ఇంటిమీద మత చిహ్నం, చేతిలో మతగ్రందం పట్టుకుని తిరిగే వారు కూడా "మోడీ" గారిది మత చాందసం అంటే ఎలా?                                                                

 నిన్న వై.యస్.ఆర్. పార్టీ అద్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు మీడియా ప్రకటణ ఒకటి ఏర్పాటు చేసి అందులో తన బవిషత్ కార్యా చరణ గురించి చెప్పారు. ఆయన చెప్పిన దానిలో అన్నీ రోటిన్ గా ఉన్నవే అయినా గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరెంద్ర మోడి గారి గురించి చేసిన వ్యాఖ్యలు కొంచం ఆశ్చర్యాన్ని కలిగించాయి.

 ఆయన ద్రుష్టిలో మోడి గారు గొప్ప అడ్మినిస్త్రేటర్ అట! కానీ అయన గరి మత చాందసమే ఆయనలోని నచ్చని గుణం అట!ఈ మాటలు అన్న జగన్ గారికి అసలు మోడి గారి గురించి తెలుసా లేదా అనే అనుమానం కలుగుతుంది. ఏ మత చాందస వాది అయిన అన్ని వర్గాల ప్రజలతో శబాస్ అని పించుకోవడం కష్టం. కానీ మోడి గారు గుజరాత్ లోని అన్ని వర్గాల ప్రజ ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఆయన పక్కా హిందూ వాది. ఆయనలోని ఆ హిందూ తత్వమే ఆయన్ని నిజమైన "సెకులరిస్ట్" గా ఉండేలా చేస్తుంది అనడం లో అతిశయోక్తి ఏమి లేదు.

 హిందూ అనే జీవన విదానం సర్వ ఆరాదనా పద్దతులను సమానంగా ఆదరిస్తుంది. ఇందులో వైష్ణవం, శైవం, గాణపత్యం, శాక్తేయం, సాయిబాబీయం,అయ్యప్పేయం,బుద్దిజం, జైనిజం, సిక్కిజమ్ లాంటి శాఖలు ఉన్నాయి. వీరంతా తమ తమ దేవుళ్ళను ఆరాదించుకుంటూ ఒకరితో ఒకరు కలసి మెలసి జీవించడమే నిజమైన హిందూయిజం.అలాగే ఇతర దేశాల నుండి వచ్చిన ముస్లిం లు సైతం తమ ఆరాదనా పద్దతులను ఆచరిస్తూ, మొదట్లో బలవంతంగా  ప్రజలను మత మార్పిడులకు గురి చేసినా కాల క్రమేనా దానిని విడ నాడి ఈ దేశ సంస్క్రుతి లో బాగమయ్యారు. కానీ ఆంగ్లేయుల ద్వారా ఈ దేశం లోకి ప్రవేశ పెట్ట బడిన క్రిష్టియన్ మతం వారు మాత్రం ఇంకా "మత మార్పిడులను" ప్రొత్సాహిస్తూ హిందూ జీవన విదానాన్ని చిన్నా బిన్నం చేస్తున్నారు.దానికి ప్రబల ఉదాహరణ మన దివంగత ముఖ్యమంత్రి గారి సమయంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన వేలాది మంది "బాప్తిజం" తీసుకోవడమే. ఒకప్పుడు హిందూ సంస్క్రుతి పరిరక్షణకు కంకణ బద్దులు అయిన ఆ సామాజిక వర్గం వారు, నేడు అన్య మతం లో చేరడానికి కారణం ఏమిటి? మత మార్పిడి ముసుగులో విదేసి సంస్క్రుతిని ఈ దేస ప్రజల మీద రుద్దడం కాదా? అలా చేసిన వారు, వారి వారసులే ఈ రోజు "మోడి" లాంటి నిజమైన సెక్యులరిస్ట్ ను మత చాందస వాది అంటే దొంగే "దొంగా, దొంగా" అని అరచినట్లు ఉంది.

  జగన్ గారి నివాస గ్రుహం పేరు "లోటస్ పాండ్. లోటస్ పాండ్ మీద ఒక పెద్ద గుర్తు ఉంటుంది.అది జిసస్ యొక్క క్రాస్ గుర్తు. అలాగే లోటస్ పాండ్  అనేది కూడా వారి మత సంస్థ అయిన "చర్చ్ ఆప్ సౌత్ ఇండియా" యొక్క అదికారిక చిహ్ణం అయిన  కమలం, క్రాస్ కి గుర్తుగా ఆ పేరు పెట్టారు. ఇలా తాము నివసించే గ్రుహానికే మత చిహ్నం  పెట్టుకున్న వారు సెక్యులరిస్ట్ నాయకులు ఎలా అవుతారు? ఒక్క హిందువులకు  తప్పా, తాము సెక్యులరిస్టులము  అని చెప్పుకునే అర్హత ఏ మత వాదులకు లేదు. కారణం హిందూయిజమే  ఈ దేశపు  సెక్యులరిజం బావానికి పునాది. ఒక్క చిన్న ఉదాహరణ చెపుతాను. మనం వారి కోసం చర్చ్ కి వెళతాం. వారిని మన గుళ్ళకి రానిస్తారా? మన మిత్రుల కోసం "హలాల్" చేసిన మాంసం తినే మత సామరస్యం మనది. ఇంతకు మించిన సెక్యులరిజం ఏముంది? మన రక్తం లో సెక్యులరిజం ఉంది. కాబట్టి జగన్ గారు లాంటి మత వాదులు సెక్యూలరిజం గురించి చెప్పడం హాస్యా స్పదం.

  జగన్ గారికి కేంద్రం లో సప్పొర్ట్ ఇచ్చే వారు అవసరం. వారి మీద ఉన్న కేసులు ద్రుష్ట్యా ఆయనకి కేంద్రం లో అధికారం చేపట్ట బోయే పార్టీలతో సఖ్యత అవసరం. ఇప్పుడు దేశం లో మోడి గారీ గాలి వీస్తుంది. కాంగ్రెస్ అధికారం లోకి వస్తుందన్న గ్యారంటీ లేదు. అందుకే బి.జె..పి. తో వైరం క్షేమదాయకం కాదు అని బావించి "మోడి" గారిని ప్రశంసిస్తున్నట్లుంది. కానీ ఆయనలోని మత వాది మోడి గారీ లోని హిందూ ని సహించలేకపోతున్నాడు. అందుకే మోడీ గారిని "సెక్యులర్ ఫోరం" ఏర్పాటు చేయమని హాస్యాస్పదమైన సలహాలు ఇస్తున్నాడు. దాని బదులు తామే "మత మార్పిడులను" ఆపు చేయించ గలిగితే, లేదూ తమ పార్టీ  మానిపెస్టోలో మతమార్పిడులను అరికట్టే చట్టం తీసుకు వస్తాం అని చెపితే ఆయన చెప్పే సెక్యులరిజం ని కొంత అయినా నమ్మడానికి వీలుంటుంది.

  జగన్ గారికి ఆంద్రాలో సీట్లు కావాలి. వాటిని చూపించి కేంద్రం లో అధికారం లోకి వచ్చే వారితో బేర సారాలు కుదుర్చుకుని తనను కేసుల నూండి బయట పడేసే కండిషన్ తో మద్దతు ఇస్తాను అని అనవచ్చు. అలా ఆయన సమస్యల నుండి బయట పడే ముందు చూపుతో చేస్తున్న పనే "మోడీ’ గారిని పొగడటం. చూదాం ఆంద్రా ప్రజలు ఇవ్వబోయే తీర్పు ఎవరికి లాభిస్తుందో?            

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )