగిరి కారుణ్య భవన్",కానీ ఆడపిల్లలకి అరణ్య భవన్ అట!

                                                                       గురువు శిష్యుల బందం తండ్రి పిల్లల సంబందం అనేది సాంప్రదాయ బావన. ఆడపిల్లలు చదువుల నిమిత్తం ఉన్న ఊరిలో  కాకుండా పొరుగూరు వెళ్లి  హాస్టల్లో ఉండి చదువుకోవలసిన పరిస్తితి. అక్కడ తల్లి తంద్రుల పర్యవేక్షణ ఉండదు. కాబట్టి ఆ యా పాఠశాలలు, లేక వసతి గ్రుహాల నిర్వాహకులే ఆ బాద్యత తీసుకోవాల్సి ఉంటుంది. వీరందరి కంటే ఆడపిల్లలకు విద్య బోదించే గురువులు వయసుతో నిమిత్తమ్ లేకుండా కన్న తండ్రి వలే వారికి విద్యాబోదనతో పాటు నైతిక జీవన ఆవశ్యకత గురించి చెప్పాల్శిన బాద్యత ఉంది. ఒక వేళా వారి ప్రవర్తనలలో ఏదైన అనుమానం అనిపిస్తే తల్లితండ్రులకు తెలియ చెప్పాల్శిన బాద్యత కూడా ఉంది. కానీ తండ్రి వయసున్న ఉపాద్యాయుడే పదవ తరగతి చదివే అమ్మాయిని మాయ మాటలతో వంచించి, తన అవసరాలకు వినియోగించుకుంటుంటే ఇంకెవరిని నమ్మి, ఆడపిల్లల్ని ఉన్నత విద్యల కోసం దూర ప్రాంతాలకు పంపేది?   ఖమ్మం లో కరుణగిరి సంస్థ పేరు పొందిన సేవాసంస్థ అని కొంత మంది నమ్మకం. దానికి అనుబందం గా ఒక విద్యాలయం ఉంది .అదే "కారుణ్య విద్యా భవన్". ఆ విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న అమ్మాయి ఉం

ఇంటిమీద మత చిహ్నం, చేతిలో మతగ్రందం పట్టుకుని తిరిగే వారు కూడా "మోడీ" గారిది మత చాందసం అంటే ఎలా?

                                                                  నిన్న వై.యస్.ఆర్. పార్టీ అద్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు మీడియా ప్రకటణ ఒకటి ఏర్పాటు చేసి అందులో తన బవిషత్ కార్యా చరణ గురించి చెప్పారు. ఆయన చెప్పిన దానిలో అన్నీ రోటిన్ గా ఉన్నవే అయినా గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరెంద్ర మోడి గారి గురించి చేసిన వ్యాఖ్యలు కొంచం ఆశ్చర్యాన్ని కలిగించాయి.  ఆయన ద్రుష్టిలో మోడి గారు గొప్ప అడ్మినిస్త్రేటర్ అట! కానీ అయన గరి మత చాందసమే ఆయనలోని నచ్చని గుణం అట!ఈ మాటలు అన్న జగన్ గారికి అసలు మోడి గారి గురించి తెలుసా లేదా అనే అనుమానం కలుగుతుంది. ఏ మత చాందస వాది అయిన అన్ని వర్గాల ప్రజలతో శబాస్ అని పించుకోవడం కష్టం. కానీ మోడి గారు గుజరాత్ లోని అన్ని వర్గాల ప్రజ ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఆయన పక్కా హిందూ వాది. ఆయనలోని ఆ హిందూ తత్వమే ఆయన్ని నిజమైన "సెకులరిస్ట్" గా ఉండేలా చేస్తుంది అనడం లో అతిశయోక్తి ఏమి లేదు.  హిందూ అనే జీవన విదానం సర్వ ఆరాదనా పద్దతులను సమానంగా ఆదరిస్తుంది. ఇందులో వైష్ణవం, శైవం, గాణపత్యం, శాక్తేయం, సాయిబాబీయం,అయ్యప్పేయం,బుద్దిజం, జైనిజం, సిక్కిజమ్ లాంటి శాఖలు ఉన్నాయి