మాయమై పోతున్న తెలుగు అమ్మాయిని రక్షించండి! (1)
మనందరికి ఒక శుభవార్త! ఏమిటంటే రెపు అక్టోబర్ 1 వ తారీకు నుండి 19 వ తారీకు వరకు 11 వ జీవ వైవిద్య సదస్సు జరగనుంది. ఎక్కడో తెలుసా ?సాక్షాత్తు మన రాజధాని నగరమైన హైదరాబాదులో. ఒక ప్రపంచ స్తాయి సదస్సు మన రాజధాని లో జరగటం మనకు శుభవార్తే కదా!. ఇంతకి జీవ వైవిద్య సదస్సు అంటే క్లుప్తంగా తెలుసుకుందాము. 460 కోట్ల సంవత్సరాలు! ఇది భూమి వయసు! భూమిని ఒక మహిళతో పోలుద్దాం!… ప్రతి 10 కోట్ల సంవత్సరాలను ఒక సంవత్సరంగా లెక్కిద్దాం! అంటే… భూమి అనే మహిళ వయసు ఇప్పుడు 46 ఏళ్లు. భూమి పుట్టి కళ్లు తెరిచిన తొలి ఏడేళ్లలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు! అది ఇప్పటికీ అంతుపట్టని రహస్యం! ఆ తర్వాత మరో 35 సంవత్సరాలపాటు భూమి జీవితంలో ఏం జరిగింది? ఈ ప్రశ్నకు అస్పష్టమైన సమాధానాలు మాత్రమే లభించాయి. భూమి 42 ఏళ్ల వయసులో… తొలి పుష్పం వికసించింది. 44 సంవత్సరాల వయసులో… రాక్షస బల్లులలాంటి భారీ సరీసృపాలు నడయాడాయి. జస్ట్… ఓ ఎనిమిది న