రూం కొస్తే మార్కులేస్తా అన్న మాస్టారికి ఒళ్లంతా "చెప్పుల మార్కులు " వేసిన మహిళలు!
కామాతురానాం న లజ్జా , న భయం అంటారు . అలాంటి కామాతురతతొ వావి వరసలు మరచిపోయి, కూతురు వయసున్న విద్యార్దిని ని అందులో ఐదో తరగతి చదివే మైనర్ బాలికను లైంగిక వేదింపులకు గురిచేస్తూ , తన పశు వాంఛ తీర్చుకోవాలని చూసిన ఒక ప్రభుత్వ ఉపాద్యాయునిక్ , అ అమ్మాయి మహిళా బందువులు చెప్పు లతో ఒళ్లంతా హూనం చేస్తూ , వీదుల వెంట నడిపిస్తూ పోలిస్ స్టేషన్ కి తీసుకు వెళుతున్న దృశ్యాలు చూస్తుంటే , చీ ! అతని దీ ఒక బ్రతుకేనా అని అనిపిస్తుంది .
విశాఖపట్నం జిల్లాలోని గొపాల పట్నం కొత్త పాలెం స్కూల్ లో ప్రభుత్వ ఉపాద్యయుడు అతను. తన శిష్యురాలైన అయిదవ తరగతి చదువుతున్న ఒక నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్దిని ని లైంగిక వేదింపులకు గురిచేయడం ప్రారంబించాడట. తన కోరిక తీరిస్తే మార్కులు ఎక్కువ వేస్తాను అని ఆశ పెట్టాడట. అయితే ఆ అమ్మాయి బయంతో బిక్క చచ్చిపోయి స్కూల్ కు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోతే విషయం రాబట్టిన తల్లి తండ్రులు , బందువులు స్తానిక మహిళా సంఘాలతో ఆలోచన చేసి ఆ కీచకుడికి తగిన బుద్ది చెప్పటానికి ఒక ప్లాన్ చేసారు .
దాని ప్రకారం ఆ అమ్మాయితో ఆ మాస్టర్ కి అంగీకారం తెలుపుతూ పోన్ చేయించే సరికి , ఉబ్బి తబ్బిబై వేళా పాళా కూడా మరచిపోయి, ముందు వెనుక కానక ఆ అమ్మాయిని ఒక చొటకి రమ్మని చెప్పి , అక్కడికి వచ్చిన అమ్మాయిని తన స్నేహితుడి రూమ్ కి తీసుకు వెళ్ళి , అత్యాచార ప్రయత్నం లో ఉండగా రెడ్ హాండెడ్ గ మహిళలు అంతా పట్టుకుంటే తప్పైందని వారిని కాళ్ళా వేళ్ళా పడుతున్న ఆ పంతులు ను చూస్తుంటే చీ, జన్మ!అనిపించక తప్పదు. ఆ తర్వాత అతనిని మహిళలు , పురుషులు చెప్పులతో కొట్టుకుంటూ వీది వెంట నడిపించుకుంటూ పోలి స్తేషన్ కి తీసుకు వెళుతుంటే అతను ఇంకా బ్రతకడం అనవసరం అనిపిస్తుంది. పోలిసులు అతని మీద కేసు పెట్టి విచారణ నిర్వహిస్తున్నారు.
అతను చేసిన నీచమైన పనిని ద్రుష్టిలో పెట్టుకున్నప్పుడు, ఆ మహిళా సంఘాలు వారు చేసినది చట్ట విరుద్దమైన పని అయినా సమర్దించక తప్పదు. ఒక వేళా అతను వారి మీద కేసు పెట్టే అవకాశమున్నా దానికి వారు అన్నింటికి సిద్దపడే అతనికి బుద్ది చెప్పారు కాబట్టి, వారు బయపడటం కాని , బాద పడటం కాని ఉండక పోవచ్చు.
కానీ చదువుకుని ఒక ప్రబుత్వ ఉపాద్యాయుడు అయి ఉండి, తన దగ్గర చదువుకునే కూతురు వయసున్న విద్యార్దిని ని , ఆమె పేద తనం అవకాశంగా తీసుకుని లైంగిక వేదింపులకు గురి చెయ్యడం అనేది ఏ మాత్రం క్షమించరాని విషయం. అతను నాగరిక సమాజం లో జీవించడానికే అనర్హుడు. అలాంటి వారికి చట్టాలు విదించే శిఖ్శలు కంటే సమాజం విదించే ఇలాంటి బహిరంగ శిక్షలే సమాజంలోఅటువంటి వారికి కొంత బయం కలిగించే అవకాశం ఉంది. కామంతో కళ్ళు మూసుకు పోయి ప్రవర్తించే వారు ఇలాంటి సంఘటణ లు చూస్తే కొంతయినా బుద్ది తెచ్చుకునే అవకాశౌంది. సంస్కర్ణత్మాక శిక్షలు అనేవి ఆవేశంలో నేరాలు చేసే మనుషులకే తప్పా, కావాలని ఇలాంటి పనులు చేసే నర రూప పశువులకు కాదు అని అనిపిస్తుంది. ఈ విషయంలో సరి అయిన విచారణ నిర్వహించి అతనిని తగిన విదంగా శిక్షించాల్సిన బాద్యత పోలిసుల పై ఉంది. విషయమై నిన్న మీడియాలో ప్రసారం చేసిన దానిని క్రింది విడియో లింక్ లో చూడవచ్చు .
http://www.sakshi.com/video/news/teacher-sexuall-harsement-on-5th-class-student-9674
(26/1/2014 Post Republished)
Comments
Post a Comment