అత్యాచారాన్నీ ఆపలేకపోతే ఆనందించేయి ! అవినీతిని ఆపలేకపొతే అందలం ఎక్కించేయి !
రాజనీతి శాస్త్రం లో ఒక వాదం ఉంది . దాని పేరే ఉపయోగితా వాదం లేదా "అత్యంత ఆనంద మయ " వాదం . దీనిని ఆంగ్ల రాజనీతిజ్ణుడు అయిన "బెందాం " అనే అయన ప్రతి పాదించాడు. అయన ద్రుష్టిలో సహజ న్యాయాలు , సహజ హక్కులు అనేవి పనికి రానివి. ఏ విషయాన్ని అయినా అది కలిగించే ఆనందం , బాదల స్తాయి ద్వారానే అంచనా వేసి నిర్దారించాలంటాడు. దాని ప్రకారమే చట్ట సవరణలు కావాలన్నాడు. దీనికి ఒక ఉదాహరణ చూదాం . ఒక వ్యక్తీ వేరే వ్యక్తీ అంగీకారం లేకుండా బలవంతంగా అతని నోట్లో స్వీట్ పెట్టాడనుకోండి . దాని వలన ఆ స్విట్ తిన్న వ్యక్తికి షుగర్ వ్యాది లేనపుడు ఏమి నష్టం? ఒక మధుర పదార్దం ఆస్వాదించడం అనేదేగా జరిగింది! మరి దీనికి ఆ స...