చేసే పూజలు "బతుకమ్మా, దుర్గమ్మా" అని, కానీ దీవీంచేది మాత్రం "చావమ్మా" అనా!



   మనకు దసరా నవ రాత్రులు వచ్చినవంటే అందరికి ఎంతో ఆనందం. అటు ఆంద్రాలోనూ, ఇటు తెలంగాణ లోనూ దసరా చాలా ముఖ్యమైన పండుగయే! ముఖ్యంగా ఈ పండుగ స్త్రీ శక్తి కి ప్రతీకగా "దుర్గా మాత ఆమె అవతార రూపాలైన వివిద శక్తులను పూజిస్తూ హిందువులు ఎంతో భక్తి ప్రపత్తులతో మెలగుతారు.                                                                   
          తెలంగాణ ప్రాంత స్త్రీలు వారిచుట్టుపక్కల పూసే గుమ్మడి, గునుగు, తంగేడు, కట్లపూలు, గన్నేరు పూలతో బతుకమ్మలు పేరుస్తారు. గుమ్మడిపువ్వులోని పచ్చని పుప్పొడిని పసుపు గౌరమ్మగా భావిస్తారు. భక్తిక్షిశద్ధ ప్రధానం కానీ, మిగతా శిష్టులు చేసే ఉపాసనలతో వీరికి పనిలేదు. అమ్మా! నీవీ రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు గెలిచి బతుకమ్మా! అని బతుకమ్మను కోరుకుంటారు. . అదే వివిధ రకాల వాయినాల నైవేద్యం. ఒక్కొక్కరు ఒక్కో పదార్థాన్ని చేసి తెచ్చి బతుకమ్మకు నివేదించి, స్త్రీ మూర్తులనే దేవీమూర్తిగా భావించి వాయినాలిచ్చుకుంటారు. బలాన్నిచ్చే నువ్వులు, బెల్లంతో నూలు ఉండలొకరోజు, సేవలడ్డూలు, పాయసం, దోసకాయ, పెసరపప్పు (నానపెట్టింది), పెసరపప్పు వేయించి, పిండిచేసి, చక్కెర, నెయ్యితో మూదాడి పిండిముద్దలు (పెసరుపిండి ముద్దలు) పంచి పెట్టుకుంటారు. చివరిరోజు సప్తి సద్దుల బతుకమ్మ. లలితా స్తోత్రంలో చెప్పినట్లు చిత్రాన్నం (రకరకాల కూరగాయలతో) పులిహోర, గుడాన్నం (బెల్లపన్నం), దధ్యోజనం (పెరుగన్నం) ‘పాయసాన్న ప్రియాత్వక్ స్థాపశులోక భయంకరీ, గుడాన్న ప్రీతమానసా, దధ్యన్నాసక్త హృదయా, హరివూదాన్నైక రసికా’ అంటూ శిష్టులు స్తుతించిన విధంగా, స్త్రీలు, జానపదులు, పామరులు అన్నాన్ని అనేక రకాలుగా అమ్మకు నివేదిస్తారు. ‘అన్నదా వసుధా వృద్ధీ!’ వసధులో శక్తిరూపిణిగా ఉండి ధాన్యరూపంలో మనకాహారన్నందించే తల్లికి ఆమె ఇచ్చిన వస్తువులనామెకే ‘పత్ర పుష్ప ఫలతోయ’ అని అర్పిస్తారు. బతుకమ్మ ఆడవచ్చిన ముత్తైదువలకు వాయినాలిచ్చుకుంటారు. ఈ విదంగా ఈ సామూహిక పూజ చేసి స్త్రీ ఐక్యతను చాటు తారు.అదే విదంగా విజయవాడ లోని కనకదుర్గమ్మను కూడా ఆ ప్రాంత స్తిలు ఎంతో భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. ఈ తొమ్మిది రోజులు తల్లిని రోజుకొక రూపం లో అలంకరిస్తూ, నిత్యం ఆ తల్లి దర్శనం చేసుకుంటూ అంతులేని అలౌకిక ఆనందం ని పొందుతుంటారు.

                                                                           


  అంతా బాగానే ఉంది. కానీ ఒక దురద్రుష్టకరమైన విషయం ఏమిటంటే ఆ స్త్రీ ప్రతీకాత్మక శక్తులును పూజిస్తూ స్త్రీ అంటే పురుషులతో పాటు ఆరాద్యనీయురాలు అని బావించే ఈ రాష్ట్రం లోని స్త్రీలు ,అదే ఆడపిల్లల పెంపకం దగ్గరకి వచ్చే సరికి బాగా వివక్షత చూపుతున్నారు అని సామాజిక గణాంకలు చెపుతున్నాయి. ఉదాహరణకు తమ బందువులు ఎవరైనా ఏక్సిడేంటుల్లో కాని, మరే కారణాల చేతనైన మరణించినపుడు , వారి పిల్లలు అనాదలుగా మిగిలిపోయినప్పుడు వారిని చేరదీసి పెంచుకోవడానికి ముందుకొచ్చే బందువుల్లో ఎక్కువుగా అబ్బాయిలనే తీసుకువెళుతున్నారట! ఆడపిల్లల్ని తీసుకోవడానికి స్త్రీలే ముక్కులు మూతులు విరుస్తూ"ఆ..ఇదెందుకు మనకు శని" అన్నట్లు అనాద శరణాలయాలలో పడేసి పోతున్నారట. ఆ విదంగా అనాద శరణలాయల పాలయ్యే వారు మగపిల్లలు ఇద్దరు ఉంటే ఆడపిల్లలు ఎనిమిది మంది ఉంటున్నారట. అసలు చేరదీసి పెంచే ఆలొచన లేకపోతే అది వేరే విషయం. కానీ బందువుల పిల్లల్ని చేరదీసే విషయం లో కూడా  లింగ వివక్షత ,అదీ మరీ స్త్రీలలోనే ఎకువుగా ఉండటం అంటే "స్త్రీకి స్త్రీయే శత్రువు" అనే నానుడి నిజమే అనిపిస్తుంది.

   ఆడపిల్లల్ని ఆదరించలేని వారు, వారి పట్ల వివక్షత చూపే వారు, వారిని హింసించి ఆనందించే వారు, వేదించే వారు ఎంతగా బతుకమ్మ పూజ చేసినా,
మరెంతగా దుర్గమ్మ తల్లిని కొలిచినా వారు చేసే పూజలు పలించవు గాక పలించవు. మీ మనసులో ఉండే ఆ  "లింగ వివక్షత" రాక్షసుడ్ని సంహరిస్తే తప్ప ఆ ఆదిశక్తి మీ గుండెల్లో కొలువుండదు.అట్టి రాక్షస సంహారం చేసిన రోజే మన జాతికి నిజమైన "దసరా" పందుగ. అప్పుడే కదా  తెలుగు ఆడబిడ్డకు "బతుకమ్మా" అనే జాతి దీవెన లభీంచేది!    

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!