అయిదేళ్ళ పాప మీద అత్యాచారం చేసిన 13 యేండ్ల పిల్లాడిని "మ్రుగాడు" అనవచ్చా ?
నేను మొన్న ఒక పోస్టులో స్త్రీ ,పురుషుల సహజ ప్రవృత్తిని గురించి చెపుతూ, పురుషుడు సహజంగా సెక్స్ విషయం లో చంచల స్వబావి అని, స్త్రీలకు కొంత స్వనియంత్రణ శక్తి ఉంటుందని, దాని వలన నైతిక జీవన విదానం అమలు పరచే బాద్యతను మన పూర్వికులు స్త్రీల మీద ఎక్కువుగా ఉంచారని చెప్పాను. దానికి మిత్రులొకరు అబ్యంతరం చెపుతూ, సెక్స్ విషయం లో కూడా స్త్రీ పురుషుల స్వబావం నిర్ణయించేది జన్మ కాదని, విద్య , సంస్కారం , సమాజ పరిస్తితుల వలన మనిషి వైఖరి నిర్ణయించబడుతుందని చెప్పారు. నేను ఆ వాదనతో పూర్తిగా ఏకీభవించలేక పోతున్నాను. అయన గారు చెప్పిన...