"తిట్టను పోరా వెదవా" అంటున్న దిగ్విజయ్ సింగ్!

                                                              
                                                                  
                                                          

  మొత్తానికి అనుకున్నంతా అయ్యేటట్లున్నది హైద్రాబాద్ విషయం! మొన్న టి. నోట్ ను  కేంద్రం వారు అమోదించిన దాని ప్రకారం హైద్రాబాద్ తో కూడిన తెలంగాణా ఇస్తామని. అంతకు ముందు సోనీయా గాందీ గారు ఫర్ములా కే మొగ్గు చూపారని, దాని ప్రకారం హైద్రాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణా ఇవ్వటం జరుగుతుందని చెప్పినప్పుడు ఒక తెలంగాణా వాడిగా కేంద్రం ఆలోచనలో హైద్రాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం గా చేసే కుట్ర ఏమి లేదని సంతోషించడం జరిగింది. కానీ దిగ్విజయ్ సింగ్, చిదంబరం, కొంతమంది రాష్ట్ర నాయకుల హడావుడి గమనిస్తుంటే మనసెందుకో కీడు శకిస్తుంది. దానికి తగ్గటుగానే కె.సి.ఆర్ గారు మాటి మాటికి హైద్రాబాద్ మీద పూర్తీ హక్కులతో  కూడిన పది జిల్లాల తెలంగాణా ఇచ్చే దాక జాగర్తగా ఉండాలని అనటం కూడా అనుమానానికి బలం చేకూరుతున్నట్లైంది.

  మొదట్నుంచి  ఉన్న డౌట్ ఒకటే. హైద్రాబాద్ మీద తెలంగాణా వారి పట్టు లేకుండా చేసే కుట్రలో బాగమే కాంగ్రెస్ వారి "తెలంగాణా" ఏర్పాటు. వచ్చే ప్రభుత్వం గన్ షాట్ గా తమదే అని చెప్పే పరిస్తితిలో కాంగీయులు లేరు. కాబట్టి రాష్ట్రం లోని బడాబాబులతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాలలో బాగంగా హైద్రాబాద్ ని కేంద్ర పరిదిలోకి తెవాలి. ఎన్నికలు గడువు సమీపిస్తుంది. నియమ నిబందనలు పట్టించుకుంటే, కార్యం పూర్తీ కాదు. అందుకే నిబందనలు అన్నీ తుంగలో తొక్కేసి, టి.నోట్. అంటే టెబుల్ నోట్ గా మార్చి, తెలంగాణా కీ కేంద్ర ప్రభుత్వ ఆమోదం అయిందనిపించారు. కానీ అలా అయిందనిపించిన తెర వెనుక పెద్దలకు, సోనియా గాందీ గారు ఫార్ములాI కి ఒ.కె. చెప్పటం రుచించ లేదు. అంటే హైద్రాబాద్ మీద తెలంగాణా వారి పెత్తనం ఇష్టం లేదు. అందుకే మల్లీ దిగ్విజయ్ సింగ్ చేత పనిగట్టుకుని మరీ ప్రకటణ చేయించారు.

  సదరు ప్రకటణా సారాంశం ఏమిటంటే హైద్రాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాదట, కానీ దాని పాలన మాత్రం గవర్నర్ లేక కేంద్ర పరిదిలో ఉంటుందట! దీనీ బావమేమి తిరుమలేశ" అంటే విషయం స్పష్టం.అటూ ఇటూ చేసైనా హైద్రాబాద్ ని కేంద్ర గుప్పిటలోకి తెచ్చుకోవడమే అసలు సంగతి. దాని కోసం అటు ఇటు జరుగుతున్న ఉద్యమాలను బూచీ గా చూపుతూ, తాము అనుకున్నది చేస్తున్నారు కేంద్ర పెద్దలు.సీమాంద్రులు తమకు హైద్రాబాద్ ని పదేళ్లు ఉమ్మడి రాజదానీ గా కోర లేదు. అయినా పెద్ద మనసు తో తామే ఆ ప్రతి పాదన పెట్టినట్టు చేసి ఇద్దరి మద్య పదేళ్ళు చిచ్చు ఆరకుండేలా చేసారు.

 కొట్లాడుకుని మనస్పర్దలతో విడిపోయే బార్యా భర్తలకు విడాకులు ఇచ్చాకా తిరిగి పదేండ్లు ఒకే చూరుక్రింద ఎవరి కాపురం వారు చేసుకొండని ఏ పెద్ద మనిషి అయినా తీర్పు ఇస్తారా? దాని వలన తిరిగి పాత విషయాలు తోడుకుని కీచులాడుకోరా? ఆ ఇంటి పెత్తనం ఆ ఇద్దరిలో ఏ ఒక్కరిదైనా రెండవ వారు ఎలా ఒప్పుకుంటారు. తమ బద్రత కోసం ఆ పెద్ద మనిషినే ఇంటి పెత్తనం తీసుకోమంటారు. అదిగో అలా కోరాలనే ఈ పదేళ్ళ "లంకె" పెట్టారు. ఆ పదేండ్లు గడిచాక అయినా తెలంగాణా వారికి కేంద్రం తిరిగి పాలన హక్కు ఇస్తుందని గ్యారంటి ఏమిటి? ఒక్క సారి పాలన కేంద్ర చేతిలోకి వెల్ళాక అది తిర్తిగి తెలంగాణా వారి చేతిలోకి రావడం కష్టం . తిరిగి తెలంగాణా విడగొట్టమనే ఉద్యమాలను కేంద్రం ప్రోత్సాహించవచ్చు. ఆ వoకతో శాశ్వతం గా హైద్రాబాద్ ని తమ చేతిలోనే ఉంచుకోవచ్చు. కాబట్టి ఒకసారి విబజిస్తే అన్ని సమస్యలను తేల్చివేయాలి. పదేండ్లు ఉమ్మడి రాజదాని ప్రతి పాదన అవాంచనీయం. అంతిమoగా అది కేంద్ర పాలనకు దారి తీస్తుంది. ఈ విషయం పట్ల తెలంగాణా వారు జాగరూకలై ఉండాలి. బి.జె.పి. వారు కూడా తెలంగాణా కి అనుకూలం కాబట్టి తెలంగాణా గురించి ఆదుర్దా పడాల్సిన అవసరం లేదు.

  ఒక పక్క హైద్రాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాదంటూనే, మరొక వంక కేంద్ర పరిదిలో హైద్రాబాద్ పాలన ఉంటుందనటం "తిట్టను పోరా వెదవా" అన్నట్లున్న కేంద్ర పెద్దల వక్ర బుద్దికి తార్కానం.ఇరువైపు పెద్దలను కూర్చో బెట్టి పారదర్శకంగా చర్చలు జరిపి తీసుకునే నిర్ణయాలే ఇరు ప్రాంతాలకు మేలు చేస్తాయి తప్పా, ఒక ప్రాంతానికి మేలు చేస్తునట్లు నటిస్తూ, ఇంకొకప్రాంతం వారిని ఉద్యమాలు చేసేలా ప్రేరేపిస్తూ ఆటూ, ఇటూ నాటాకాలాదుతున్నది ఖచ్చితంగా హైద్రాబాద్ ని తెలుగు వారికి కాకుండా చెయ్యడానికే. నేను ఇంతకు ముందు టపాలలో చెప్పినది అదే. ఈ విషయం ఎంతో అనుబవమున్న పెద్దలకు, కేంద్ర పెద్దల కుట్ర అర్దం కావటం లేదు అంటే నమ్మటం కష్టం.     

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన