ఉప్పెనతో ఊళ్లు కొట్టుకుపోతుంటే,'ఉత్సవ సభకు 'రమ్మంటునాడు 'ఉత్త'రాకుమారుడు !.

                                                        

 ఈ   రోజు  టి.వి. చానళ్ళు చూసారా , 'ఊరిదంతా ఒక దారి అయితే ,ఉలిపికట్టెది ఇంకో దారీ' అన్నట్లు ఉంది ,ఒక చానల్ వారు చెసే ప్రసారాలు చూస్తుంటే . అన్ని చానల్లోను సింహబాగం ,గత మూడు రోజులుగా రాష్ట్రాన్ని ముంచెతుతున్న వర్షాలు, వాటి వలన ప్రజలకు కలుగుతున్న కష్ట నష్టాలు గురించి ప్రసారం చేస్తుంటే , ఒకే ఒక చానల్ మాత్రం హైదరాబాద్లో జరుగబోతున్న "సమైఖ్య శంఖారావం " సభ గురించి ప్రసారాలు చేస్తుంది.

           "ఉప్పెనలా కదలి రండి"
           "ఊరువాడాఏకమై రండి"
           "తెలుగుతల్లి విలపిస్తుంది "
           "తెలుగువాడి వేదన కంటే తెలుగు తల్లి బాదే ముఖ్యం"
           "తెలుగు తల్లి పిలుస్తుంది !రా! కదలి రా! "

 ఇలాంటి  స్లోగన్ లతో ఆ చానల్ ఊదర గొడుతుంటె , చూసే వారికి ఏమనాలో అర్దం కావటం లేదు. బాషలు, ప్రాంతాలు, మనుషులకే కానీ, తనకు ఆ బేదబావమేమి లేదన్నట్లు ,ప్రక్రుతి పగబట్టిన దానిలా ఆంద్రప్రదేశ్ ను వర్షాలతో అతలాకుతలం చేస్తోంది. అటు సీమాంద్రలోనే కాక ,ఇటు తెలంగాణాలోను వాగులు, వంకలు ఏకమై ,ప్రజలకు గత మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి . వాతావరణ శాఖ  వారేమో ఇంకా మూడు రోజుల  రోజులపాటు రాష్త్రంలో బారీ నుంచి అతి బారి వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడిదాకా బాగున్న వరి, పత్తి  పైరులు ఈ  వర్షం దెబ్బతో పూర్తిగా పాడై  పోయి రైతులకు గుండె చెరువై పోతుంది . మొన్నఇంటర్నేషనల్ పబ్లిసిటీ తో వచ్చి పోయిన "పైలిన్" తుపాన్ కేవలం రెండు జిల్లాల మీదే ప్రభావం చూపితే , ఏ మాత్రం పబ్లిసిటీ లేని ఈ  వాయుగుండం మాత్రం తెలుగువారికి చెప్పరాని కడగండ్లు మిగిల్చింది. ఇంకా మిగల్చబోతుంది .

  మరి ఒక పక్క ప్రక్రుతి ఉప్పన అయి మీద పడుతుంటే , ప్రజలను 'ఉప్పెనలా 'వారు పెడుతున్న సభకు రమ్మని పిలుపునివ్వడం, మీ బాదలు కంటే "తెలుగు తల్లి బాద ముఖ్యం " అని, విపత్కర వేళలో వారి సభ పెడుతున్న ఉద్దేశ్యాలను సమర్దించుకో బోవడం ఏ మాత్రం బావ్యం కాదు . రాజకీయాలు చేయొచ్చు. రాజకీయ పార్టిల మనుగడ వారు చేసే రాజకీయాల బట్టె ఉంటుంది . అది ఎవరూ కాదనలేరు . కానీ వారి పార్టీకి తప్పా , తెలుగు జాతికి మేలు చేసే పలితమివ్వని "సభ" ను ఈ ప్రక్రుతి విలయ  కాలంలో నిర్వహించడం అవసరమా?

సమైఖ్యాంద్రా కోసం సీమంద్రా ప్రజలు పరితపిస్తున్నారని , డిల్లీ లోని పాలకులకు తెలియచెయ్యడం లో సీమాంద్రా ప్రజలు, ఉద్యోగులు తమ ఉద్యమాల ద్వారా క్రుతక్రుత్యులయ్యారు. అటు అయిదు కోట్ల ప్రజలు సమైఖ్యాంద్రా కోరుకుంటుంటే, ఇటు నాలుగు కోట్ల మంది తెలంగాణ కోరుకుంటున్నారని కేంద్ర పెద్దలు గ్రహించారు . అయినా సరే కేంద్రo ఒక నిర్ణయం తీసుకుంది . ఎట్టి  పరిస్తితిలోనూ రేపు రాబోయే సోనియా గాందీ గారి పుట్టిన రోజు లోపు "తెలంగాణ" బిల్ ఆమోదం పొందేలా చెయ్యాలని వేగంగా ముందుకు పోతున్నారు. మరి ఇటువంటి సమయంలో , పది లక్షలు కాదు కోటి మంది తో "సమైఖ్య శంఖరావం " పూరించిన కేంద్రం వెనక్కు తగ్గుతుందా? ఆ మాత్రం తెలియదా పార్టీని నడిపించేవారికి! మరి ఎవరి కోసం  ఈ  "బదిర శంఖారావం ".

   ఇటువంటి చర్యలను చూస్తుంటే , రేపు ప్రజలు వరదలొచ్చి కొట్టుకు పోతున్నా , కొట్టుకుపోతున్న వారి వద్దకు వెళ్లి వోట్లు అడగటానికి కూడా  ఏ మాత్రం సంకోచించరు అనుకుంటా. ఈ  తరహ  రాజకీయాలు, రాష్ట్రం లో దిగజారిన రాజకీయాలకు అద్దం పడుతున్నాయి అనుకోవచ్చు.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!