కనీసం" ఎర్రబస్సులో " ఉన్న రక్షణ అవకాశం కోటి రూపాయల "వోల్వో బస్సులో " లేదన్న మాట !

                                                                 

  ఈ  రోజు  ఉదయం లేవగానే ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది. బెంగుళూర్ నుండి హైదరాబాద్ వస్తున్న "జబ్బార్ ట్రావెల్స్ ' కి చెందిన వోల్వో బస్ మహబూబ్ నగర్ జిల్లా , పాలెం అనే గ్రామం వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం వాళ్ళ, కల్వర్ట్ కు గుద్దుకుని 45 మంది సజీవ దహనమయ్యారని  తెలిసి మనసు అంతా బాదతో నిండి పోయింది .

   అది కోటి రూపాయలు ఖరీదు చేసే వోల్వో బస్ అంటా .ఎ.సి. బస్ పూర్తిగా మూసి వేయబడి  ఒక్క డ్రైవర్ వద్ద డోర్ మాత్రమే ఉంటుంది. సాదారణ బస్సుల్లో మాదిరి మాన్యువల్   ఏమర్జెన్సీ డోర్ లు లాంటివి ఏమి ఉండవు అనుకుంటా . ఏందుకంటే రవణా శాఖ వారి ద్రుష్టిలోకోటి రూపాయల ఎ.సి. బస్సులకు ప్రమాదాలూ  జరుగవు అనుకుంటా! అందుకే దానికి కూడా  "అత్యవసర ద్వారం " ఉండాలి అనే నిబందన పెట్టడం మర్చి పోయి ఉంటారు. ఇక పోతే బస్ సీటింగ్ పరిమితి, 44 మాత్రమే. కానీ కడపటి వార్తలు అందే సమయానికి సజీవదహనమయిన వారే 45 మంది. డ్రైవర్ , క్లీనర్ తో కలిపి మొత్తం ఏడుగురు డ్రైవర్ సీటు దగ్గర ఉన్నసీట్  డోర్ ద్వారా బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారట. మెయిన్ డోర్ ఏమో ఆటోమాటిక్ లాక్ కావటం వలన మూ సుకుపోయి, పనిచెయ్యలేదట!మ్యానువల్  సిస్టం లేకపోవటమే ఇంతటి విపత్తు జరిగింది.

  పాపం కాలి  పోయిన శవాలు అన్నీ వెనుక సీట్ల లోనే ఉండటం బట్టి, వారు వెనుక బాగానికి వెళ్లి , అద్దాలు పగలగొట్టడానికి ప్రయత్నించి విపలులు అయారని అనుకోవాల్సి వస్తుంది . ఆదే  సాదారణ  బస్సులో అయితే కచ్చితంగా ప్రాణాలు కాపాడుకునే వారే . కాని హాయిగా A .C  బస్ లో పడుకుని ప్రయాణించి  హైదరాబాద్ వేళ దామనుకున్న వారిని నిద్రలో ఉన్న వారిని నిద్రలోనే పై లోకాలకు పంపే "యమ వాహనం" అని వారికి తెలియదు . బస్ ఏక్సిడెంట్ కి మూల కారణం డ్రైవర్ నిద్ర మత్తులో కల్వర్ట్ ను డికొట్టడమే అని తెలుస్తుంది. అతను  తన ప్రాణాలు రక్షించుకున్నాడు ,కానీ అతని నిర్లక్ష్యానికి 45 మంది ప్రాణాలు బలి అయ్యాయి. ఆ జబ్బార్ ట్రావెల్స్ వారు కూడా  ఏక్సిడెంట్ విషయం తెలియ గానే షట్టర్ లు మూసుకుని పత్తా  లేకుండా పోయారట. ట్రావెల్స్ నిర్వహణ మొత్తం అక్రమ దారుల్లో నడుస్తుందని ఈ ఏక్సిడెంట్  తర్వాత పరిశిలించిన రికార్డులు చెపుతున్నాయి.

 ఏది ఏమైనా ప్రయాణికుల బద్రతకు అనుకూలంగా లేని వాహనాలను రోడ్డు మీద తిప్పటానికి అనుమతించకుండా , ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే వారి నిర్లక్ష్యానికి అమాయక ప్రజలే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని ఈ  ఘోర ఘటన తెలియచేస్తుంది.

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.