తమిళ అన్న, తెలంగాణా తంబికి హాట్సాఫ్!


                                                      
   


   నిన్నటి దాక నాకొక చిన్న అనుమానం ఉంది. హైద్రాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేసి తెలంగాణా కి అన్యాయం చెయ్యడానికి సీమాంద్రా నాయకులు సోనీయా గాందీ ని ఒప్పించారా అని. కాని అలా జరుగలేదు. సోనీయా గాందీ ఇటలీ లో పుట్టిన ది కాబట్టి ఇండియా రాజకీయ బుద్దులు అబ్బి ఉండక పోవచ్చు. అందుకే పుట్టిన రోజు కానుకగా తెలంగాణా ప్రజలకు ఇచ్చిన మాటను నిల బెట్టుకుంది.  తమ పార్టీ సీమాంద్రలో నామ రూపాలు లేకుండా పోతుందని తెలిసినా తెలంగాణా వారికి హైద్రాబాద్ తో కూడిన పది జిల్లాల రాష్త్ర ఏర్పాటు తో కూడిన ఫార్ములా  కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అన్నా మాటను నిల బెట్టుకున్న  సోనియా గాందీ గారికి హట్సాఫ్!

   ఇక పోతే నిన్న అధికారికంగా అంటే భారత కేంద్ర ప్రభుత్వ ఆమోదం ద్వారా ఒక చారిత్రాత్మక మార్పు జరిగింది. అదే కొత్త రాష్ట్రం గా29  వ రాష్త్రం తెలంగాణా ఏర్పడితే, దక్షిణ భారత దేశం లో అతి పెద్ద రాష్ట్రం గా తమిళనాడు అవతరించింది(.ఇప్పుడున్న పరిస్తితుల ప్రకారం పార్లమెంటులో బిల్లు నెగ్గడం ఖాయం కాబట్టి,) ఇప్పుడు దక్షిణ భారత దేశం లో అతి పెద్ద రాష్ట్రం తమిళ నాడు అయితే అతి చిన్న రాష్ట్రం "తెలంగాణా". కాబట్టి ఇప్పటి దాకా ఆ హోదాలు అనుభవిస్తున్న ఆంద్రప్రదేశ్, కేరళ లును వెనక్కి నెట్టేసి ఆ స్తానాలు ఆక్రమించిన ఆ రెండు రాష్ట్రాల ప్రజలకు శుభాభినందనలు.

  ఇక పోతే ఇది తెలంగాణా ప్రజల అరవై యేండ్ల పోరాట పలితమని అని సాంకేతికంగా చెపుతున్నపటికి తమీళ నాడు అన్న గా, తెలంగాణా తమ్ముడు గా అవతరించడానికి ముఖ్య కారకులు తమిళ తంబి చిదంబరం గారు, తెలంగాణా అన్న కలువ కుంట్ల చంద్ర శేఖర్ గారు. వీరిద్దరూ పకడ్బందిగా ఆలోచించి రచించిన వ్యూహం ద్వారానే ఈ రాష్ట్ర ఏర్పాటు సాద్యమయింది. దీని గురించి ఇదివరకే నేను ఒక టపాలో చెప్పడం జరిగింది. సోనియా గాంది మనస్తత్వం అంచనా వేసి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తద్యమని చెప్పాను.ఈ లింక్ మీద క్లిక్ చేసి చూడండి.

సోనియా గాంది, తన పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన దానిని వెనుకకు తీసుకుంటుందా !? http://ssmanavu.blogspot.in/2013/07/blog-post_27.html



                                                                       

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!