ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )
మా తండ్రి గారు కీ.శే. మద్దిగుంట తిరుపతయ్య గారిది క్రిష్ణా జిల్లాలోని కవులూరు అనే గ్రామం. అయన ఒక వెనుక బడిన తరగతికి చెందిన వ్యక్తి.ఆయన తాతలు గుంటూరు జిల్లాలో బ్రాహ్మాణులు కు "అగ్రహారాలు దానం చేసిన చరిత్ర ఉన్నా , కాల క్రమేనా ఆస్తులు హరించుకు పోవడం చేత, మా తాత గారు కవులూరులో బందువుల దగ్గరికి వచ్చి వ్యవసాయ కూలీగా జీవనం సాగించారు.
Sri Maddigunta Thiruapataiah Residence |
మా తండ్రి గారు ,ఆయన తర్వాత ఏడుగురు ఆడపిల్లల్లు. మా తాతగారు కేవలం ఒక అమ్మాయి పెళ్ళి మాత్రమే చేసిన తరవాత కాల దర్మం చెందడం వలన , కుటుంబ బారం మా తండ్రిగారి మీద పడింది.ఆయన తన మేన మామ కూతురైన మా అమ్మ గారిని వివాహ మాడి, వారివురు తమ రెక్కల కష్టం మీదనే అంత సంసారాన్ని ఈది ఆడ పిల్లల పెండ్లిల్లు చేసారు.ఆ సమయం లో మా నాన్న గారు "కమ్మ్యునిస్ట్" పార్టీ లో సబ్యులు.
ఆ తర్వాత కవులూరులోని కొంతమంది కలప వ్యాపారస్తులు ఖమ్మం జిల్లాకు వస్తుంటే వారితో పాటు మా నాన్న గారు కూడ వ్యాపారం చెద్దామని ఖమ్మం జిల్లా వచ్చారు. కాని స్నెహితుల మోసo తో,నష్ట పోయి, వెనుతిరిగి వచ్చిన్న మా నాన్న గారిని , మా అమ్మ గారు ప్రోత్సాహపరచి, మరి కొంత డబ్బుని ప్రోగు చేసి ఇవ్వగా , తాను స్వయంగా వ్యాపారం చెయ్యడానికి తిరిగి ఖమ్మం జిల్లా వెళ్ళారు.
( Garloddu Lakshmi Narasimha Swamy History in Alaya Darsini Magazine ) |
ఆ తర్వాత " గార్ల వడ్డు" గ్రామం చుట్టు ప్రక్కల ఉన్న మొత్తం అడవిని అప్పటి జమిందారుల వద్ద లీజ్ కు తీసుకుని అందులోని కలపను నరికించి విజయవాడకు ఎగుమతి చేస్తూ, వ్యాపారాన్ని కొన సాగిoచారు . మా వంశ ఆచారం ప్రకారం మాది శైవ మతం.అలాగే గార్ల వడ్డులో వ్యాపారం మొదలు పెట్టడానికి తగిన స్తలం గురించి వెతుకుచుండగా , ఒక రోజు మా నాన్న గారి స్వప్నంలో" శ్రీ వీర బ్రహ్మేంద్రుల స్వామి" వారు సాక్షాత్కరీంచి " నాయనా తిరుపతయ్యా, ఈ ప్రాంతం(మా నాన గారు నిద్రించిన స్తలం ) చాల పవిత్రమైనది. నీకు అన్ని విదాల శుభం కలగాలంటే ఇక్కడే నీ వ్యాపారం ప్రారంభించు" అని చెప్పి అంతర్థానమయ్యడు.మా నాన్న గారికి అంతా వింతగా అనిపించి ఎదైతే అదే అయ్యిందనుకొని అక్కడే ఒక పూరి పాక వేసుకుని, భావిని తవ్వించి, ఒక కంపెని " శ్రీ వీర బ్రహ్మేంద్ర & గౌరి శంకర్ ఫ్యూయల్ సేల్స్ డీపో" పేరు మీద, మరొకటి "శ్రీ పార్వతి పరమేశ్వర టింబర్& n చార్కోల్ సేల్స్ కం. పెరు మీద వ్యాపారం మొదలు పేట్టి కొనసాగిస్తుండగా ఒక విచిత్రం జరిగింది. .
ఒక నాగు పాము మా ఇంటి వద్ద నున్న పుట్ట వద్ద నుండి మా కలప నిల్వ ఉంచే ప్రాంతం దగ్గర ఉన్న ఒక పెద్ద "శిల" నానుకుని ఉన్న పుట్ట లోనికి తరచుగా వెళ్ళడం గమనించారు. అదంతా అటవీ ప్రాంతమే కాబట్టి ఆ రెండు పుట్టలూ ఆ పాము నివాసం ఏమో అనుకుని ఊరుకున్నారు. కాని అదే పాముకు సంబందించి రెండు మహిమా అద్బుతాలు జరిగేసరికి అక్కడ ఉన్న శిల , దానినానుకుని ఉన్న పుట్టను గురించి కొంత మంది స్తానికి పనివాళ్ళను అదుగగా, ఆ "శిల" శ్రీ లక్ష్మి నరసింహా స్వామి అని కొంత మంది దణ్ణం పెడతారని, ఆ విషయం గూర్చి జమిందారుకు చెప్పినా వారు పట్టించుకోలెదని, అంద్కే ఆ స్వామి ఎండకు ఎండ్తూ వానకు తడుస్తూ, అలా శిల గానే ఉన్నాడని చెపితే మా నాన్న గారికి ఆశ్చర్యం వేసిందట. ఆ నాగు పాము గురించి, ఆ స్వామి గురించి ఆలోచిస్తూ పడుకున్న మా నాన్న గారికి తిరిగి " శ్రీ వీర బ్రహ్మేంద్రుల స్వామి" వారు కలలో కనపడి " ఆ క్షేత్రం గొప్ప పుణ్య క్షేత్రం అని " శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వారికి గుడి కట్టించ మని ఆదేశించారట. ఆ విదంగా మా నాన్న గారికి స్వామి మీద గొప్ప భక్తి కల్గి అయనకి మహా భక్తుడిగా మారటంఏ కాక అక్కడే పుట్టిన నాకు ఆ స్వామి పేరు పెట్టడం , ఆ స్వామి గుడీ, మా బంగళా ఒకే రోజున ముహుర్తం నిర్ణయించి,నిర్మాణాలు పూర్తిచేయించి,ఒకే వారంలో అటు సమారాదన , ఇటూ గ్రుహప్రవేశం చెయ్యడం ,ఆ తర్వాత ఆ స్వామి అనుగ్రహం వల్ల బాగా కలిసి వచ్చి జమీందారు తర్వాత జమీందారుగా పేరు గాంచాడమే కాక ఆయన స్వయం తెలివి తేటలతో ఖమ్మం జిల్లలోనే ఒక పారెస్ట్ కాంట్రాక్టర్గా ,పేరు గాంచాడు . అంతే కాదు తను చదివింది నాలుగో తరగతి అయినప్పటికి,న్యాయస్తానలలో తన కేసు లను తానే స్వయంగా వాదించుకుని గెలిచి, అటు న్యాయ మూర్తుల చేత, ఇటు న్యాయ వాదుల చేత శబాష్ అనిపించుకున్న మేదావి.
దీనికంతటికి కారణం తను నమ్మిన మా ఇల వేలుపు శ్రీ లక్ష్మి నరసింహా స్వామి దయ అని మా నాన్న గారి నమ్మక్కం . మేమూ ఆ నమ్మకానే కలిగిఉన్నాము.ఇది ఒక నాస్తికుడు ఆస్తికుడిగా మారిన నిజ జీవిత గాథ. ఇంకా శ్రీ వీర బ్రహ్మేంద్రుల స్వామి" వారు మా నాన్న గారికి చెప్పిన్న విశేషాలు ఉన్నప్పటికి అవి ఇంకొక సారి వివరంగా టపా పెడతాను,నాగ దేవత మహిమల వివరాల గురించి మా తల్లి తండ్రుల ద్వారా విన్న వారి ప్రత్యక్ష అనుభవాలు చెపుతాను
Maddigunta Narasimha Rao,Arunakumari (Present Founder Trustee Couple) |
నాగు పాములకు మహిమలు ఉంటాయని మనం పురాణాలలో చదివాము.ఎన్నో సినిమాలు ఈ నేపద్యంలో తీసారు.హిందూ దేవుళ్లలో నాగ దేవతకు ప్రత్యేక స్తానం ఉంది.మన జాతి చరిత్ర ప్రకారం మనం "నాగ వంశం" నకు చెందిన వారమని చెపుతారు.ముఖ్యంగా దీపావళి పందుగ తర్వాత వచ్చే చవితి ని "నాగుల చవితి" గా మనం పందుగా చేస్తాం. ఆ రోజు పుట్టలో పాలు పోసి,స్త్రీలు పాటలు పాడి, భక్తితో నాగేంద్రుని కొలుస్తారు.సరే అన్నిటి వలే ఈ నాగ దేవతవిషయమ్ లో కూడ సైన్స్ చెప్పేది వేరుగా ఉంటుంది.ఎవరో చెప్పటం వేరు, ప్రత్యక్షంగా మనకు ఆ స్వామి మహిమలు అనుభవంలోకి రావటం వేరు. అటువంటి మహిమలు స్వయంగా చూసిన దన్య జీవులు కీర్తి శేషులైన మా తల్లి తండ్రులు "శ్రీ మద్దిగుంట తిరుపతయ్య మరియు శ్రీమతి మద్దిగుంట సరస్వతి గారలు.
మా తండ్రిగారి అనుభవం:- ఆయన గారు ఒక రోజు మా చేల వద్ద నుండి ఇంటికి తిరిగి వస్తూండగా,మా ఇంటి దగ్గరకు వచ్చే సరికి హటాత్తుగా ఒక నాగు పాము రోడ్డు ను క్రాస్ చేసి వెళుతుండగా, అప్పూడె అటుగా వస్తున్న కారు దాని మీదుగా వెళ్లడం జరిగింది. అయ్యో,అయ్యో, అని మా నాన్న గారు అనుకునే లోపునే ఆ పాముకు ఏమి జరుగకుండానే సురక్షితంగా ఆవలి వైపుకు వేల్లడం జరిగిందట.కాని విచిత్రంగా,ఆ కారు కొద్ది అడుగుల ముందుకు పోయాక హట్టాతుగా ఆగి పోవడం,దానిలోనుంచి డ్రైవర్, కారులోని వారు దిగి కారును పరీక్షించగా వారికి కారులో ఎటువంటి ఫాల్ట్ కనిపించక అయోమయంగా చూచుచుండగా, మా తండ్రి గారు "ఎందుకలా పాము మీద నుండి కారును నడిపావు" అని డ్రైవర్ను గద్దించగా, తాను చూచుకోలేదని మొదట బుకాయించిన, చివరకు తాను కావాలనే కారును పాము మీద నుంచి పోనిచ్చానని ఒప్పూకున్నడట.అప్పుడు మా నాన్న గారు"అది మహిమ గలదై ఉంటుంది.ఎందుకైనా మంచిది దండం పెట్టుకోమని చెప్పగా ఆ డ్రైవర్,ఆ విదంగానే చెయ్యడం, ఆ కారు యదా విదిగా స్టార్ట్ ఐయి వేళ్లడం జరిగింది.
అప్పట్టి నుండి మా నాన్న గారు ఆ పామును దేవత గా భావించారు. ఆ తరవాత మా అమ్మ గారి కి కూడా వేరోక రూపంలో అదే ,పాము మహిమ కన్పదేసరికి,అప్పటి నుండి అ పామును దేవతా పాముగా బావించి పూజలు చేస్తుందే వారు.
మా ఇంటి దగ్గరి పుట్ట
మా అమ్మ గారి అనుభవం:-మా నాన్న గారి అనుభవం గురించి మాఅమ్మ గారికి చెప్పక పోవటం వలన,ఒక రోజు అదే పాము మా ఇంటి దగ్గర ఉన్న తన పుట్టలోకి వెళ్లడం చూసిన మా అమ్మ గారు,నాగు పాము విష సర్పం కాబట్టి దాని వలన మనుషులకు గొడ్లకు ఎప్పటికైనా ప్రమాదమని బావించి,జీతగాళ్లని పిలిచి పుట్టను తవ్వి పామును చంపవలసినదిగా ఆదేశించిండం జరిగింది.వెంటనే మా జీత గాళ్లు,పుట్టను తవ్వటం ప్రారంభించగా,లోపలనుండీ పాము బుసలు పెట్టడం జరిగింది. ఆ వెంటనే మా అమ్మ గారు స్ప్రుహ తప్పి పడి పోగా,జీతగాళ్లు కంగారుపడి పుట్ట తవ్వడం ఆపుచేసి,మా నాన్న గారికి కబురందిచగా,ఆయన వచ్చి,విషయంతెలిసికొని,ఇది ఆ నాగ రాజు మహిమాగా బావించి, ఆ స్వామిని ప్రార్థించగా, మా అమ్మ గారు యదాస్తితికి వచ్చారట.
పై రెందు ద్రుష్టాంతలతో, మా తల్లి తంద్రులకు ఆ సర్పం దేవతా సర్పంగా బావించి నిత్యం కొలిచే వారు.ఆ సర్పం ఒక్క పుట్ట మా ఇంటి ప్రక్కనే ఉన్నప్పటికి ఎవరూ భయపడకుందా బక్తి బావాలతో మెలిగే వారు.ఆ సర్పం మా ఇంటి దగ్గరున్న పుట్ట నుండి తరచూ మా ఇల వేలుపు శ్రీ లక్ష్మి నరసింఃఅ స్వామి ఆలయంలోకి వెళ్ళడం చూసిన మా నాన్న గారు తమను కాపాడుటకు తమ ఇలవేలుపే ఆ సర్ప రూపంలో తిరుగాడుతున్నాడని విశ్వసించే వారు.ఆ నమ్మకముతొనే "సూర్య జయంతి"అయిన "రథసప్తమి" నాడు జన్మించిన నాకు,నా పేరును ఇద్దరి దేవుళ్ల పేరు కలిసి వచ్చేలా "శివ నాగ నరసింహా రావు" అని పెట్టడం జరిగింది.కాని ఖమ్మం స్కూల్లో జాయిన్ చేసేటప్పూదూ మా అన్నయ్య గారు రికార్డుల్లో నా పేరును కేవలం "నరసింహా రావు" నమోదు చేయించ బట్టి, అదే స్తిరపడి పోయింది.
నాకు 4 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లల చదువుల నిమిత్తం మేము గార్లవొడ్డు నుండి ఖమ్మం రావడం జరిగింది. మా అమ్మ గారు నాన్న గారు మాత్రం అక్కడే వుండి వ్యవసాయ వ్యాపారాలు చూసుకునేవారు. ఆ స్వామి దయ వలన మా నాన్న గారు పట్టిందల్ల బంగారమఈ సుమారు 140 ఎకరాల భూ స్వామి కాగలిగారు.సుమారు 2౦౦ మంది పనివాళ్ళతో,14 మంది జీతగాళ్ళతో,నిత్యం మా ఇల్లు ఉన్న ప్రాంతం ఒక చిన్న ఊరిలాగౌందేది.అసలు ఊరు చాలా లోపలికి ఉండెది. మా ఇల్లు మా చేలలో కట్టబడి ఊరికిదూరంగా ఉండేది.ఆవిదంగా మా కర్ర వ్యాపారం కూడ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లడానికి "నాగేంద్ర స్వామి" తిరుగాడిన ప్రాంతం"మరియు శ్రీ లక్ష్మి నరసింహా స్వామి" ఉన్న ప్రాంతం లో మేము ఉండటమే అని మా తల్లి తండ్రుల విశ్వాసం.అందుకే వారు శ్రీ లక్ష్మి నరసింహా స్వామి"కళ్యాణంతో పాటు,ప్రతి "నాగుల చవితి"ని ఘనంగా జరిపెవా రు. వారు పాటించిన ఆచారాన్నే మా కుటుంబ సభ్యులం నేటికీ కొనసాగిస్తున్నాం .
అదండి మా ఇల వేల్పుల మహిమలు మరియు గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయ చరిత్రకు సంబందించిన మహిమాన్విత అంశములు . మా నాన్న గారు సత్య సందుడు.అయన అబద్దం చెప్పగా నేను వినలేదు. ఈ విషయాలన్ని ఆయనే స్వయంగా చెప్పారు. మా జీతగాళ్లు కూడ తరచుగా ఆ మహిమలను తలచుకునే వారు. అందుకే నేను అంత రూడిగా చెప్ప గలుగుతున్నాను.ఈ నాడు మా ఇలవేల్పు అయిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం దిన దిన ప్రవర్ధమానుచుండగా అట్టి దేవాలయానికి నేను వ్యవస్థాపక ధర్మకర్తగా 2000 సంవత్సరం నుండి పదవి బాధ్యతలు నెరవేరుస్తూ , ఆ దేవదేవుని సేవలో నిరంతరం తరిస్తూ ఉండడం నిజంగా నా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తూ ఉన్నాను. దేవాలయం నిర్మించినది మొదలు 1992 వరకు మా తల్లితండ్రులు ప్రతి ఏటా నరసింహ స్వామీ వారి కళ్యాణం చేయడం మా ఇంటి ఆచారంగా వాస్తు ఉండగా , మా వివాహమైన తర్వాత అట్టి పవిత్ర కార్యక్రమ బాధ్యతను మా తండ్రి గారు మాకు అప్పగించారు. దానిని ఏంతో పవిత్రభావంతో స్వీకరించిన మా దంపతులు 1993 నుండి నేటి వరకు ఆ స్వామీ కళ్యాణం జరిపే సాంప్రాదాయంని కొనసాగిస్తున్నాం . అంటే 1964 నుడి నేటి వరకు మా కుటుంబం లోని రెండు తరాల వారం స్వామీ వారి కళ్యాణ0 జరుపుతూ ఉండడం , ఆ దేవదేవుడు మాకు ఇచ్చిన అదృష్టం గా భావిస్తున్నాం. అంటే కాక స్వామీ వారి దేవాలయం పునరుద్ధరణ జరిపినాక అంటే 2000 సంవత్సరం నుండి నేటి వరకు ఏటా మా దంపతులు స్వామీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిపె 5 రోజుల యజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మాకు సాంప్రదాయంగా మారింది. దీనిని కూడా మా ఇలవేల్పు మాకు అప్పగించిన పవిత్ర బాద్యతగానే భావించి క్రమం తప్పకుండా దానిని నిర్వహిస్తున్నాం .
బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తున్న సందర్భం |
యాజ్ఞికులవారు మా దంపతులను ఆశీర్వదిస్తున్న వేళ |
పుష్ప యాగం
దేవాలయ సిబ్బందికి వస్త్ర ప్రదానం
స్వామీ వారి కళ్యాణం రోజున ప్రధమంగా మా ఇంట్లో (ఆశ్రమం ) లో తోరణపాకు కడుతున్న వేళ
ఆ విధంగా మేము యజ్ఞములు చేయుచుండగా ఒక పర్యాయము లక్ష్మి నరసింహ స్వామీ వారు యజ్ఞములో తన పర్యాయ రూపమైన గండభేరుండ స్వామీ వారి రూపములో ప్రత్యక్షమయ్యారు . ఆ మరుసటి సంవత్సరమే నాగేంద్ర స్వామీ వారు కూడా సర్పరూపములో యాగములో దర్శనమిచ్చారు . ఇది నిజంగా మా ఇలవేల్పులు మమ్ములను అనుగ్రహించిన విధంగానే మేము భావించటం జరుగుతుంది . దానికి సంబందించిన చిత్రములు క్రింద ఇవ్వబడినవి.
ఆ నాగేంద్ర స్వామీ కి సంబంధించి ఆ పుట్ట వద్ద మేము మాత్రమే కాక మా గ్రామం మరియు చుట్టుప్రక్కల గ్రామాలు వారు కూడా వచ్చి నాగపూజ జరిపి తమకు కలుగుతున్న అనేక కష్టాలు నుండి విముక్తి పొందుతున్నాం అని విశ్వసిస్తున్నారు . వాటికి సంబంధించిన కొన్ని చిత్రాలు,న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లు క్రింది ఇవ్వడం జరిగినది .
జై నాగేంద్ర! జై లక్ష్మి నరసింహా
గార్లఒడ్డు శ్రీ లక్ష్మీ నరసింహా స్వామీ ఆలయం గురించి మరిన్ని వివరలు కొరకు ఈ వీడీయో లింక్ లు మీద క్లిక్ చేసి చూడండి
Garloddu Temple History on ETV
Garloddu Narasimha Swamy Miracles!
జై లక్ష్మి నరసింహా జై జై లక్ష్మి నరసింహా
good article
ReplyDeletenice article. thanks for sharing the post.
ReplyDeleteVisit our website for more news updates TrendingAndhra
good post thanks for sharing Telugu Vilas
ReplyDeleteఆకట్టుకునే the పోస్ట్‌కి ధన్యవాదాలు
ReplyDeleteOnline Breaking News Telugu
Latest English News
Very nice really amazing post thanks for the post keep sharing
ReplyDeleteLatest Bollywood Gossip in Telugu
తెలుగులో బాలీవుడ్ వార్తలు
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగు కొటేషన్స్
ReplyDelete