అల్లాఉద్దీన్ అద్భుత దీపం కంటే పవర్ఫుల్ , నరేంద్ర మోడీ గారి "పె నో ర " మంత్రం !.

                                                                               


మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠాలులో "అల్లాఉద్దీన్ అద్భుత దీపం " ఒకటి . కడు  పేద వాడైన అల్లాఉద్దీన్ అనే యువకుడు తనకు దొరికిన ఒక అద్భుత దీపం లోని భూతం సహాయంతో గొప్ప ధనవంతుడిగా మారడమే కాక , ఆ దేశ యువరాణిని కూడా పెండ్లిచేసుకునే స్థాయికి ఎదుగుతాడు . అయితే ఆ అద్భుత దీపం వలన కేవలం అల్లాఉద్దీన్ మాత్రమే ధనవంతుడు కాగలిగాడు . కానీ మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్న 8 వ తారీకు రాత్రి పూట పఠించిన మంత్రం మాత్రం దేశం లోని అనేక  మంది పేదవారిని అమాంతం తెల్లారే సరికి లక్షాధికారులని చేసింది . అదెలా జరిగింది అంటే : 

   8 వ తారీకు రాత్రి మోడీ గారు మీడియా ద్వారా అర్ధరాత్రి 12 గంటలు నుండి ఇండియన్ కరెన్సీ నోట్లలో పెద్దవి అయినా 500 మరియు 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు . డిసెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్ద నున్న పాత నోట్లను బ్యాంకు లలో మార్చుకుని కొత్త నోట్లు తీసుకోవాలని చెప్పడమే కాక అందుకు సంబంధించిన నియమ నిబంధనలు కూడా చెప్పారు. అందులో ప్రధానమైనది , 2,50, 000 రూపాయలు మించి బ్యాంకు లో డబ్బు వేస్తె దాని మీద ఐ.టి శాఖ ఆరాలు తీస్తుంది అనేది . దానితో ఇండ్లలో , ఇతర చోట్ల కట్టలు , కట్టలు కరెన్సీ దాచుకున్న "నల్ల కట్టప్ప " లకు గుండెలు గుభేలు మన్నాయి . 

                                                                                 


   
                      ఇంట్లో కుటుంబ సభ్యులు అందరివీ కలిపినా 4 5 అకౌంట్ లకంటే ఎక్కువ ఉండవు . మరిప్రభుత్వ లెక్కలోకి రాణి కోట్ల కొలది నల్ల డబ్బును ఎలా తెలుపు చేసేది? అందుకు వారికి తట్టిన ఉపాయం , పేదల "జన ధన్ యోజన " ఎకౌంట్ లను ఉపయోగించుకోవడం . గతం లో  ప్రధాన మంత్రి గారు దేశం లోని ప్రతి పేద కుటుంబానికి సైతం కనీసం 2 బ్యాంకు అకౌంట్ లు అయినా ఉండాలి అని, వాటి ద్వారానే పేదలకు  సంక్షేమ పధకాల ఫలితాలు అందాలి అనే బృహత్తర ఆశయం తో , 2017 నాటికీ ప్రతి కుటుంబానికి 2 అకౌంట్ లు చొప్పున  7.5 కోట్ల కుటుంబాలకు అకౌంట్లు తెరవాలని టార్గెట్ పెడితే , ఇప్పటికి 25 కోట్ల అకౌంట్లకు జన్ ధన్ యోజన చేరువ అయిందని ప్రభుత్వం ప్రకటించింది . అదిగో అలాంటి పేదల జన్ ధన్ యోజన అకౌంట్ లను తమ లక్ష్యం చేసుకున్నారు ,నల్ల కట్టప్పలు . 

