యెహ్! బానిస! బానిసలకు ఇంత అహంబావమా!

శ్రీ పాండవ వనవాసమొ, శ్రీ క్రిష్ణ రాయబారమో గుర్తు లేదు కానీ నేను చిన్నప్పుడు చూసిన సినిమాలో ఎన్.టి ఆర్ గారు బీముడిగా ’దారుణీ రాజ్య సంపద’ అనే పద్యాన్ని పాడి(బాక్ గ్రౌండ్ ఘంటసాల అనుకోండి)ఆపగానే,దుర్యోధనుడిగా నటిస్తున్న యస్ వి ఆర్ గారు ఒక డైలాగ్ కొడతారు.అది"యెహ్! బానిస! బానిసలకు ఇంత అహంబావమా!" అని. అది బాగా క్లిక్ అయిన డైలాగ్! ఎందుకంటే అప్పటి దాక కొండంత రాగం తీసి యన్.టి.ఆర్ గారు పద్యం పాడితే, ఒక్క డైలాగ్ తో అది పనికి రాని ప్రేలాపన గా మిగిలి పోయింది. అలాగే ఉంది ఇప్పుడు సీమాంద్రా యం.పి.ల పరిస్తితి చూస్తుంటే! తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు ప్రకటించిందని, కేంద్రం మీద కారాలు మిరియాలు నూరుతూ, సీమాంద్రాకు చెందిన పదమూడు మంది కాంగ్రెస్ టి.డి.పి, వై.యస్.ఆర్ సి.పి. యంపిలు రెండు నెలలు క్రితం లోక్ సభ స్ఫీకర్ మీరాకుమార్ గారికి యమ అర్జంట్ అన్నట్లు రాజీ నామాలు సమర్పించేసారు . ఇచ్చి రెండు నెలలు అవుతున్నా స్పీకర్ గారు వాటిని ఆమోదించ లేదని, లగడ పాటి గారు డిల్లీ హై కోర్టులో పిటిషన్ కూడా వేసారని అంటున్నారు. రాజ్య సభలో ఒక్క హరిక్రిష్ణ గారు తప్పా, ఏ యం.పి. కూడా తమ రాజీ నామాను ఆమోదింపచేసుకోలేక పోయారు.రెండు నెలల తర్వాత ఏవో సాంకేతిక కారణాలు చూపుతూ, ఇ రోజు స్పీకర్ గారు సదరు యం.పి.ల రాజీ నామాలు తిరస్కరించారు. అంటే మన దేశం లో తెలుగు యం.పిలకు సోనియా గాందీ గారి నిర్ణయాలకు వ్యతిరేకంగా, తమ పదవులు వదులుకునే స్వేచ్చ కూడా లేదన్న మాట! తెలుగువాడు అంటే ఏ విదమైన బావన డిల్లీ పెద్దల్లో ఉందో ఈ ఉదంతం స్పష్టం చేస్తుంది. ఈ మద్య 'వాక్ ఫ్రీ పౌండేషన్' అనే సంస్థ వారు నిర్వహించిన సర్వే ప్రకారం ప్రపంచంలో మూడుకోట్ల మందే బానిసలు ఉన్నారట! అందులో సగం మంది ఇండియాలో ఉన్నారట. సంతోషం. బానిసత్వం అనే దానికి సదరు సంస్త వారు ఇచ్చిన నిర్వచనం ఏమిటో నాకు పూర్తిగా తెలియదు కాబట్టి ఇప్పుడు దాని మీద విశ్లేషణ చెయ్యటం సరి కాదు అని బావిస్తున్నాను. కానీ ఏ వ్యక్తికి అయినా ఎవ్వరి ప్రోదల్బలం లేకుండా స్వేచ్చ గా ఆలోచించగలగటం తదనుగుణం గా నడచుకునే పరిస్తితులు లేని వ్యవస్త ఏదైనా బానిస వ్యవస్తే. దానిని ప్రశ్నించలేని ప్రతి ఒక్కడు బానిసే అనేది నా అభిప్రాయం. ఒక అభిప్రాయం తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, కానీ దానిని ప్రకటించే స్వేచ్చ, తనకు లేని దానిని త్యజించే స్వేచ్చా ప్రతి పౌరుడికి ఉండాలి. కానీ ఈ దేశం లో సాక్షాత్తు ప్రజా ప్రతినిదులైన యం. పి. లకే లేదు, ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది!? ఒక్క రాహుల్ గాంది తిరస్కరిస్తే కేంద్ర ప్రభుత్వం దానిని శిరసావహించింది. కాని సీమాంద్రాకు చెందిన యం.పి.లు రాజినామాలను మాత్రం చెత్త బుట్టలో పడేసింది. అంటే అమ్మ గారి అంగీకారం లేకుండా య.ం.పి లు కనీసం కాల క్రుత్యాలు కూడా తీర్చుకోలేరు అన్న మాట. మరి అలాంటి ప్రజా పతినిదులు ఉన్న దేశం లో కేవలం కోటిన్నర మందే బానిసలా? ఈ లెఖ్ఖ తప్పు. మల్లీ కొత్తగా సర్వే చెయ్యాలి. నా అనుమానం ఏమిటంటే బానిసలు కాని వారు కోటిన్నర మంది అయినా ఈ దేశం లో ఉన్నారా అని?

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.