ప్రస్తుతం భారతానికి ముప్పు కలిగిస్తుంది బ్రాహ్మణ వాదమా ? బజారు వాదమా ?

                   

 
                                                                  
                నిన్న పేస్బుక్ లో ఒక మిత్రుడు జన విజ్ఞాన వేదికకు చెందిన వారు , ఒక  పోస్ట్ ను పబ్లిష్ చెయ్యటం జరిగింది . కొంతమంది పిడివాదులు (జరుగుతున్నమార్పులను గమనించని వారు ), నేటి సమాజం లోని అన్ని సమస్యలకు హిందూ సంప్రాదాయ వాదంలో  ఒక బాగమైన "బ్రాహ్మణ వాదం" మూల కారణమని కాబట్టి దానిని నిర్మూలిస్తే తప్పా బారత దేశం అభివృద్ధి చెందదని పని కట్టుకుని ప్రచారం చేస్తున్నారు . వీరు చేసే ప్రచారాలు ఎలా ఉన్నాయి అంటే "దొంగలు పడ్డ అరు  నెలలకు కుక్కలు మొరిగినట్లు ".

                  ఈ దేశం లో మేజార్టి  ప్రజలు చదువు సంద్యలకు  దూరమై, సమాజం వెనుకబాటు తనానికి ఒక్కప్పటి బ్రాహ్మణ వాదం కారణం కావచ్చు. కాని అది గతo . ఇప్పుడు మన దేశం లో నడుస్తున్నది బ్రాహ్మణ వాదం కాదు . పక్కా బజారు (వ్యాపార) వాదం . ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బులుకు పక్కలు వేసే పక్కా వ్యాపార వాదం . దిని విస్తరణ వల్లే మన సమాజం సర్వ నాశన మవుతుoది . ఈ వ్యాపార వాదాన్ని అడ్డం పెట్టుకునే మన దేశాన్ని విదేశి- యులు తమ పాలనలో మగ్గేటట్లు  చేసారు . వారి వ్యాపార  సామ్రాజ్య విస్త్రుతిలొ బాగంగా వారి సంస్కృతిని , మతాన్ని మన దేశం లో పెంచి పోషించారు . కొంత మంది మహనీయుల త్యాగ పలితంగా మనకు వారి నుండి స్వాతంత్ర్యం వచ్చినా , వారివ్యాపార  సంస్కృతీ , బావజాలాల నుండి బయట పడలేకున్నాం ,సరికదా  విదేశియుల  కంటే స్వదేశి యులే వాటిని ఎక్కువుగా వ్యాప్తి చేస్తున్నారు . వీరికి విదేశాల నుండి వచ్చె సొమ్ము కూడా ఇందుకు బాగా తోడ్పడుతుంది .

          ఈ దేశం లో "విదేశి బావజాలాలు " బాగా వ్యాప్తి చెందడానికి కారణం "కుహన లౌకిక వాదం ". నేను ఎందుకు కుహన లౌకిక వాదం అంటున్నాను అంటే నిజమైన లౌకిక వాదం గురించి మనదేశం లోని ప్రజలకు ముక్యంగా హిందువులకు చెప్పవలసిన పని లేదు . తర తరాలుగా మనం ఆచరిస్తుంది అదే . అందుకే ప్రపంచం లో ఎక్కడా లేని విబిన్న బాషలతో , ఆచార వ్యవహారాలతో , ఆరాధనా పద్దతులతో కూడినా సంస్కృతీ ఉంటుంది ఇక్కడ . ఒక వేళా  హిందూ జీవన విదానం లౌకిక జీవన  విదానం కాక పోయి ఉంటె, ఇంత  వైవిద్యం కలిగిన ప్రజలు వేల ఏండ్లుగా సహజీవనం చేసి ఉండే వారు కారు . కాని స్వాతంత్ర్యం వచ్చాక లౌకిక వాదానికి బదులు కుహనా లౌకిక వాదం ప్రవేశించి ప్రజలను మైనార్టి , మేజార్టి  అనే తరగతులుగా విడగొట్టి, విదేశి సంస్కృతీ ని పాటించే వారికీ తాయిలాలు ఇస్తూ వారి మతాలను బావజాలాలను స్వెచ్చగా వ్యాప్తి చేసుకోవడానికి అవకాశమిచ్చారు .అలాగే స్వమతాన్ని సాంప్రదాయాలను బూతాలుగా చూపిస్తూ , దానినే లౌకికవాదం అని ప్రచారం చేస్తూ ఇన్నాళ్ళు పబ్బం గడుపుకుంటూ వస్తున్నారు .

  ఆ  లబించిన స్వెచ్చ తొ విదేశియులు ఇక్కడి తమ ఏజెంట్ల ద్వారా ప్రజల పేదరికాన్ని అవకాశంగా తీసుకుని , వారిని డబ్బుతో ఇతర సౌకర్యాలతో ప్రలొబపరుస్తో తమ మతంలోకి మార్చడం మొదలు పెట్టారు .  ఈ రాష్టంలో ఒక ముఖ్య  మంత్రి తన సామాజిక వర్గానికి చెందిన వారిని వేల సంఖ్యలో విదేశి మతంలోకి మార్చాడు అంటే కుహనా లౌకిక వాదం ఎంతగా విదేశియులకి కాని, వారి వ్యాపార వాదానికి కాని  ఉపయోగ పడుతుందో తెలిస్తుంది . అలా విదేశి వ్యాపార వాదం ఈ  దేశంలోని సంప్రాదాయ సంస్కృతిని నాశనం చేసి , తమ సంస్కృతిని వ్యాప్తి చేయటానికి గల ఏ  అవకాశాన్ని వదులుకోవడం లెదు. అందులో బాగమే  కుహన విజ్ఞాన వాదం .

  ఈ  కుహాన విజ్ఞాన వాదం ముక్యంగా దేశంలోని హిందూ సంస్కృతీ మీద మాత్రమె  దాడులు చేస్తూ , విదేశి బావజాలాలు , విదేశి మత  బావనలు వ్యాప్తికి పరోక్షంగా సహాయ పడుతుంది . వారికి అందుకోసం విదేశి పoడ్స్ సమకూర్చబడుతున్నాయని అంటున్నారు . వీరు బారత దేశంలో ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు పదే  పదే  వల్లే వేస్తూ , వాటికి కారణం బ్రాహ్మణ వాదం అని చెపుతూ , ప్రస్తుతం అంతగా లేని బ్రాహ్మాణ  వాదం ని దేశం నుండి వెళ్ళ గొట్టాలని పిలుపు నిస్తూ , విస్తరిస్తున్న విచ్చలవిది విదేశి వ్యాపార , మత  వాదాలకు బార్లా దేశ  తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తున్నరు. అందులో బాగమే కొంతమంది చేస్తున్న ప్రకటనలు  .

   గత అరవై ఏండ్లుగా కుహన లౌకిక వాదులు, విజ్ఞాన వాదులు చేస్తున్న కుట్రలు బారత ప్రజానీకం ఇప్పుడిప్పుడే గమనిస్తుంది . అందుకే తమ సాంప్రాదాయ సంస్కృతిలోని చెడును తొలగించుకొని , మంచిని గ్రహించి నవభారత నిర్మాణం కోసం నవతరం ముందుకు సాగుతుంది .ఎ ఎండకు అ గొడుగు పట్టే కుహనా వాదులు కంటే మాట మిద  నిలబడి భారత దేశ  బంగారు బవిశ్యత్ కోసం శ్ర మిసున్న సంప్రాదాయ జాతీయ వాదుల నాయకత్వాన్నే  యువత కోరుకుంటుంది . రానున్న ఎన్నికలలో అ మార్పు స్పష్టంగా చూడవచ్చు . బారత దేశo లోకుహన  లౌకిక వాదుల కంటే సాంప్రదాయ వాదులే  సాంకేతిక విజ్ఞానo ని ఉపయోగించి దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడపటానికి కృషి చేస్తున్నారు . కాని పిడి వాదులు కు ఇది ఇష్టం లేదు . అందుకే వారు ఎప్పుడో జరిగిన వాటిని తవ్వి తీసి ప్రజలలో విష బిజాలను నాటుతున్నారు . ఇప్పుటి  పాలకులులో  బ్రాహ్మణులు కంటే  శూ ద్రులే ఎక్కువుగా ఉన్నారన్న విషయం పిడివాదులు ఉద్దేశ్య పూర్వకంగా విస్మరిస్తున్నారు .అలాగే ప్రజల కళ్ళ కు గంతలు కట్టాలని చూస్తున్నారు . అందుకే సమాజంలో చెలరేగి పోతున్న విచ్చలవిది బజారు వాదాన్ని వదిలేసి ,పూర్వపు వాదాలను విమర్సిస్తున్నారు. దాని వలన ప్రజలు కుహనా వాదులను దూరంగా పెదుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా పిడి వాదులు జరుగుతున్నా మార్పును గ్రహించి , అందుకు ఆహ్వానం పలకండి . లేకుంటే 50 ఏండ్ల నుంచి మీ మాటలు విని విని విసుగెత్తిన జనం మిమల్ని"ఎడమెంట్ వాదులు" గా పిలవడం ఖాయం .

 ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది "బజారువాదం ". దానినే "కాపిటలిజం అంటారు. ఆ కాపిటలిజం భారతదేశం తో సహా  వివిధ దేశాలలో ఎలా ఉందో సరదా కోసం అయినా  చాలా చక్కగా వివరించబడింది, పై చిత్రం లో . ఇదే కాపిటలిజం లో  స్త్రీల పరిస్తితి గురించి ఇంతకు ముందు పెట్టిన టపా చూడండి

మనం చూడాల్సింది " వుమెన్. ఇన్ బ్రాహ్మనిజం" కాదు".వుమెన్. ఇన్ కాపిటలిజం". http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_23.html

                                              (21/11/2015 Post Republished).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!