       నల్ల కట్టప్పల ఏజెంట్లు , జన్ ధన్ అకౌంట్ లు ఉన్న పేద లను  కలిసి వారికి కమిషన్ ఇచ్చే పద్దతి మీద ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు . దాని ప్రకారం కట్టప్పలు ఇచ్చే పాత 500, 1000 రూపాయలు నోట్లు 2 లక్షలు జన్ ధన్ ఎకౌంట్ లు జమ చేస్తారు. ఆతర్వాత విత్డ్రాయల్ ద్వారా వచ్చే కొత్త నోట్లను నల్ల కట్టప్పలు తీసుకుని మళ్ళి వాటిని తమ  రహస్య స్టావ రాలలో  నిలువ చేస్తారు. దీనికి గారు జన్ ధన్ అకౌంట్ పేదలకు 20 వేలో , 30 వేలో కమిషన్ గా ముట్ట చెపుతారు . మరి ఇలా తమ అందుబాటులో ఉన్న పేదల అకౌంట్ లను  వెంటనే  ఉపయోగించుకోకపోతే వేరెవరైనా ఆ ఛాన్స్ కొట్టేసే అవకాశం ఉందనే ఆలోచనతో , ప్రకటన వెలువడిన మరు నాడే తమ ప్లాం ను అమలు చేశారట "నల్ల కట్టప్ప " లు . దానితో లక్షలాది జన్ ధన్ అకౌంట్ లలో లక్షల రూపాయలు జమ అయి తెల్లారే పాటికి పెదాలు లక్షలాది కారులు అయి పోయారు . 

     అయితే ప్రధాని గారు నోట్ల రద్దు ప్రకటన చేసినది మొదలు , I.T శాఖ , హోమ్ శాఖ వారు జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు ఉంది, వారి దృష్టికి దనా దన్ లక్షలతో నిండిపోతున్న జన్ ధన్ అకౌంట్ లు వచ్చాయి. ఇప్పుడు ఆకౌంట్ ల నుండి విత్ డ్రాయల్ అయ్యే డబ్బు నల్ల కట్టప్పల చేతికి చేరకుండా ఏ చర్యలు తీసుకోవాలా అని ప్లాను చేస్తున్నట్లు ఉంది. సరే ఇక్కడ నేను చెపుతుంది , అల్లాఉద్దీన్ అద్భుత దీపం కంటే మోడీ గారి మంత్రం పవర్ ఫుల్ అని కదా !. దానికే వస్తున్నా . 

        పై విషయం గమనిస్తే మనకు తెలుస్తోంది ఏమిటంటే , పేదవారికి , నల్ల కట్టపల సీక్రెట్ ఒప్పందం గురించి పక్కన పెడితే , భారత దేశం లోని లక్షలాది పేద వారు ఒక్క రోజులో లక్షాధికారులు అయిపోయారు . ప్రస్తుతం వారి ఎకౌంట్లలో లక్షలు ఉన్నాయి . 8 తారీకు నిరుపేదలుగా ఉన్న వారు 9 తేదీనాటికి లక్షాధికారులుగా మారి పోయారు అంటే ఎవరి మహత్యం అది . 8 వ తేదీ రాత్రి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నోటి నుండి వెలువడిన "పె  నో ర " అనే మంత్రం మహిమ కాదా ? ఇంతకీ పెనోర అంటే ఏమిటి నా? ఏమి లేదు "పెద్ద నోట్ల రద్దు " అని . ఈ పెద్ద నోట్ల రద్దు ప్రకటనే తెల్లారే పాటికి పేదలను  లక్షాది కారులను చేసింది. కాబట్టి కేవలం ఒక్కడిని మాత్రమే ధనవంతుడిని చేసిన అల్లాఉద్దీన్ అద్భుత దీపం మహిమ కంటే మోడీ గారి పెనోరా మంత్రం మహిమే గొప్పదని చెపుతుంది. 

       మనం ఇకనుండి దేశం అనే స్క్రీన్ మీద "బ్లాకు బలి " అనే సినిమాను చూడబోతున్నాం . అందులో వెర్రెత్తి ఉన్న "నల్ల కట్టప్ప"ల టక్కు , టమారా , గోకర్ణ ప్రదర్శనలను "నరేంద్ర బాహుబలి  " ప్రభుత్వం ఎలా నిలువరిస్తుందో చూడాలి . 


Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )